Vadinamma Serial June 22nd Episode: రఘురామ్ ఫ్యామిలీకి 'కరెంట్ షాక్'.. సీత ఐడియాతో సేఫ్!

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే వదినమ్మ సీరియల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో దాదాపు ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక రకమైన ట్విస్ట్ పెడుతూ వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ రోజు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సీత మీద పొడగ్తల వర్షం

సీత మీద పొడగ్తల వర్షం

డైపర్లు లేక రాత్రంతా ఎలా గడపాలి అని భయపడుతున్న శైలుకి తాను గుడ్డతో తయారు చేసిన డైపర్లు ఇచ్చి ఆ టెన్షన్ క్లియర్ చేస్తుంది సీత. సూపర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్న శైలుకు ఇది తనకు తన తల్లి నేర్పిందని చెబితే తమకు కూడా నేర్పితే తాము తమ కోడళ్లకు నేర్పుతానని శైలు సరదాగా చెబుతుంది. ఇక ఆ విధంగా రాత్రి గడుస్తోంది. తెల్లవారగానే శైలు ఇల్లు ఊడవడం మొదలుపెడుతుంది

మారిపోయిన శైలు

మారిపోయిన శైలు

అయితే శైలు ఊడుస్తూ ఉంటే చూస్తూ ఊరికే కూర్చోలేక అత్తగారు అక్కడ దమ్ము ఉందని చెబుతుంది. శైలు కూడా సీరియస్గా తీసుకోకుండా సరే అత్తమ్మ చూసి తుడుస్తాను అని చెప్పి ఊడుస్తూ ఉంటుంది. దీంతో అక్కడే ఉన్న సిరి పకపకా నవ్వుతూ ఉంటే ఎందుకు నవ్వుతున్నావ్ అని అత్తాకోడళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు మారిపోయిన శైలు కాబట్టి మీరు ఏమన్నా నవ్వుకుంటూ ఊడుస్తోందని అది ఒకప్పుడు శైలు అయితే చీపురు అక్కడ పడేసి మీరే ఊడ్చుకోమని చెప్పి వెళ్లిపోయేదని చెబుతుంది.

అత్తా కోడళ్ళ సరదా

అత్తా కోడళ్ళ సరదా

అయితే అత్త తన కోడలికి ఏమీ చెప్పకూడదా అని ఆమె ప్రశ్నిస్తే అలా ఏమీ లేదని అత్తలు కోడళ్ళకు ఏమైనా చెప్పొచ్చు అని అర్థం చేసుకునే కోడలు ఉన్నప్పుడు అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి సమస్యలు రావని సిరి చెబుతుంది. ఇది ఇలా సాగుతుండగా ఇంతలో సీత ఎంట్రీ ఇస్తుంది. అందరూ జాలీగా ఉండడంతో తనకు కూడా చెబితే తాను కూడా ఆనంద పడతాను అని చెబుతుంది. దీంతో అదేమీ లేదని జరిగిన విషయం అంతా చెప్పుకు వస్తుంది సిరి. ఇంతలో అంతకు ముందు రోజు బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ వస్తుంది.

గ్యాస్ కి కూడా డబ్బు లేకపోవడంతో

గ్యాస్ కి కూడా డబ్బు లేకపోవడంతో

అయితే గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇక మీదట కట్టెల పొయ్యి మీద వంట చేసుకుందాం అని భావించి సీత గ్యాస్ సిలిండర్ పొరపాటున బుక్ చేశాము అని చెప్పి వెనక్కి పంపించి వేస్తుంది. మిగతా ఇద్దరు కోడళ్ళు ఈ విషయం అర్థం చేసుకుని అందరం కష్టపడదామని అభయం ఇస్తారు. ఇక ఇంతలో అత్తకు స్నానానికి వేడి నీళ్ళు పెడతానని సీత అంటే తాను కూడా చన్నీళ్ళతో స్నానం చేస్తాను అని ఆమె చెబుతుంది. గ్యాస్ లేకపోతేనేమి కరెంటు ఉందిగా హీటర్ పెడతాము అని చెప్పడంతో సరే అంటుంది.

కరెంట్ షాక్..

కరెంట్ షాక్..

ఈ లోపు రెండు నెలల నుంచి కరెంట్ బిల్ కట్టలేదని చెబుతూ కరెంట్ డిపార్ట్మెంట్ నుండి ఒక వ్యక్తి వస్తాడు వచ్చి వారం రోజులు అవుతోందని బిల్లు తామే కడతామని ప్రశ్నిస్తారు సీత. ఇంతలో అక్కడికి రఘురామ్ రావడంతో విషయం తెలుసుకుని ఇంటి ఓనర్ కి ఫోన్ చేస్తారు.. తనకు తెలియదని ఇప్పుడు కట్టేసి బిల్లులో అడ్జెస్ట్ చేసుకుందామని ఇంటి ఓనర్ చెబుతాడు. తమ దగ్గర అంత డబ్బు లేదని సీత చెప్పడంతో డబ్బులు లేనప్పుడు ఇల్లు అద్దెకు ఎందుకు తీసుకున్నారు ఏదైనా సత్రంలో ఉండాల్సింది కదా అంటూ అవమానిస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
అందరూ టెర్రస్ మీదకు

అందరూ టెర్రస్ మీదకు

ఇక కరెంటు పోవడంతో ఆరోజు రాత్రంతా ఇంట్లో కరెంటు ఉండదు. పిల్లలందరూ ఏడుస్తున్న సమయంలో ఏం చేయాలో పాలు పోక సీత ఐడియా మేరకు అందరూ టెర్రస్ మీదకి వెళ్తారు. అక్కడే అంతాక్షరి ఆడుతూ తింటూ నిద్ర పోతారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ ప్రకారం సిరి తండ్రి డబ్బు తీసుకువెళ్లి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.

నేను తీసుకు వెళ్ళి ఇస్తానని సిరి తల్లి ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుంది. ఇక రాజేంద్ర కూడా తన కూతురు కష్టపడుతున్న విషయం తెలుసుకుని ఆ ఇంటికి వెళ్లి మళ్ళీ రచ్చ చేయాలని చూస్తాడు. అయితే అతనికి కూతురు నుంచి అనుకోని షాక్ ఎదురవుతుంది. అయితే అది ఏమిటి అనేది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X