Vadinamma Serial June 2nd Episode: : సీతకి కిడ్నీ గండం.. ఐదు కోట్ల రూపాయల కోసం ప్రాణాలు పణంగా..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ ఇంకా కొనసాగుతుండడంతో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో టెలివిజన్ సీరియల్ రేటింగ్స్ కూడా దూసుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ లో ఉన్న వదినమ్మ సీరియల్ రోజుకొక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటూ ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే

 హామీ ఇచ్చిన జనార్ధన్

హామీ ఇచ్చిన జనార్ధన్

లక్ష్మణ్ కోసం 20 కోట్లు అప్పు కట్టేందుకు కుటుంబంతో సిద్ధమవుతారు. అయితే పదిహేను కోట్ల రూపాయల సమకూరుతాయి కానీ మరో ఐదు కోట్ల రూపాయల కోసం అనేక తంటాలు పడతారు. అయితే ఆ అయిదు కోట్ల రూపాయలు తాను ఇస్తానని జనార్ధన్ హామీ ఇస్తాడు. ఈ మేరకు అన్నదమ్ములకు హామీ ఇవ్వడంతో వాళ్లంతా సంతోషంతో ఇంటికి తిరిగి వస్తారు.

 కోయంబత్తూర్ కి సీత

కోయంబత్తూర్ కి సీత

అయితే సీత డబ్బు కోసం తన స్నేహితురాలు చెప్పినట్టు కోయంబత్తూర్ వెళుతుంది.. సీత అలా వెళ్లడం ఇష్టం లేని రఘురాం సీతను మందలిస్తాడు. అయితే సీత కూడా డబ్బు కోసమే వెళ్లానని ఆ డబ్బు అందగానే తిరిగి వస్తానని చెబుతుంది.. అయితే జనార్ధన్ వద్ద డబ్బు అడిగిన సంగతిని రఘురాం సీతకు తెలియజేస్తాడు. ఈ విషయం మీద ఆమె కోప్పడుతుంది.

అగ్రిమెంట్ లో రూల్

అగ్రిమెంట్ లో రూల్

అలా చేయడం సరికాదని రఘురామ్ కి చెబుతుంది. అయితే రఘురామ్ ఇంతలో ఒక షాకింగ్ విషయాన్ని సీతకి వెల్లడిస్తాడు. తాను అగ్రిమెంట్ లో సంతకం చేయడానికి వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ లో ఒక రూల్ ఉందని తాను ముందు తటపటాయించినా చివరికి అదే కరెక్ట్ అని ఒప్పుకున్నానని చెబుతాడు. ఇంతకీ అగ్రిమెంట్ అంటే అప్పుడు తీసుకున్నప్పటి నుంచి తన కుమార్తె అల్లుడు ఇద్దరు తన ఇంట్లోనే ఉండాలని జనార్ధన్ అగ్రిమెంట్ లో రూల్ పెడతాడు.

చివరికి సంతకం

చివరికి సంతకం

అప్పుగా తీసుకుని వాళ్లకు కట్టేసి ఈ అత్తారింట్లో ఉంచుతారో లేక అప్పు కట్టకుండా పోలీసుల అత్తారింటికి పంపిస్తారో తేల్చుకోవాలని రఘురాం కి చెబుతాడు జనార్ధన్. పలు తర్జనభర్జనల అనంతరం రఘురాం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి అప్పు తీసుకోవడానికి సిద్ధమవుతాడు. ఇది ఈ విషయానికి సీత కూడా బాధపడుతుంది. లక్ష్మణ్ కి ఇష్టం లేకుండా ఇంటికి ఎలా పంపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

 సీతకి కిడ్నీ గండం

సీతకి కిడ్నీ గండం

ఇక ఆ తర్వాత సీత కోయంబత్తూరు వచ్చిన విషయాన్ని ఈరోజు ఎపిసోడ్ లో వెల్లడించారు. సీత స్నేహితురాలికి స్నేహితురాలైన మరో మహిళకు కిడ్నీ అవసరమైతే సీత కిడ్నీ దానం చేయడానికి ముందుకు వస్తుంది. ఆ కిడ్నీ అవసరమైన మహిళ అన్న శ్రీమంతుడు కావడంతో కిడ్నీ ఇచ్చిన తర్వాత అప్పు అడగవచ్చు అనే ఉద్దేశంతో సీత కోయంబత్తూర్ వెళుతుంది.

 ఇచ్చినా ఇవ్వకున్నా

ఇచ్చినా ఇవ్వకున్నా

అయితే అనుకోని పరిస్థితుల్లో కిడ్నీ ఇవ్వడానికంటే ముందే ఈ విషయాన్ని సదరు మహిళ అన్నకు సీత తెలియజేస్తుంది. తనకు అప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా తన కిడ్నీ దానం చేస్తానని కానీ వీలుంటే మాత్రం ఐదు కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వాలని కోరుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
లక్ష్మణ్ కి షాక్

లక్ష్మణ్ కి షాక్

ఇక కమింగ్ అప్ లో తన తండ్రి గొప్పతనాన్ని శైలు తన నెలల బిడ్డకి వివరిస్తూ ఉంటుంది.. తన తండ్రి చాలా గొప్పవాడని ఆ బిడ్డకు చెబుతుండడంతో లక్ష్మణ్ కల్పించుకుని అంత గొప్ప వాడైతే నేరుగా సహాయం ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నిస్తాడు.. అలాగే తన భార్యతో కలిసి ఇద్దరూ అత్తారింటికి వెళ్లాలి అని తెలుసుకున్న లక్ష్మణ్ ముందు షాక్ కి గురి అవుతాడు, ఆ తర్వాత ఏం జరగనుంది అనేది తదుపరి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X