For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial June 4th Episode: సీత అప్పగింతలు.. రాజేంద్ర కాళ్ళు పట్టుకోనున్న రఘురామ్!

  |

  తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటి కొనసాగుతున్న వదినమ్మ స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా శుక్రవారం ఎపిసోడ్ లో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి.. ఆ వివరాల్లోకి వెళితే

   అక్కడ ఆమె ఇక్కడ ఈయన

  అక్కడ ఆమె ఇక్కడ ఈయన

  సీత మాట మేరకు రఘురాం రాజేంద్ర ఇంటికి వెళ్లి అగ్రిమెంట్ పేపర్ చింపి ఆ కాగితాలు మొహాన కొట్టి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంటికి వచ్చాక శైలు పెద్ద రభస చేస్తుంది. అయినా సరే తమ్ముడిని మరదలిని అని అలా పంపడం తనకు ఇష్టం లేదని రఘురామ్ తేల్చి చెబుతాడు. ఇక ఈ రభస పూర్తయిన తర్వాత కోయంబత్తూర్ లో సీత ఇక్కడ రఘురాం బాధపడుతూ ఉంటారు.

  అప్పగింతలు

  అప్పగింతలు

  రఘురాంతో మాట్లాడితే బాగుండు అని అనుకుంటున్న సమయంలోనే రఘురాం సీత కి ఫోన్ చేస్తాడు. ఇక మాటల మధ్యలో సీత మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అవుతుంది. అలాగే అన్నీ అప్పగింతలు అప్పగిస్తున్నట్లు బాధ్యతలు అప్పగిస్తూ ఉండడంతో రఘురాం ఏమైంది అని అడుగుతాడు. అప్పగింతలు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావ్ ఏమిటి అని అడగడంతో అదేమీ లేదని సీత చెబుతుంది.

  సీత కోసం కాదు

  సీత కోసం కాదు

  అయితే రేపు ఈపాటికి డబ్బు నీకు అందుతుందని సీత చెప్పడంతో రఘునాథ్ ఏంటి ?నువ్వు రావా అని ప్రశ్నిస్తాడు. దానికి సీత కొద్ది సేపు తటపటాయించి రావాలనే అనుకుంటున్నానని వచ్చేస్తాను అని చెబుతోంది. ఇక ఆమె ఫోన్ కట్ చేసే సమయానికి రఘురాం స్నేహితుడు భాస్కర్ వస్తాడు. సీత గురించి అడుగుతాడు ఏమో సీత కోయంబత్తూర్ వెళ్ళింది అన్న విషయం చెప్పే లోపు తను వచ్చింది సీత కోసం కాదని నీ కోసం అని చెబుతాడు.

  బంగారం తాకట్టు

  బంగారం తాకట్టు

  అంతేకాక తన భార్య బంగారం అంతా తీసుకువచ్చిన భాస్కర్ ఈ బంగారం అవసరం కోసం వాడమని చెబుతాడు. అయితే రఘురాం దానికి ఒప్పుకోడు సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది చాలు అదే సంతోషం అని చెబుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భాస్కర్ భార్య నానా రభస చేస్తుంది. వేరే వాళ్ళ నగలు ఎలా తాకట్టు పెడతారని అంటూ రఘురామ్ కుటుంబాన్ని ప్రశ్నిస్తుంది. అయితే తన భార్య నగలు తాకట్టు పెట్టని తాను మరొకరి భార్య నగలు ఎలా తాకట్టు పెడతానని రఘురాం ప్రశ్నిస్తాడు..

  ఏమీ అనలేక

  ఏమీ అనలేక

  ఇంతలో శైలు వస్తుంది, శైలుని కూడా భాస్కర్ భార్య నానా మాటలు అంటుంది. శైలు కూడా వెనక్కు తగ్గకుండా మేమేమీ నగలు అడగలేదని మీ ఆయనే తీసుకొచ్చాడు అని చెబుతుంది. భాస్కర్ కూడా తన స్నేహితులకు సహాయం చేయడం కోసం తాను తీసుకు వచ్చాను అని చెప్పడంతో భాస్కర్ భార్య ఏమీ అనలేక సైలెంట్ అవుతుంది. ఇక మరో పక్క రాజేంద్ర ఎలా అయినా రఘురామ్ వాళ్ళ చేత అగ్రిమెంట్ లో సంతకం పెట్టిస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. భార్య వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడేసరికి కోపం పట్టలేక చేయి చేసుకుంటాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  రాజేంద్ర కాళ్ళు పట్టుకోనున్న రఘురామ్

  రాజేంద్ర కాళ్ళు పట్టుకోనున్న రఘురామ్

  ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక డబ్బు దొరకదు అని భావిస్తున్న తరుణంలో శైలు తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకోవాలని అందుకు అగ్రిమెంట్లో సైన్ పెట్టాలని కోరుతుంది. అయితే ఎలాంటి నిబంధనలు లేకుండా డబ్బులు ఇస్తాను అంటే అప్పుడు తాను మీ నాన్న కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమని రఘురాం చెబుతాడు. ఇక ఇదే విషయాన్ని ఫోన్ చేసి ఆమె తన తండ్రికి చెప్పడంతో తండ్రి అప్పటికప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధం అవుతాడు. ఇక రేపేటి ఎపిసోడ్ లో మరిన్ని ట్విస్టులు చోటుచేసుకానున్నాయి అనేది తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Vadinamma Episode 560: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode all the family members decided to sell properties. again isses arise in family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X