Vadinamma Serial June 5th Episode: మిస్టరీగా మారి సీత అదృశ్యం.. ఆ గండంలో రాఘురాం ఫ్యామిలీ!

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా దూసుకుపోతోంది స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్.. ప్రభాకర్, సుజిత మెయిన్ లీడ్ పాత్రలలో నటిస్తున్న ఈ సీరియల్ రోజుకొక ట్విస్టుతో అలరిస్తోంది. ప్రస్తుతానికి రఘురాం కుటుంబం అంతా అప్పు తీర్చే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయంలోకి వెళితే.

కలిసి ఉండడం ఇష్టం లేదు

కలిసి ఉండడం ఇష్టం లేదు


అప్పు తీర్చడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉంటుంది. అయితే రఘురాం రాజేంద్ర ముఖాన అగ్రిమెంట్ పేపర్లు చింపి కొట్టి వస్తాడు.. దీంతో లక్ష్మణ్ ఎక్కడ జైలుకు వెళతాడో అనే భయంతో శైలు బాధపడుతూ ఉంటుంది. కుటుంబమంతా తినడానికి కూర్చున్నా సరే శైలు రాకపోవడంతో రఘురాం లక్ష్మణ్ ను అడుగుతాడు. దీంతో ఆమెకు మనతో కలిసి తినడం ఇష్టం లేదని, ఇక్కడ కలిసి ఉండడం ఇష్టం లేదని లక్ష్మణ్ చెబుతాడు. విషయం అర్థం చేసుకున్న రఘురాం నేను వెళ్లి తీసుకు వస్తానని శైలు దగ్గరికి వెళ్తాడు.

 రేపోమాపో

రేపోమాపో

శైలు దగ్గరికి వెళ్లి తినడానికి రమ్మంటే బతుకు మీద ఆశ ఉన్నవారు మాత్రమే తింటారని రేపోమాపో చనిపోవాలని భావిస్తున్న తాను ఏమి తినను అని శైలు మొండికేస్తుంది. అయితే ఆమెను కొద్దిసేపు బుజ్జగించడానికి ప్రయత్నించిన రఘురాం ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో సీత డబ్బు కోసం వెళ్ళింది అనే విషయం చెబుతాడు. ఆమె రేపు ఉదయానికి వస్తుందని ఆ డబ్బుతో మనం ఈ గండం గట్టెక్కవచ్చు అని చెబుతాడు. దీంతో అప్పటికే ఆకలితో అలమటిస్తున్న శైలు వెంటనే ఆయన మాట నమ్మి తినడానికి వచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.

 అవమానానికి కుమిలిపోతూ

అవమానానికి కుమిలిపోతూ


ఇక మరో పక్క భాస్కర్ తన భార్య చేసిన అవమానానికి కుమిలిపోతూ ఉంటాడు. అమ్మ పక్కన కూర్చుని బాధపడుతున్న సమయంలో భార్య వచ్చి మరింత బాధ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. భాస్కర్ తల్లిని రాజమాత అంటూ సంబోధిస్తూ, భాస్కర్ రాజులాగా చెల్లికి సహాయం చేయడానికి వెళ్లాడని, తన నగలు అమ్మి వాళ్ళ డబ్బు కట్టుకోమని చెప్పాడని దెప్పి పొడుస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మీద భాస్కర్ తల్లి కూడా ఆమెను మందలిస్తుంది. తన కొడుకు మంచి వాడు కాబట్టే సహాయం చేయడానికి వెళ్ళాడు అని అంటుంది. అలాగే సీత తో పోల్చి నువ్వు ఏ మాత్రం పనికి రావని కోడలి ముఖం మీద చెప్పేస్తుంది.

 నా భర్త లాగే నీ భర్త కూడా

నా భర్త లాగే నీ భర్త కూడా

ఇక ఆమె సిరి తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి ఇందులో తన తప్పేమైనా ఉందా అని ప్రశ్నిస్తుంది. సిరి తల్లి నీ తప్పేమీ లేదని కానీ నా భర్త లాగే నీ భర్త కూడా వాళ్లకు సహాయం చేయాలని ఎందుకు తపిస్తున్నారో అర్థం కావడం లేదని అంటుంది. ఇంతలో సిరి తండ్రి అక్కడికి రావడంతో, వీరిద్దరూ తగ్గకుండా వడ్డీ లేకుండా రాజేంద్ర డబ్బు ఇస్తానంటే తీసుకోకుండా వెనక్కి రావడం ఏమిటని రఘురాం కుటుంబాన్ని విమర్శిస్తుంటారు. అయితే అల్లుడుని కూతురిని తాకట్టు పెట్టమని అడగడం ఏం సంస్కారం అని ప్రశ్నిస్తే ఇల్లరికం తీసుకువెళ్లారు అనుకుని డబ్బులు తెచ్చి లక్ష్మణ్ ను కాపాడి ఉంటే బాగుండని సిరి తల్లి చెబుతుంది.

Recommended Video

BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
సీతకి ఏమయింది?

సీతకి ఏమయింది?

ఇక మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి రఘురాం సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.. కానీ సీత ఎంతకూ రావడం లేదు. శైలు మాత్రం సీత వచ్చేసింది అనుకుని ఇంట్లో అందరినీ పిలిచి వెళ్లి డబ్బులు కట్టమని చెబుతుంది. అయితే సీత ఇంకా రాలేదు అనే విషయాన్ని తెలిపిన రఘురాం ఆమె ఎందుకు రాలేదో అర్థం కావడం లేదని ఫోన్ కూడా కలవడం లేదని చెబుతాడు. ఇక కమింగ్ అప్ లో నిన్న చూపించినట్టు గానే రాజేంద్రకు శైలు ఫోన్ చేసి డబ్బులు అడగడం తన రెండు నిమిషాల్లోనే డబ్బులు ఏర్పాటు చేస్తానని రాజేంద్ర చెప్పడం చూపించారు. అయితే అసలు సీత ఏమైంది? సీత కిడ్నీ ఇవ్వడానికి అవసరం లేదని మొన్న చెప్పినట్లు చూపించారు. అయితే నిజంగానే సీత కిడ్నీ ఇవ్వడం లేదా వెనక్కి వచ్చేస్తోందా అసలు ఏం జరిగింది అనే దానిమీద మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X