Vadinamma Serial June 23rd Episode: షాకిచ్చిన సిరి తల్లి.. బస్తాలు మోస్తూ పట్టుబడ్డ లక్ష్మణ్!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

తెలుగులో సీరియల్స్ కి సైతం ఇప్పుడు విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. ఇక తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మా ఛానల్ వదినమ్మ సీరియల్ కూడా ప్రతి ఎపిసోడ్లను ఆసక్తికరంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 కరెంట్ లేక

కరెంట్ లేక

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ఇప్పుడు రఘురాం కుటుంబం ఆస్తులు అన్ని అమ్ముకొని వేరే ఇంట్లోకి అద్దెకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇంట్లో రెండు నెలలుగా కరెంట్ బిల్లు కట్టలేదని చెబుతూ కరెంట్ కట్ చేస్తారు వెళ్ళిపోతారు కరెంట్ ఉద్యోగులు. దీంతో రాత్రంతా కరెంటు లేక రఘు కుటుంబం ఇబ్బందులు పడుతూ ఉంటుంది.

 సాయం చేయబోయిన సిరి తండ్రి

సాయం చేయబోయిన సిరి తండ్రి

ఇక ఈ విషయం తెలుసుకుని సిరి తండ్రి ఇంట్లో ఉన్న ఒక పాతిక వేల రూపాయలు వాళ్లకి ఇస్తే కొంతలో కొంత కష్టాలు తీర్చిన వాళ్లమవుతాం అని భావించి అక్కడికి వెళ్ళబోతాడు. ఇంతలో సిరి తల్లి కల్పించుకుని తాను అక్కడికి వెళ్లి ఆ డబ్బు ఇస్తానని చెబుతూ ఆ డబ్బు తీసుకుని రఘురాం ఇంటికి వెళ్తుంది. ఆమె రఘురామ్ ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు ఇద్దరూ గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు. ఒకపక్క సీత మరో పక్క భరత్ ఇద్దరు పిల్లలను ఊరుకో పెట్టడానికి విసనకర్రతో విసురుతూ ఉంటారు.

మళ్ళీ సిరి తల్లి రచ్చ

మళ్ళీ సిరి తల్లి రచ్చ

ఇంట్లోకి అడుగు పెట్టి పెట్టడంతోనే పిల్లలను ఇలా ఏడిపిస్తున్నారు అని చెబుతూ సిరి తల్లి అందరి మీద విరుచుకు పడుతుంది. అయితే సిరి కూడా ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చేస్తే సహాయం చేయాలి కానీ ఇలా సూటిపోటి మాటలు అనడానికి అయితే ఇంకోసారి ఇంటికి రావాల్సిన అవసరం లేదని ముఖాన్ని తేల్చి చెబుతోంది.. అయితే డబ్బు తన దగ్గర ఉంటే సహాయం చేయనా అని ప్రశ్నించిన ఆమె నువ్వు, అల్లుడు ఇంటికి వస్తే చూసుకోగలిగిన స్తోమత ఉంటుంది కానీ మీకు అప్పులు ఇచ్చే అంత పెద్ద వాళ్ళం కాదు అని చెబుతోంది.

 ఆ ప్రస్తావనే లేకుండా షాక్

ఆ ప్రస్తావనే లేకుండా షాక్

నిజానికి అప్పటికే సిరి తండ్రి తన డబ్బు పంపిన విషయం రఘురామ్ కి ఫోన్ చేసి చెబుతాడు. దీంతో కాసేపట్లో మన సమస్య తీరిపోతుంది అప్పటికే రఘురాం అందరికీ చెప్పి ఉంటాడు. ఇక గాలి వానలా వచ్చిన సిరితల్లి అంతే వేగంగా డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. దీంతో రఘురాం సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని, మామయ్య డబ్బు ఇచ్చి పంపితే డబ్బులు ఇవ్వకుండా అత్తయ్య వెళ్ళింది అని చెబుతాడు. ఇప్పటిదాకా మాట కటువైనా మనసు మంచిదని భావించానని కానీ మాటతో పాటు మనసు కూడా కటువే అని ఇప్పుడు గ్రహిస్తున్నారు అని చెబుతాడు.

రోజూ వెతుక్కోవడమే

రోజూ వెతుక్కోవడమే

ఇదంతా జరిగిన వెంటనే సీత ఆ రోజు మధ్యాహ్నానికి అన్నం ఎలా వండాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. బయట కూర్చుని టెన్షన్ పడుతున్న సీత దగ్గరకు వెళ్లి మామూలుగా ఇప్పుడు వంట సమయం కదా ఇప్పుడు హడావిడి పడతావు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని అడిగితే ఇంట్లో సరుకులు నిండుకున్నాయనే విషయం చెబుతుంది.. అయితే ఈ రోజుకు సరిపడా సరుకులు తెచ్చానని చెప్పిన రఘురామ్ ఎలా తెచ్చాను అనే విషయాన్ని అడగవద్దని అంటాడు. సీత కూడా తాను అత్తగారికి మందులు సమకూర్చానని ఎలా సమకూర్చారు అనేది కూడా అడగవద్దని సరదాగా చెబుతుంది.

కట్టెల పొయ్యి మంచిది

కట్టెల పొయ్యి మంచిది

ఇక ఇద్దరూ కలిసి కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా రఘురాం చేయి కాల్చుకుంటాడు, సీత బాధపడుతున్న సమయంలో భాస్కర్ ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చి ఏంటి ఇలా కట్టెల పొయ్యి మీద వంట వండుతున్నారని ప్రశ్నిస్తే కట్టెల పొయ్యి వంట ఒంటికి మంచిదని ఎవరో చెప్పారట అని రఘురాం చెబుతాడు. గ్యాస్ లేదనే విషయాన్ని ఎంత అందంగా అబద్ధం చెబుతున్నారు అంటూ ఆయన బాధపడి కరెంట్ లేని విషయాన్ని కూడా గుర్తు చేస్తాడు. ఇప్పుడే కరెంటు పోయింది అని సీత అబద్ధం చెబితే వెళ్లి స్విచ్ వేసి కరెంటు వచ్చింది అని చెబుతాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
బస్తాలు మోస్తూ

బస్తాలు మోస్తూ

ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. బహుశా భాస్కర్ కరెంట్ బిల్లు కట్టి ఉండొచ్చు. ఇక పని కోసం వెళ్ళిన లక్ష్మణ్ ఒక రైస్ మిల్లు లో సూపర్వైజర్ పని అడుగుతాడు. అయితే ఆ వెంటనే బియ్యం బస్తా మోసుకు వెళుతున్న సమయంలో అది జారిపోతుంది. అప్పుడే బియ్యం లోడ్ కోసం అక్కడికి వచ్చిన భరత్ లక్ష్మణ్ ను చూసి గుర్తు పడతాడు. దీంతో తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X