Vadinamma Serial June 16th Episode: ఊచించని ట్విస్ట్.. బతికి వచ్చిన సీత, అదే బతికించిందంటూ... నానికి సీక్రెట్

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మా 'వదినమ్మ' ప్రతి రోజు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి ఎపిసోడ్ లో దాదాపు ఏదో ఒక ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 బాధతోనే

బాధతోనే

సీత దాదాపుగా చనిపోయిందని అందుకే ఆమె బ్యాగ్ అలాగే ఫోన్ దొరికిందని భరత్ భావిస్తూ ఉంటాడు. బ్యాగ్ తీసుకువచ్చి చెట్లల్లో దాచేసి ఫోన్ దాచి లోపలికి తీసుకు వెళ్తాడు. ఇతరులు లోపలికి వెళ్ళాక వదినమ్మ అరగంటలో వచ్చేస్తుందని అబద్ధం చెబుతాడు. పైకి తనగదిలోకి వెళ్లి బాధపడుతున్న సమయంలో సిరి వచ్చి ప్రశ్నించగా సిరికి అసలు విషయం చెబుతాడు. కింద నుంచి రఘురాం బయటకు రమ్మని అరుస్తున్న నేపథ్యంలో వచ్చి అసలు విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు.

బతికి వచ్చిన సీత

బతికి వచ్చిన సీత

అయితే ఎంతకీ చెప్పలేక బాధ పడుతూ జేబులో ఉన్న ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టగా ఏం జరిగిందో చెప్పమని అసలు ఈ ఫోన్ ఎలా నీ చేతికి వచ్చిందో చెప్పమని రఘురాం భరత్ ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఊహించని విధంగా అదే సమయానికి ఒక కారు వచ్చి ఇంటి బయట ఆగుతుంది. ప్రేక్షకులు ఊహించని విధంగా సీత అందులోనుంచి దిగుతుంది. నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరిలోనూ సంతోషం వెల్లివిరుస్తుంది.

అందరూ కోపంగా

అందరూ కోపంగా

ఇంట్లో అడుగు పెట్టిన సీతను ముందు ఆనందంతో రిసీవ్ చేసుకున్నా సరే తర్వాత అందరూ మొఖాలు కోపంగా పెడతారు. దీంతో సీత భర్త రఘురామ్ వద్దకు వెళ్లి తన మీద కోపం గా ఉందా అని అడుగుతుంది. దీంతో అత్తగారు కల్పించుకుని కోపంగా ఉండక నువ్వు చేసిన పనికి ఎదురొచ్చి స్వాగతం పలకాలని ప్రశ్నిస్తుంది. నువ్వు చేసిన పనికి చాలా ఇబ్బందులు పడ్డామని ఆమె చెప్పుకు వస్తుంది.

 ముమ్మాటికీ తప్పే

ముమ్మాటికీ తప్పే

భర్త కు చెప్పకుండా ఇల్లు దాటడం ఒక తప్పు అయితే తమకు ఎవరికీ చెప్పకుండా కిడ్నీ దానం చేయాలని వెళ్లడం మరో తప్పని సీతను నిందిస్తుంది. అయితే బావ డబ్బు సర్దడం కోసం ఇబ్బందులు పడుతుంటే దానిని చూస్తూ ఉండలేక పోయాను అని తాను ఏమైనా సహాయం చేయగలను అని ప్రయత్నించి అలా వెళ్లాల్సి వచ్చిందని సీత వివరిస్తుంది. అలాగే తను ధాబాలో తినడానికి దిగితే బస్ వాడు వెళ్లిపోయాడని, అలా తాను బతికిపోయనని చెబుతుంది.. నాలుగు బస్సులు మారి వచ్చే సరికి ఈ సమయం అయిందని అంటుంది.

 ఆనందంలో సీత

ఆనందంలో సీత

ఇక తాను ఎంత ఎంతో బాధ పడ్డాను అని అక్కడ వెళ్ళాక డబ్బు సమకూరుతాయని భావిస్తే డబ్బు సమకూరలేదని డబ్బు తీసుకురాకుండా వచ్చినందుకు క్షమించాలని అందరినీ కోరుతుంది. దీంతో భరత్ నాని సంతకాలు పెట్టిన విషయం చెప్పి తమ అందరి కంటే నాని మీ మీద ఎక్కువ ప్రేమ మీద చూపించాడని అసలు విషయం చెబుతాడు. దీంతో సీత ఆనందంతో మునిగిపోతుంది. నానిని అభినందించగా నాని ఈ శుభ సందర్భంలో తనకు ఒకటి కావాలని అడుగుతాడు.

 నానికి సీక్రెట్ ఫోన్

నానికి సీక్రెట్ ఫోన్


ఏమిటా అని కంగారు పడుతున్న సమయంలో రవ్వ లడ్డూలు చేసి పెట్టమని కోరడంతో అందరూ నవ్వేస్తారు. ఇక సీతను అందరూ కూర్చోబెట్టి పరామర్శిస్తున్న సమయంలో నానికి ఒక ఫోన్ వస్తుంది. కాని నాని ఆ ఫోన్ ను ఎందుకో దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కొత్త ఇంట్లోకి

కొత్త ఇంట్లోకి

తదుపరి ఎపిసోడ్లో రఘురాం సకుటుంబ సపరివార సపరివార సమేతంగా చిన్న ఇంట్లోకి వెళ్తున్నారు. అయితే సీతతో కలిసి కుడికాలు ముందు పెట్టబోతున్న తరుణంలో ఇంటి ఓనర్ వచ్చి రెండు నెలల అడ్వాన్స్ ఇస్తే గాని అడుగుపెట్టనివ్వవనని అంటాడు. తమ వద్ద అంత డబ్బు లేదని కాస్త సమయం ఇస్తే సర్దుబాటు చేస్తామని సీతా చెబుతుంది. శైలు కల్పించుకుని అతనికి చెప్పే అంత విలువ లేదని చెబుతూ తన చేతికున్న గాజులు ఇచ్చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X