Vadinamma Serial June 1st Episode: అప్పు దొరికిందనుకున్న టైంలో రఘురామ్ ఫ్యామిలీకి ఊచించని షాక్..

తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో ఒకటిగా వదినమ్మ సీరియల్ కూడా ఉంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజుతో 557 ఎపిసోడ్ కి చేరింది. అనేక ట్విస్టులతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఊహించని విధంగా జనార్ధన్

ఊహించని విధంగా జనార్ధన్

ఎక్కడా అప్పు దొరకకపోవడంతో రఘురాం శైలు వాళ్ళ తండ్రి దగ్గరకు వెళ్లడానికి సిద్ధం అవుతాడు.. అయితే ఈ విషయాన్ని నాని తప్ప మిగతా ఇద్దరూ ఒప్పుకోరు. అయితే తమ్ముళ్లని అందరినీ ఒప్పించి రఘురాం శైలు సహా జనార్ధన్ ఇంటికి వెళతాడు. అయితే అక్కడ ఊహించని విధంగా జనార్ధన్ వీళ్లందరినీ బాగా రిసీవ్ చేసుకుంటాడు. తాను మారిపోయాను అన్నట్లుగా కలరింగ్ ఇస్తూ అందరినీ ఆతిధ్యం స్వీకరించమని కోరతాడు.

ఇంటి కోడలిని చేసి గొప్ప పని చేశా

ఇంటి కోడలిని చేసి గొప్ప పని చేశా

అయితే ఈ విషయంలో తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోకుండా తమ్ముళ్ళను కూడా సలహా అడగడంతో వాళ్లు కూడా సరే అంటారు. అయితే నాకు మీ కుటుంబంలో నచ్చేది ఇదే అని పేర్కొన్న జనార్ధన్ తన కుమార్తెను ఆ ఇంటి కోడలిని చేసి గొప్ప పని చేశాను అంటూ రఘురాం సోదరుల మెప్పు పొందేందుకు జనార్ధన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో తప్పక పోయినా అక్కడ భోజనం చేయాల్సి వస్తుంది.

అగ్రిమెంట్ పక్కా

అగ్రిమెంట్ పక్కా

భోజనం చేస్తున్న సమయంలో వారందరికీ శైలు తల్లి కొసరి కొసరి వడ్డిస్తుంది. అయితే ముందు ఎలాంటి అగ్రిమెంట్లు వద్దని జనార్ధన్ చెబుతాడు. కానీ రఘురామ్ లాంటి పద్ధతులు తెలిసిన వ్యక్తి అగ్రిమెంట్లు చేయకుండా ఉండడు అని జనార్ధన్ బామ్మర్ది కామెంట్ చేస్తాడు.. దీంతో రఘురాం కూడా తాను అగ్రిమెంట్ రాయడానికి సిద్ధమని అగ్రిమెంట్ తీసుకుంటా అంటేనే అప్పు తీసుకుంటాం అని తేల్చి చెబుతాడు. ఈ సంభాషణ పూర్తవగానే రఘురాం చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు.

కోయంబత్తూరుకు సీత

కోయంబత్తూరుకు సీత

వెంటనే జనార్ధన్ కూడా ఏదో మాట కలిపి ఉద్దేశంతో అక్కడికి వెళ్తాడు కానీ అవకాశం దక్కలేదు. ఇక కుటుంబం అంతా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇక అప్పు దొరికేసింది ఎలాంటి ఇబ్బందులు లేవని సంతోష పడుతున్న సమయంలో సీత కోయంబత్తూర్ వెళ్ళింది అన్న విషయం తెలుసుకుంటాడు రఘురాం. వెంటనే ఫోన్ చేసి ఆమెను మందలిస్తాడు. అప్పు దొరికిందని నువ్వు వెంటనే వచ్చేయాలని సీతకు చెబుతాడు.. అయితే జనార్ధన్ వద్దకు ఎలా వెళ్లారని సీత రఘురాంని నిలదీస్తుంది.

మళ్ళీ షాక్

మళ్ళీ షాక్

అయితే లక్ష్మణ్ కంటే పట్టింపులేమీ ఎక్కువ కాదని అనిపించిందని రఘురాం చెబుతాడు. కానీ సీత అందుకు ఒప్పుకోదు తాను వచ్చిన పని అయితే ఆ డబ్బు వస్తే అప్పుడు వాళ్ళకి డబ్బు ఇచ్చేద్దామని చెబుతుంది. ఇక ఆ తర్వాత డబ్బు తీసుకురావడానికి అగ్రిమెంట్ చేసేందుకు రఘురాం ఒంటరిగా జనార్ధన్ ఇంటికి వెళతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.. ఇక కమింగ్ అప్ లో చూపించే దాని ప్రకారం జనార్ధన్ రఘురాం కి మరో షాక్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆ షాక్ దెబ్బకి మళ్ళి కుటుంబమంతా టెన్షన్లో మునిగిపోయినట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X