Vadinamma Serial June 26th Episode: మళ్ళీ మొదటికొచ్చిన శైలు.. మొదలైన ముసలం!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రేక్షకులలో ప్రతిరోజు ఆసక్తి రేకెత్తిస్తోంది.. రోజూ ఏదో ఒక రకమైన ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్లో తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సర్టిఫికెట్ కోసం ఇంటికి సిరి
సిరి తన డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం తన ఇంటికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంటికి వచ్చిన కూతుర్ని తల్లి సాదరంగా ఆహ్వానిస్తుంది. తను అన్ని మాటలు అంటుంటే ఇంటికి ఇంకా రావేమో అని అనుకున్నాను అని తల్లి చెబుతుంది. అయితే అదేమీ లేదని చెబుతూ అయిమా తను వచ్చింది కూర్చుని ముచ్చట్లు పెట్టడానికి కాదని తన డిగ్రీ సర్టిఫికెట్ తీసుకువెళ్లడానికి అని చెబుతుంది. ఇప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ తో ఏం పని వచ్చింది ? ఏదైనా ఉద్యోగానికి వెళుతున్నావా అని తండ్రి ప్రశ్నిస్తాడు.

ససేమిరా అన్న తల్లి
ఉద్యోగానికి వెళ్లడం కాదని ప్రస్తుతం కుటుంబమంతా ఇబ్బందుల్లో ఉన్న కారణంగా కిరణా షాప్ కి పెట్టుబడి కోసం అప్పుడు కూడా ఎక్కడ దొరకడం లేదని అందుకే తన డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టి లోన్ తీసుకుందామని చెబుతూ ఇంట్లోకి వెళ్లి సర్టిఫికెట్స్ తీసుకోబోతుంది. అలా వెళ్లబోయే అందులో తల్లి అడ్డుపడుతుంది.. దానికి తను ససేమిరా ఒప్పుకోదు, డిగ్రీ సర్టిఫికెట్ తీసుకు వెళ్లడానికి వీలు లేదని చెబుతోంది. తాను నీ పర్మిషన్ కోసం ఇక్కడికి రాలేదని సర్టిఫికెట్స్ తీసుకు వెళ్లడం ఖాయం అని చెబుతూ లోపలికి వెళ్తుంది.

సిరి తండ్రి మెడ మీద కత్తి
డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుని బయటకు వస్తున్న సమయంలో సిరి తల్లి తన మెడ మీద కత్తి పెట్టుకుని నువ్వు సర్టిఫికెట్లు తీసుకొని వెళితే తాము గొంతు కోసుకుంటానని బెదిరిస్తుంది. ని ఇస్తుంది. అయితే తల్లి ఏమి చేసుకోదని భావించిన సిరి బయటకు వెళ్ళిపోబోతుంది, ఇంతలో భర్త, నీ ప్రాణం అంటే నీకు చాలా తీపి నువ్వు ఎలాగూ చావు అవతల వాళ్ళని చంపుతావు అనడంతో ఆ కత్తి సిరి తండ్రి మెడమీద పెడుతుంది. సర్టిఫికెట్స్ తీసుకు వెళితే మీ నాన్నని చంపి నేను చస్తానని సిరి తల్లి బెదిరిస్తుంది. ఇక ఏం చేయాలో పాలుపోక సిరి సర్టిఫికెట్స్ అక్కడే వదిలేసి వస్తుంది.

మళ్ళీ ఇంటికి శైలు
ఇంటికి వచ్చి జరిగిన విషయం పూర్తిగా చెప్పకుండా తన తల్లి కాదు అనేసరికి తీసుకు రాలేకపోయాను అని అబద్ధం చెబుతోంది. ఇక నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు నీ తప్పేమీ లేదని రఘురాం చెబుతాడు. ఇంతలో భరత్ తాను వెళ్లి తీసుకు వస్తానని అలా అడగడం కరెక్ట్ కాదని అందరూ వస్తారు. ఇంతలో శైలు తాను వెళ్ళి తన ఇంట్లో ఉన్న సర్టిఫికెట్స్ తీసుకువస్తానని బయలుదేరుతుంది. అలా వెళ్లిన శైలు తండ్రితో నేరుగా మాట్లాడకుండా మామను అడ్డుపెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది

మళ్ళీ మొదటికి వచ్చిన శైలు
తర్వాత కమింగ్ అప్ లో చూపించిన ప్రకారం సీతను శైలు వెయ్యి రూపాయలు డబ్బులు కావాలని అడుగుతుంది. శైలు ఎందుకు అడిగింది అనే విషయం కూడా ఆలోచించకుండా సీత వెంటనే తన దగ్గర అంత డబ్బు లేదని 300 రూపాయలు ఇస్తానని చెబుతుంది. అయితే డబ్బులు ఉన్నా లేవని చెబుతున్నారు అని, తాను ఎంతగా కలిసి పోవాలని అనుకుంటున్నా మీరు నన్ను వేరే దానిలాగా చూస్తున్నారు అని చెబుతూ శైలు మళ్ళీ మొదటికి వస్తుంది. అయితే తదుపరి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మళ్లీ సోమవారం వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











