Vadinamma Serial June 25th Episode: మూటలు మోస్తూ దొరికేసిన లక్ష్మణ్.. ఎవరూ ఊహించని షాక్ ఇచ్చిన శైలు!

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా ఉంది స్టార్ మా లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్లో రఘురాం ఫ్యామిలీకి అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. వాటన్నిటినీ దాటుకుని రఘురాం ఫ్యామిలీ ఎలా మళ్లీ పుంజుకుంటుంది అనే కాన్సెప్ట్ మీద సీరియల్ నడిపిస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఉద్యోగం దాచిన లక్ష్మణ్

ఉద్యోగం దాచిన లక్ష్మణ్

రైస్ మిల్లు లో గుమాస్తాగా ఉద్యోగంలో చేరిన లక్ష్మణ్ తన అన్న, వదినలు ఇంట్లో సరుకులు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుంటాడు. దీంతో ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే ఓనర్ దగ్గర కొంత డబ్బు తీసుకుని ఇంటికి సరుకులు అన్నీ కొనుక్కుని వెళతాడు. తాను తీసుకు వెళ్ళిన సరుకులు ఇంట్లో ఇచ్చి, అందరికీ స్వీట్ తినిపిస్తాడు. ఇక లక్ష్మణ్ కి ఉద్యోగం రావడంతో తమ కష్టాలు తీరిపోయినట్లే అని అందరూ భావిస్తారు. అయితే లక్ష్మణ్ కూడా వాళ్లందరినీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని భావించి తాను చేస్తున్నది సూపర్వైజర్ ఉద్యోగం అని ఇంట్లో వాళ్ళకి చెప్పడు.

మూటలు మోస్తూ దొరికిన లక్ష్మణ్

మూటలు మోస్తూ దొరికిన లక్ష్మణ్

ఇక ఉద్యోగానికి వెళ్ళిన లక్ష్మణ్ అక్కడ ఎప్పటిలాగే బిజీగా ఉంటాడు. అయితే రైస్ మిల్ లో లోడ్ దింపడానికి వచ్చిన ఒక ట్రక్ డ్రైవర్ కూలి ఎక్కువ ఇస్తే గాని అందులోనుంచి సరుకు దించే ప్రసక్తి లేదని చెబుతాడు. అయితే ఇదంతా చూస్తున్న లక్ష్మణ్ మీరు ఇవ్వాలనుకున్న డబ్బు తనకే ఇస్తే తానే లోడ్ తీస్తానని చెబుతాడు.

నువ్వు అలాంటిది చేయలేవు అని చెబితే మీకు మనిషి అవసరం నాకు డబ్బు అవసరం, ఆత్మాభిమానంతో నేను చేయకుంటే ఆ డబ్బులు మిస్ అవుతాను కదా అని చెబుతూ లోడ్ దించడానికి సిద్ధమై లోడ్ దించుతూ ఆపసోపాలు పడుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళుతున్న భరత్ బండిలో పెట్రోల్ అయిపోతుంది.

ఎవరికీ చెప్పవద్దని

ఎవరికీ చెప్పవద్దని

ఎదురుగా ఉన్న మిల్లులో ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమోనని ఉద్దేశంతో లోపలికి వెళ్తాడు భరత్. అక్కడ లక్ష్మణ్ మూట జారవిడుస్తూ ఉన్న సమయంలో భరత్ పరుగెత్తుకు వెళ్ళి పట్టుకుంటాడు. ఏమయ్యా పనికి కొత్త ? అని ప్రశ్నిస్తున్న సమయంలో అతను ఎవరో కాదు తన సోదరుడు లక్ష్మన్ అని తెలుసుకుంటాడు.

దీంతో ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నించి ఇలా చేస్తే నీ మీద నీకు నమ్మకం తగ్గిపోతుంది కదా అని ప్రశ్నిస్తాడు. తాను ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక భర్తగా ఫెయిల్ అయ్యాను అని, కనీసం ఒక మంచి తండ్రిగా అయినా కొడుకును పోషించుకుంటూ ఉండవద్దా ? అని ప్రశ్నిస్తాడు లక్ష్మణ్. ఈ విషయం అన్నా వదినలకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని కోరతాడు.

అప్పు ఎలా

అప్పు ఎలా

బాధ పడిన భరత్ అక్కడ నుండి వెళ్ళి పోతాడు, ఇంటికి వచ్చి సిరికి విషయం చెప్పి బాధపడతాడు. అయితే సిరి ఈ విషయాన్ని బావగారికి చెబుతామని అంటుంది. అయితే నేను ఎవరికీ చెప్పను అని లక్ష్మణ్ కి మాట ఇచ్చానని, అలాంటి ప్రయత్నాలేవీ చేయవద్దని భరత్ కోరతాడు. ఇక ఇంట్లో అందరిని సమావేశ పరిచిన రఘురాం, మళ్లీ మన కిరాణా షాపు ఒక కొలిక్కి రావాలంటే రెండు మూడు లక్షల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుందని అది ఎలా సాధించాలో చెప్పే సలహాలు కోరుతాడు.

కొత్త ఐడియా ఇచ్చిన సిరి

కొత్త ఐడియా ఇచ్చిన సిరి

ఇక శైలు కల్పించుకొని లక్ష్మణ్ కి ఉద్యోగం వచ్చింది కదా ఇప్పుడు కిరాణా షాప్ గురించి బాధపడాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తుంది. ఇక సీత కల్పించుకుని లక్ష్మణ్ కి ఉద్యోగం వచ్చినా సరే బాధ్యతలన్నీ వాడి మీద పడేయడం కరెక్ట్ కాదని అందరూ తలా కొంత సంపాదిస్తే ఇబ్బంది ఉండదని చెబుతోంది. ఇక రెండు మూడు లక్షలు పెట్టుబడి కోసం ఎవరిని అడగాలి అని తర్జనభర్జన పడుతున్న నేపథ్యంలో వాళ్లను వీళ్లను అడగడం కంటే సర్టిఫికెట్లు బ్యాంకులో షూరిటీ పెట్టి లోన్ తీసుకురావడం బెటర్ అని చెబుతుంది.

షాక్ ఇచ్చిన శైలు

షాక్ ఇచ్చిన శైలు

ఇక ఆ సర్టిఫికెట్ల కోసం ఇంటికి వెళ్ళిన, సిరి తల్లి ఏకంగా తండ్రి మెడ మీద కత్తి పెట్టడంతో వాటిని తీసుకోలేకపోయింది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో శైలు తన సర్టిఫికెట్లు పెట్టి లోన్ తీసుకురమ్మని చెబుతుంది, అలాగే ఇక మీద కిరాణా షాపు వ్యవహారాలు, అన్నీ తానే చూసుకుంటానని నేనే బాసునని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే లాగే కనిపిస్తోంది.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X