Vadinamma Serial June 3rd Episode: సీత కిడ్నీ దానంలో ఊహించని ట్విస్ట్.. లక్ష్మణ్ అరెస్ట్!
ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగి పోతుంది వదినమ్మ సీరియల్. ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నడుస్తున్న సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఒప్పుకోవద్దన్న సీత
లక్ష్మణ్ జైలుకు వెళ్లకుండా 20 కోట్లు కట్టడానికి రఘురాం కుటుంబం అంతా అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీత ఆ డబ్బు తానే సర్దుబాటు చేస్తానని రాజేంద్ర చెప్పినట్లు లక్ష్మణ్ శైలు ఇద్దరినీ ఆయన ఇంటికి పంపడానికి ఒప్పుకోవద్దు అని రఘురాంకి చెబుతోంది. స్వతహాగా, తనకు అలాగే కుటుంబానికి కూడా ఈ విషయం ఇష్టం లేకపోవడంతో రఘురాం రాజేంద్ర ఇంటికి వెళతాడు.

షాకిచ్చిన రఘురాం
రఘురాం సంతకం చేస్తారని భావిస్తూ చిరు మందహాసంతో ఉన్న రాజేంద్రకు రఘురాం షాక్ ఇస్తాడు. ఊహించని విధంగా అగ్రిమెంట్ పేపర్లు చింపేసి ఆ ఒప్పందానికి అసలు ఎలా ఒప్పుకుంటాం అని భావించారు అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. తన భార్య సీత ఇలా అగ్రిమెంట్ అడిగినందుకు చెంప పగల కొట్టమని చెబుతూనే లక్ష్మణ్ జైలుకు వెళితే ఏదో ఒక రోజు బయటకు వస్తాడు కానీ మీ ఇంటికి వస్తే తిరిగి రాడు అని చెప్పింది అని రఘురాం తేల్చి చెబుతాడు.

రాజేంద్ర చాడీలు
అలాగే ఈ వ్యవహారం జరిగిన వెంటనే వెళ్ళి పోతూ తాను ఎప్పుడు వెళ్ళిపోతానా అని మీ బావ ఎదురుచూస్తున్నాడని కానీ తనకు మాత్రం కొద్ది సేపు ఇక్కడే ఉండి మీ బావ బిక్కమొహం చూడాలని ఉంది అంటూ రాజేంద్ర బావమరిదితో రఘురాం టైర్లు వేస్తాడు. ఇక రఘురాం ఇంటికి వచ్చేసరికి రాజేంద్ర విషయాన్ని కూతురికి చేరవేస్తాడు. తాను పెట్టిన అగ్రిమెంట్ చెప్పి దానికి ఒప్పుకోమంటే రఘురాం ఒప్పుకోలేదని చాడీలు చెబుతాడు.

సీత కిడ్నీ దానం
ఇక మరోపక్క కోయంబత్తూర్ వెళ్లిన సీత కిడ్నీ దానం చేయడానికి సమయం దగ్గర పడుతుంది. దీంతో సీత దేవుడి మీద భారం వేసి ఇక అంతా మీరే చూసుకోవాలి తాను కుటుంబానికి దూరం అయిపోతానేమో అని భయం వేస్తోంది అని దేవుడితో చెబుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో కిడ్నీ కావాల్సిన మహిళ సోదరుడు అక్కడికి వస్తాడు. సింగపూర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ లని రప్పించానని రేపు ఉదయానికి ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ మొదలయ్యే అవకాశం ఉందని చెబుతాడు.

తేల్చేసిన ఫామిలీ
ఇక మరో పక్క శైలు ఇంట్లో రభస మొదలుపెడుతుంది. తన తండ్రి కండిషన్ కి రఘురాం ఒప్పుకోలేదని సంతకం చేయలేదని ఇలాగే వదిలేసి లక్ష్మణ్ను ఏం చేస్తారు అని ప్రశ్నిస్తుంది. ఈ కండిషన్ విన్న లక్ష్మణ్ కూడా ఇలాంటి కండిషన్ కలలో కూడా సంతకం చేయాలని అనుకోనని అంటాడు. అయితే దీనిని నెగిటివ్ గా ఎందుకు చూస్తున్నారు అని పాజిటివ్ గా చూడాలని కోరుతుంది. అంత డబ్బు ఇస్తున్నప్పుడు అల్లుడు, కూతురు ఇంట్లో ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తుంది. అయినా సరే రఘురాం సహా కుటుంబ సభ్యులు ఎవరు సైలు కి ఈ విషయంలో సపోర్ట్ చేయరు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Recommended Video

లక్ష్మణ్ అరెస్ట్
ఇక కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఒకపక్క సీతకు షాక్ తగలగా మరోపక్క లక్ష్మణ్ కూడా అరెస్టయినట్టు చూపిస్తున్నారు. సీత కిడ్నీ దానం చేయడానికి వెళ్లిన క్రమంలో ఇక మీ సహాయం అవసరం లేదని సదరు మహిళ వ్యక్తి చెబుతున్నట్లుగా చూపించారు. దానికి కారణం ఏమిటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక మరో పక్క లక్ష్మణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే తదుపరి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ఉండనుంది.


Click it and Unblock the Notifications











