Vadinamma Serial June 21st Episode: మళ్ళీ కష్టాల సుడిగుండం.. కరెంట్ కూడా లేకుండా రాత్రంతా!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ రోజుకొక ఆసక్తికరమైన ట్విస్ట్ తో సాగుతోంది. తాజా ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తుంది.. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన లక్ష్మణ్

ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన లక్ష్మణ్

గత ఎపిసోడ్ లో లక్ష్మణ్ ఉద్యోగాల కోసం రోడ్డెక్కడం, భరత్ అలాగే రఘురాం ఇద్దరూ షాప్ కి వెళ్లడం ఇంట్లో ఆడవాళ్ళూ అందరూ వంట పని మీద నిమగ్నం అవడం అందరికీ తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. లక్ష్మణ్ ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళినా అతని గతం గుర్తు చేసి నీలాంటి అశ్రద్ధగా ఉండే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని చెబుతుంటారు. దీంతో నిరాశలో కూరుకుపోయి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు.

ఆకలికి తట్టుకోలేక

ఆకలికి తట్టుకోలేక

ఇక మరో పక్క ఇంట్లో శైలు కొడుకు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు.. సెరిలాక్ లాంటిది పెడదామని ప్రయత్నం చేసినా ఇంట్లో అన్ని వస్తువులతో పాటు అది కూడా నిండుకుంటుంది. ఇక మరో పక్క సిరి వంట చేయడానికి ప్రయత్నం చేస్తుంటే గ్యాస్ కూడా అయిపోతున్నట్లు అనిపిస్తోంది. దీంతో విషయం సీతకు చెప్పడంతో సీత రఘురాంకి ఫోన్ చేసి విషయం చెబుతుంది. గ్యాస్ కూడా స్ట్రైక్ చేయడానికి సిద్ధమైందని రేపటి నుంచి పని చేయను అని చెబుతోంది అని చెబుతూ అసలు విషయం చెబుతుంది.

బాబుకి పాలు ఇచ్చిన సీత

బాబుకి పాలు ఇచ్చిన సీత

ఇక మరోపక్క శైలు కొడుకు ఎంతకు ఆకలి తీరకపోవడంతో ఏడుస్తూనే ఉంటాడు. దీంతో శైలు వాడిని తీసుకుని సీత వద్దకు వెళుతుంది. పాల కోసం ఏడుస్తున్నాడని తెలిసి సీత పాల ప్యాకెట్ తీసుకు వస్తానని బయటకు వెళ్ళబోతుంది. అయితే శైలు బయటికి వెళ్లి తేవడం కాదని ఇలాగే గతంలో ఒకసారి ఏడిస్తే నువ్వు ఎలాగ పాలు ఇచ్చావో అలాగే ఇవ్వాలని కోరుతుంది. దీంతో కన్నీళ్లు పెట్టుకుని సీత ఆ బాబుకి పాలు ఇవ్వడంతో పాలు తాగిన బాబు ఏడవడం ఆపేస్తాడు.

తన మీద తనకే అసహ్యం

తన మీద తనకే అసహ్యం

ఇక శైలు గతంలో తాను బాబుకు పాలు పట్టను అంటూ తనకు తన ఫిజిక్ ముఖ్యమని చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి తన మీద తనకే అసహ్యం కలుగుతుంది. తాను చేసిన తప్పుకు తన బిడ్డ ఇబ్బందులు పడుతున్నాడని భావించి బాధపడుతుంది. ఇంతలో రాత్రి అవుతుంది. అందరూ ఇళ్లకు చేరిన చాలా సేపటికి లక్ష్మణ్ ఇంటికి చేరుతాడు. తాను ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకడం లేదని అపార్ట్మెంట్ కూలిన విషయాన్ని ఎత్తి పొడుస్తున్నారని బాధపడతాడు.

కొంత టైం పడుతుంది

కొంత టైం పడుతుంది

అందుకే కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండమని చెప్పిన సంగతి చేసిన రఘురాం నీ మీద పడిన నింద జనం మర్చిపోవాలంటే కొంత సమయం పడుతుందని అంటాడు. ఇక ఇంతలో శైలు వచ్చి పిల్లవాడికి డైపర్లు తెచ్చావా అని అడుగుతుంది. అయితే వాడి ఫుడ్ మాత్రమే దొరికిందని డైపర్ లకు డబ్బులు సరిపోలేదు అని అంటాడు. వెంటనే శైలు డబ్బులు లేకుంటే తినడం మానేస్తామా ? అలాగే వాడి డైపర్స్ లేకుండా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
రాత్రంతా కరెంట్ కూడా

రాత్రంతా కరెంట్ కూడా

ఇంతలో సీత కల్పించుకొని ఒక అరగంటలో డ్రైవర్లు ఇప్పిస్తానని చెప్పి కానీ కొన్ని గుడ్డలను సిద్ధం చేసి డైపర్లని రెడీ చేస్తుంది. అవి చూసిన శైలు ఆశ్చర్యపోతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఎపిసోడ్లో సిరి తల్లి ఇంట్లోకి రావడం, మళ్లీ ఏదో అనాలని ప్రయత్నించడం చూపిస్తారు. అలాగే రాత్రంతా కరెంటు లేక రఘురాం కుటుంబం అంతా ఇబ్బంది పడినట్లు కూడా చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X