Vadinamma Serial June 18th Episode:కొత్త ఇంటికి రఘురామ్.. నెలకు ఒకసారే స్నానం.. అయినా వదలని రాజేంద్ర

మొన్నటి వరకు దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో సీరియల్స్ కి బాగా అలవాటుపడ్డారు. దీంతో తెలుగు సీరియల్స్ కి మంచి రేటింగ్స్ లభిస్తున్నాయి. అలా తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో కొనసాగుతున్న స్టార్ మా వదినమ్మ సీరియల్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. రఘురాం కుటుంబానికి ఎదురైన ఒక పెద్ద గండం తప్పడంతో ప్రస్తుతం కుటుంబమంతా టెన్షన్ లేకుండా ఉన్నారు ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది ? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

క్లివేజ్ షోతో షాక్ ఇస్తున్న అక్షర గౌడ

 నెలకు ఒక్క సారే స్నానం

నెలకు ఒక్క సారే స్నానం

నిన్న ఎపిసోడ్ ముగిసేనాటికి నానిని శైలు, భరత్, లక్ష్మణ్ కలిసి ఏడిపిస్తూ ఉంటారు. కొత్త ఇంట్లో షవర్ ఉండదు కాబట్టి ఇప్పుడే రెండు మూడు సార్లు షవర్ చేసి వస్తున్నానని నాని చెప్పడంతో రేపటి నుంచి షవర్ లేకపోతే స్నానం చేయవా అని భరత్ అడుగుతాడు. లేదని వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తానని నాని చెబుతాడు. మరి హాస్టల్ లో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అంటే హాస్టల్లో అయితే నెలకు ఒకసారి చేసేవాళ్ళమని తాను మాత్రమే కాదని తన స్నేహితులు అందరూ నెలకు ఒక్కసారే స్నానం చేస్తారు అని అంటాడు. దీంతో శైలు సహా భరత్, లక్ష్మణ్ ఇద్దరూ నాని ఆటపట్టిస్తారు.

అడుగు పెట్టక ముందే పరాభవం

అడుగు పెట్టక ముందే పరాభవం

ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కొత్త ఇంటికి చేరుకుంటారు. కొత్త ఇంటికి వచ్చాక పాలు పొంగించాలి అని రఘురామ్ తల్లి చెబుతుంది. అయితే ఇది మన ఇల్లు కాదు కదా పాలు పొంగించడం అవన్నీ ఎందుకు అని శైలు అడగగా మనం ఉన్నన్నాళ్ళు అది మన ఇల్లే అని అందుకే సొంత ఇంటి లాగా చూసుకోవాలి అని చెబుతుంది. అలా చెప్పడమే కాక సీత రఘురాం ఇద్దరినీ కుడి కాలు పెట్టి లోపలికి వెళ్లాలని కోరుతుంది. అలా లోపలికి అడుగుపెట్టే సమయానికి ఇంటి ఓనర్ వస్తాడు.

అలా చేశాకనే

అలా చేశాకనే

లోపలికి అడుగు పెట్టకుండా దాన్ని గట్టిగా అరుచుకుంటూ రావడంతో ఏమైందని రఘురామ్ వెనక్కి వస్తాడు. దగ్గరుండి గృహప్రవేశం చేయించాలని వచ్చారా అనడంతో అదేమీ కాదని తాను లేకుండా ఎక్కడ గృహప్రవేశం చేసేస్తారో అని అరుచుకుంటూ వచ్చానని చెబుతాడు. ఏమైంది అని ప్రశ్నించగా రెండు నెలల అడ్వాన్స్ తన చేతిలో పెట్టాకనే అప్పుడు గృహప్రవేశం చేసుకోవాలని ఇంటి ఓనర్ చెబుతాడు.

మాట తప్పి

మాట తప్పి

మనం ముందుగా మాట్లాడుకున్నది ఒక నెల అడ్వాన్స్ అనే కదా అది కూడా పది పదిహేను రోజుల తరువాత ఇస్తానని చెప్పాను కదా అని రఘురామ్ ప్రశ్నిస్తాడు. మీరు చెప్పారు సరే దానికి నేను ఒప్పుకోవాలి కదా అని ఇంటి ఓనర్ మాట మారుస్తాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రెండు నెలల అడ్వాన్స్ ఇస్తే కానీ గృహ ప్రవేశం చేయడానికి వీలులేదని అడ్డం తిరుగుతాడు. దీంతో కోపం వచ్చిన భరత్, లక్ష్మణ్ మీరు వెళ్లి గృహప్రవేశం చేయండి, ఇతను ఎలా అడ్డుకుంటారో చూస్తామని మీదకు వెళ్ళబోతారు. దీంతో రఘురామ్ ఆయన మాట తప్పి పోయాడు అని మనం మర్యాద తప్పడం సరికాదని చెబుతాడు.

గాజులు ఇచ్చిన శైలు

గాజులు ఇచ్చిన శైలు

ఇంతలో సీత కూడా ఆయనను బతిమిలాడే ప్రయత్నం చేస్తుంది. అయితే వెంటనే శైలు కల్పించుకుని ముందు ఒక మాట చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నాడు అంటే అది కావాలని చేస్తున్నాడు అని అర్థం అని చెబుతూ తన బంగారు గాజులు తీసి అతనికి ఇస్తుంది. అయితే నిజానికి శైలు తండ్రి రాజేంద్ర రఘురామ్ వాళ్ళను ఇబ్బంది పెట్టమని ఇంటి ఓనర్ ని బెదిరిస్తాడు. దీంతో అతను అలా చేయాల్సి వస్తుంది.. శైలు గాజులు ఇవ్వడంతో అవి తీసుకుని తండ్రికి తగ్గ కూతురు అని అనుకుంటూ తిరిగి రాజేంద్ర వద్దకు వెళ్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
తర్వాతి ఎపిసోడ్ లో

తర్వాతి ఎపిసోడ్ లో

అక్కడికి వెళ్ళాక రాజేంద్ర తన కూతురు గాజులు తీసుకున్నందుకు ఇంటి ఓనర్ ని చెంప పగల కొడతాడు దీంతో ఆ ఇంటి ఓనర్ రఘురాం లాంటి మంచి మనిషిని మోసం చేసినందుకు తనకు ఈ ఘనత అని బాధ పడతాడు. ఇందులో రాజేంద్ర బావమరిది కల్పించుకుని అతనిని ఓదార్చి పంపిస్తాడు. ఇక తర్వాతి ఎపిసోడ్లో ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం , గతంలో కాకుండా శైలు అన్ని పనుల్లో కల్పించుకుంటూ చురుగ్గా ఉండటం చూపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X