Vadinamma Serial June 19th Episode:దండం పెడతానన్నా ఉపయోగం లేదు.. కొత్త పాత్రల ఎంట్రీతో ఊహించని ట్విస్టులు

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. రోజుకు ఒక ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేవిషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 సరుకులు కూడా లేకుండా

సరుకులు కూడా లేకుండా

లక్ష్మణ్ కారణంగా రఘురాం కుటుంబం ఇల్లు, ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ కొత్త ఇంట్లోకి అడుగుపెడతారు. ఇంట్లో అడిగు అయితే పెట్టారు కానీ ఇంట్లో తినడానికి కూడా సరిగా సరుకులు ఉండవు. సరుకుల నిండిపోవడంతో ఆ సరుకులు సమకూర్చుకునే పనిలో పడ్డారు..

మళ్ళీ అప్పుల్లో

మళ్ళీ అప్పుల్లో

భరత్ తో పాటు రఘురాం కూడా షాప్ కు వెళ్లేందుకు సిద్ధం అవుతాడు.. దీంతో సీత వచ్చి తీసుకు రావాల్సిన సామాను లిస్టు ఇస్తుంది. అయితే ఆ లిస్టులోవో అన్నీ తేలేమని ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో షాప్ పరిస్థితి కూడా అలాగే ఉంది అని రఘురామ్ చెప్పుకు వస్తాడు. మరీ ముఖ్యంగా తమ ఆర్థిక పరిస్థితి మారిపోవడంతో అప్పు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని చెబుతాడు.

 కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ

కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ

ఇక మరో పక్క నాని ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులను ఈరోజు ఎపిసోడ్ లో చూపించారు. నాని అత్తగారు అందరినీ డామినేట్ చేస్తూ తాను చెప్పినట్లు భర్త వినాలి అని భర్త కాకుండా కూతుళ్లు ఇద్దరూ అలాగే పెద్ద కూతురి భర్త కూడా తాను చెప్పినట్టు వినాలి అనే మనస్తత్వం గల మహిళగా చూపించారు. కట్టమనేని దమయంతి ఏం చెబితే అది జరిగి తీరాలి అంటూ ఆమె క్యారెక్టర్ ను చూపించారు.

కట్టమనేని దమయంతి

కట్టమనేని దమయంతి

ఇక చిన్న కూతురుకి సంబంధాలు చూడమని భర్తకు చెబుతున్న సమయంలో ఆమె తను నాని అనే వ్యక్తిని ప్రేమించానని బ్యాక్గ్రౌండ్ కూడా అన్ని చెక్ చేసుకున్నానని పెద్దన్నయ్య కిరానా బిజినెస్ లో ఉన్నాడని రెండో అన్న కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాడు అని చెబుతోంది. మూడో అన్నకు సూపర్ మార్కెట్ ఉందని చెబుతోంది. అయితే మన ఇంటికి అల్లుడు అవ్వాలంటే అవన్నీ చాలదని ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒప్పుకున్నాడా అంటే తాను చెప్పలేదని మిగతా విషయాలు అన్నీ మీరే చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది నాని ప్రియురాలు.

ఉద్యోగాల వేటలో లక్ష్మణ్

ఉద్యోగాల వేటలో లక్ష్మణ్

ఇక మరోపక్క లక్ష్మణ్ కూడా ఉద్యోగాల వేటలో పడతాడు. షాప్ కి వెళ్తున్న అన్నయ్యలకు తోడుగా తాను వస్తానని చెబుతాడు. షాపుకి వెళ్తున్న తమ ఇద్దరికీ పని ఏమీ ఉండదని నువ్వు వచ్చి ఏమి చేస్తావ్ అని రఘురామ్ ప్రశ్నిస్తాడు. ఇంట్లో కూర్చోవడం కంటే అక్కడికి రావడం తనకు ఆనందంగా ఉంటుందని చెబుతూ లక్ష్మణ్ కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధం అవుతాడు.

శైలు కొత్త లిస్టు

శైలు కొత్త లిస్టు

ఇంతలో శైలు వచ్చి పిల్లాడికి డైపర్స్ మొదలు ఏమీ లేవని తీసుకురావాల్సిన లిస్టు మొత్తం చదివి వినిపిస్తుంది. కానీ అవి తేవడానికి లక్ష్మణ్ దగ్గర డబ్బు కూడా ఉండదు. విషయం అర్థం చేసుకున్న సీత తన దగ్గర ఉన్న డబ్బులు లక్ష్మణ్ కి ఇచ్చి పంపిస్తుంది. ఇక ఉద్యోగాల వేటలో పడిన లక్ష్మణ్ ఒక కంపెనీకి ఉద్యోగం కోసం వెళతాడు. అయితే ఇలాంటి బ్యాడ్ రిమార్క్ ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వమని చెప్పి పంపించేస్తారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
దండం పెడతా అన్నా వినకుండా

దండం పెడతా అన్నా వినకుండా

వ్యాపారంలో అప్పు పుట్టించడం కోసం రఘురాం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దండం పెడతా డబ్బులు ఇవ్వామన్నా ఎవరూ ఆయనకు ఒక రూపాయి కూడా సహాయం చేసే పరిస్థితి కనిపించదు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తర్వాతి ఎపిసోడ్లో శైలు కొడుకు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు. విషయం సీతకు చెబితే ఆమె పాల ప్యాకెట్ తీసుకు వస్తానని వెళ్లబోతోంది. అయితే అలా కాదని గతంలో ఒకసారి ఇలాగే ఏడిస్తే పాలు పట్టించినట్టుగా తల్లి పాలు ఇవ్వమని శైలు కోరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X