Vadinamma Serial June 24th Episode: రాజేంద్రకి ఘోర అవమానం.. సీత తండ్రి మెడ మీద కత్తి పెట్టిన తల్లి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలై జనజీవనం సాధారణంగా సాగిపోతున్నా తెలుగులో సీరియల్స్ కి మాత్రం ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కరెంట్ బిల్ కట్టేసిన భాస్కర్

కరెంట్ బిల్ కట్టేసిన భాస్కర్

నిన్నటి ఎపిసోడ్ లో సీత అన్నయ్య భాస్కర్ వచ్చి కరెంట్ బిల్లు కట్టిన సంగతి తెలిసిందే.. కరెంట్ బిల్లు కట్టడమే కాక తాను సీతకు చీరలు పెట్టాలని అనుకుంటూ ఉంటాను అని కానీ ఎప్పుడూ కుదిరేది కాదు అని చెబుతూ వాటి డబ్బు అంటూ సీతకు ఇవ్వబోతాడు. అయితే చాలా సేపు తటపటాయించిన సీత, ఇచ్చేది తన అన్నయ్యే కదా అని తీసుకుంటుంది. ఇక భాస్కర్ అలా వెళ్లాడో లేదో శైలు ఇల్లు మొత్తం తుడిచే పనిలో బిజీగా ఉంటుంది.

రఘురామ్ ఫ్యామిలీ మీద మళ్ళీ రాజేంద్ర ఎటాక్

రఘురామ్ ఫ్యామిలీ మీద మళ్ళీ రాజేంద్ర ఎటాక్

ఈ క్రమంలో వచ్చిన రాజేంద్ర తమ కూతురి చేత పనులు చేయిస్తున్నారు అని చెబుతూ రఘురాం ఫ్యామిలీ మీద విరుచుకు పడతాడు. తన మీద కోపం ఉంటే తన మీద తీర్చుకోవాలని ఇలా తన కూతురుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెబుతూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తాడు. ఇంతలో శైలు కూడా కల్పించుకుని తన కుటుంబం ఇదేనని తేల్చి చెబుతోంది.. అయితే వాళ్ళు నిన్ను పని మనిషిగా వాడుతున్నారని, కోటీశ్వరులు నీకు ఇలాంటి పనులు చేయాల్సిన కర్మ ఏం పట్టిందని రాజేంద్ర ప్రశ్నిస్తాడు.

ఘోర అవమానం

ఘోర అవమానం

దీంతో శైలు తండ్రిని సైతం ఘోరమైన మాటలు అని ఆయన చేసిన తప్పులు అన్నింటినీ ఎత్తి చూపిస్తుంది. ఇంతలో ఆయన డబ్బు ఇవ్వబోతే ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించిన శైలు ఇకమీదట తన చూడాలి అనిపిస్తే ఏవైనా ఆపిల్స్ లాంటివి తీసుకు వచ్చి చూసి వెళ్లిపోవాలని ఇలా డబ్బు విసరడానికి అయితే రావాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెబుతోంది. ఇక శైలు లోపలికి వెళ్లిపోగా రాజేంద్ర రఘురామ్ ను నిందించే ప్రయత్నం చేస్తాడు. రఘురాం కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాజేంద్ర దీటైన సమాధానం చెప్పి పంపిస్తాడు.

మిల్లులో ఉద్యోగం

మిల్లులో ఉద్యోగం

ఇక మరో పక్క ఉద్యోగ ప్రయత్నాల కోసం బయటకు వెళ్ళిన లక్ష్మణ్ ఎట్టకేలకు ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు. ప్రతిరోజూ సరుకుల కోసం ఎదురుచూస్తున్న వదిన పరిస్థితి గుర్తు తెచ్చుకుని చాలా బాధపడతాడు.. ఏదో ఒక పని చేయడం ముఖ్యమని భావించి రైస్ మిల్ లో సూపర్వైజర్ గా చేరి ఆ డబ్బుతోనే ఇంటికి సరుకులు కూడా తీసుకు వస్తాడు. లక్ష్మణ్ కి ఉద్యోగం వచ్చిందని తెలుసుకుని, ఇంట్లోని అందరూ చాలా సంతోషిస్తారు అయితే లక్ష్మణ్ పూర్తి విషయాలు ఇంట్లో వెల్లడించడు.

సిరి తండ్రి మెడ మీద కత్తి

సిరి తండ్రి మెడ మీద కత్తి

ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ లో ఇంటి పరిస్థితి బాలేదు అని కిరణా షాప్ కి కూడా ఎవరు అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని రఘురామ్ చెబుతాడు. అయితే తన డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకు వచ్చి దాని మీద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన లోన్ తీసుకోవచ్చు అని సిరి సలహా ఇస్తుంది. సలహా ఇవ్వడమే గాక దానిని తీసుకురావడానికి ఇంటికి కూడా వెళుతుంది. సర్టిఫికెట్ తీసుకుని బయటికి వెళ్లిపోతున్న సమయంలో సిరి తల్లి ఏకంగా తండ్రి మెడ మీద కత్తి పెట్టి సిరి బయటకు వెళ్ళకుండా అడ్డుకోవడం చూపించారు.. దీంతో తర్వాత ఎపిసోడ్ మాత్రం హైలెట్ గా నిలబడుతుందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X