Vadinamma Serial June 30th Episode: అడ్డంగా దొరికేసిన లక్ష్మణ్, శైలు రచ్చ.. వచ్చిపడిన మరో గండం!
ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న స్టార్ మా ఛానల్ వదినమ్మ సీరియల్ రోజూ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తో నడుస్తోంది. ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో కూడా అలాంటి ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఈ ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫ్రెండ్ ఫంక్షన్ లో
శైలు తన స్నేహితురాలి పుట్టిన రోజు ఫంక్షన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా ఆ స్నేహితురాలు ఎవరో కాదు లక్ష్మణ్ పనిచేస్తున్న మిల్ ఓనర్ చెల్లెలు. అయితే మిల్లులో పనిచేస్తున్న వారందరూ వేరే ఫంక్షన్ కి వెళ్లడంతో పుట్టినరోజు ఫంక్షన్ లో చిన్నా చితకా పనులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

దాగుడుమూతలు
అయితే తన ఓనర్ ఏ కదా అనే ఉద్దేశంతో లక్ష్మణ్ ఆ పనులు చేయడానికి సిద్ధపడతాడు. అయితే అప్పటికే అక్కడికి శైలు చేరుకుంటుంది. చాలా సేపు ఒకరికి ఒకరు ఎదురు పడకుండానే ఉంటారు. అయితే అతనిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుండడంతో పాటు మొఖం ఎంత సేపటికి కనపడకపోవడంతో శైలు అతనిని ఎలా అయినా చూడాల్సిందే అని ఫిక్స్ అవుతుంది.

అలా దొరికేశాడు
ఆ ఉద్దేశంతో అతని చేత కూల్ డ్రింక్ తెప్పించమని ఫ్రెండ్ అని అడుగుతుంది. ఫ్రెండ్ కోరగా లక్ష్మణ్ డ్రింక్ తీసుకువెళ్లి శైలుకి ఆమె ఫ్రెండ్ కి ఇవ్వబోతాడు. లక్ష్మణ్ ని అక్కడ చూసిన శైలు షాక్ కి గురవుతుంది. సీరియస్ అయి పరోక్షంగా లక్ష్మణ్ ని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే లక్ష్మణ్ ని చూసిన మిల్లు ఓనర్ బంధువులు కుర్రాడు బాగున్నాడు మీ చిన్న చెల్లికి కట్టేద్దామా ఏంటి అంటూ కామెంట్ చేయడం కూడా శైలు వింటుంది.

అత్త మీద కోపం దుత్త మీద
ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి తన కొడుకు ఏడుస్తూ ఉంటాడు, సిరికి అప్పజెప్పిన నేపథ్యంలో ఆమె సరిగా చూసుకోవడం లేదంటూ ఆమె మీద పెద్దఎత్తున విరుచుకు పడుతుంది. అయితే ఇది తన మీద కోపం కాదని సిరికి అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి సాహసించ లేకపోతుంది.

సిరి తప్పేమీ లేదు
ఇంతలో సీత కూడా వచ్చి సిరి తప్పేమీ లేదని వైదేహికి జ్వరంగా ఉండడంతో ఆమెను ఎత్తుకుందని చెబుతుంది. ఇక పనులన్నీ ముగించుకుని వచ్చిన లక్ష్మణ్ ని శైలు నిలదీస్తుంది. అతను తన స్నేహితురాలి అన్న మిల్లులో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు అనే విషయాన్ని కుటుంబం ముందు చెబుతోంది. అంతేకాక తనని మోసం చేశాడని చెబుతూ పెద్ద రచ్చ చేస్తుంది,
Recommended Video

ఉద్యోగం మానేయమన్న శైలు
అయితే తప్పక చేస్తున్నానని, మొదటి సారి అబద్దం చెప్పినందుకు క్షమించమని అడుగుతాడు. అయితే క్షమించాలంటే ఉద్యోగం మానేయాలని శైలు కండిషన్ పెడుతుంది. అయితే మానేస్తానని, కాస్త టైం ఇవ్వమని లక్ష్మణ్ కోరతాడు. ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాతి ఎపిసోడ్ లో వైదేహీకి జ్వరం వస్తుంది. అది ఏదో పెద్ద జబ్బు అన్నట్టు చూపించారు. ఏం జరగనుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











