Vadinamma Serial June 7th Episode: శైలుకు ఘోర అవమానం.. సీతకి యాక్సిడెంట్.. బస్సు లోయలో పడడంతో ?

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన కారణంగా దాదాపు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సీరియల్స్ కి అలవాటు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న వదినమ్మ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ లో సీతకి యాక్సిడెంట్ జరగడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

 సీత రాకపోవడంతో

సీత రాకపోవడంతో

ఉదయానికల్లా ఇంటికి రావాల్సిన సీత ఎంతకూ రాకపోవడంతో శైలు అందరినీ కంగారు పెట్టేస్తుంది. సీత వస్తుందనుకుని పొరబడి ముందుగా అందరినీ హాల్లో సమావేశ పరుస్తుంది. అందరినీ హడావిడి పెట్టిస్తున్న తరుణంలో సీత ఇంకా రాలేదని ఆమె ఫోన్ కూడా కలవలేదని రఘురాం చెబుతాడు.. దీంతో తోక తొక్కిన త్రాచులా ఎగిరి పడిన శైలు అసలు ఏమనుకుంటున్నారు అని రఘు రామ్ నీ, కుటుంబాన్ని ప్రశ్నిస్తుంది. లక్కీ జైలుకు వెళ్ళడమే మీ అందరికీ కావాలా అంటూ ఆమె అందరినీ నిందిస్తుంది.

అంత ప్రేమ ఉంటే?

అంత ప్రేమ ఉంటే?

సీత వచ్చేస్తుంది డబ్బు తెచ్చి ఇస్తుంది అని ఎందుకు అబద్ధాలు చెప్పారని శైలు రఘురామ్ ను ప్రశ్నిస్తుంది. అయితే తానేమీ అబద్ధం చెప్పలేదని, సీత వస్తానని చెప్పిన మాటనే తాను చెప్పానని కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుంటే సీత ఫోన్ సైతం కలవడం లేదని రఘురామ్ చెబుతాడు. అయినా వినిపించుకోని శైలు సీత వద్దని చెప్పిందా ? లేక మీరు అబద్ధం చెప్పారా ? అని ఎదురు ప్రశ్నిస్తుంది. అయితే సీత అబద్ధం చెప్పదని పేర్కొన్న రఘురాం ఏమైందో ఏమో తనకు అర్థం కావడం లేదని చెబుతాడు. అయినా వినకుండా కామెంట్స్ చేస్తున్న శైలులతో అంత ప్రేమగా ఉంటే మీ నాన్న చేత డబ్బులు ఇప్పించమని రఘురాం అడుగుతాడు.

శైలుకు షాక్

శైలుకు షాక్

ఒకవేళ ఎలాంటి షరతులు లేకుండా డబ్బు ఇప్పించగలగితే తాను జనార్ధన్ కాళ్లు పట్టుకోవడానికి సైతం సిద్ధమని సవాల్ విసురుతాడు. ఈ సవాల్ కి లక్కీ, భరత్ అందరూ కాస్త టెన్షన్ పడతారు. డబ్బు ఇచ్చినా సరే అలాంటి వాడి కాళ్ళ మీద నువ్వు పడటం ఏమిటి అన్నయ్య అని ప్రశ్నిస్తారు. దానికి రఘురామ్ మన అవసరం కోసం తప్పదు అన్నట్టు మాట్లాడుతాడు. అయితే ఇదే విషయం మీద ఫోన్ చేసి తండ్రిని అడిగిన శైలుకి ఊహించని విధంగా షాక్ ఎదురవుతుంది. తాను డబ్బు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పిన రాజేంద్ర కాకపోతే ఎట్టిపరిస్థితుల్లో అగ్రిమెంట్ మీద రఘురామ్ సంతకం చేయాల్సిందే అని చెబుతాడు.

 ఘోర అవమానం

ఘోర అవమానం

దీంతో అత్తవారింట్లో అందరి ముందు శైలు పరువు పోతుంది. తన పరువు కోసం అయినా డబ్బు ఇవ్వాలని తండ్రి ప్రాధేయపడినా రాజేంద్ర ససేమిరా అంటాడు. నీ పరువు గురించి ఆలోచిస్తే నా పరువు పోతుందని అలాగే నిన్ను పర్మనెంటుగా నాకు దూరం చేయాలని మీ అత్తారింటి వారు నిన్ను రెచ్చగొట్టి ఫోన్ చేయిస్తున్నారు అని చెప్పి అర్థంతరంగా ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరో పక్క తప్పంతా సీతదే అన్నట్టు, ఆమె ఫోన్ చేస్తే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదని రఘురామ్ చిరాకు పడతాడు. ముందు తనకు ఫోన్ చేసి చెప్పి ఉంటే ఎంత విషయం జరిగేది కాదని రఘురామ్ చెబుతాడు.

 కిడ్నీ విషయం బట్టబయలు

కిడ్నీ విషయం బట్టబయలు

అయితే ఇంతలో రఘురాం తల్లికి సీత స్నేహితురాలు సునీత నెంబర్ ఇచ్చినట్లు గుర్తొస్తుంది. దీంతో సిరి చేత ఆ నెంబర్ కి ఫోన్ చేయిస్తుంది. సిరి ఫోన్ చేసి ఒకసారి అక్కతో మాట్లాడించమని సునీతను అడిగితే తమ దగ్గర ఆమె లేదని చెబుతుంది. అంతేకాక సీత వచ్చింది డబ్బు కోసం కాదని తనకు తెలిసిన వాళ్ళలో ఒకరికి కిడ్నీ అవసరం ఉంటే కిడ్నీ దానం చేయడానికి అని చెబుతుంది. ఈ దెబ్బకు సిరి సహా అత్తయ్య కూడా షాక్ అవుతారు. అసలు నువ్వు స్నేహితురాలు ఏనా ? ఇలా కిడ్నీ దానం చేయమని ఎలా పంపించావు అని అత్తమ్మ ప్రశ్నిస్తుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

సీతకి ఘోర ప్రమాదం

సీతకి ఘోర ప్రమాదం

ఇక కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం సీత ఎవరి కోసం అయితే కిడ్నీ దానం చేయడానికి వెళ్ళిందో ఆమె సోదరుడు రఘు రామ్ కి ఫోన్ చేసి చెబుతాడు. సీత వచ్చింది కిడ్నీ దానం చేయడం కోసం అని చెబుతూ ఉండగానే లక్కీ కల్పించుకుని మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు. ఇంతలో జరిగిందంతా చెప్పి కిడ్నీ దానం చేయలేదని సీత బయల్దేరిన బస్సు యాక్సిడెంట్ అయిందని ఆ బస్సు లోయలో పడింది అని షాకింగ్ విషయం చెబుతాడు ఆయన.. దీంతో రఘు రామ్ కుప్పకూలి పోతాడు. ఆ తర్వాత ఏం జరగనుంది అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X