Vadinamma Serial June 8th Episode: సీత యాక్సిడెంట్ లో సస్పెన్స్.. రఘురామ్ ఇంటికి పోలీసు.. అసలేమైందంటే?

రోజుకు ఒక ట్విస్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న వదినమ్మ సీరియల్ నేటి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. టెలివిజన్ మెగాస్టార్ ప్రభాకర్, సుజిత మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సీత కిడ్నీ దానం ఎలా

సీత కిడ్నీ దానం ఎలా

డబ్బు కట్టడానికి చివరి రోజు కావడంతో రఘురాం కుటుంబమంతా టెన్షన్ లో మునిగిపోయింది.. పొద్దున్నకల్లా వస్తానన్న సీత ఎంత కూ రాకపోవడంతో రఘురాం టెన్షన్లో తిరుగుతూ ఉంటాడు.. ఈ లోపు సీత స్నేహితురాలు సునీతకు ఫోన్ చేసిన సిరి విషయం తెలుసుకుని భయపడుతూ ఉంటుంది. ఇక రఘురాం తల్లి కూడా అనవసరంగా సీతను వెళ్ళనిచ్చానని ఇప్పుడు పెద్దోడికి ఏం సమాధానం చెప్పాలో అని భయపడుతూ ఉంటుంది. సీత కిడ్నీ వ్యవహారం చెప్పే ధైర్యం తనకు లేదని ఆమె సిరితో చెబుతుంది.

రఘురాం ఇంటికి పోలీస్

రఘురాం ఇంటికి పోలీస్

అయితే ఇంతలో రఘురాం ఇంటికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇంట్లోకి వచ్చాక లోపలికి వచ్చి కూర్చోమంటే ఆయన తాను వచ్చింది మర్యాదలు చేయించుకోవడానికి కాదని మాట ఇచ్చినట్లు సాయంత్రానికి డబ్బు కడతారా లేదా అనేది తెలుసుకోవడానికి అని చెబుతాడు. అయితే రఘురాం 15 కోట్లు సర్దుబాటు అయ్యాయి కానీ మరో ఐదు కోట్ల విషయంలో ఏమీ అర్ధం కావడం లేదని , అవి సర్దుబాటు కాలేదని చెబుతాడు. దీంతో తమ్ముడు ఇంట్లో ఉండడంతో మీరు అసలు ఏమాత్రం టెన్షన్ లేకుండా సరదాగా ఉన్నట్టు ఉందని తమ్ముడిని అరెస్టు చేస్తే అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది అని చెబుతాడు.

రఘురామ్ ను అరెస్ట్ చేయండి

రఘురామ్ ను అరెస్ట్ చేయండి

ఇంతలో అక్కడికి వచ్చిన శైలు అరెస్ట్ చేయాల్సింది తన భర్తను కాదని మీకు మాట ఇచ్చి కట్ట లేకపోయిన తన బావ గారిని అని చెబుతుంది. దీంతో లక్ష్మణ్ కి కోపం వచ్చి శైలు మీద అరుస్తాడు. అయినా వెనక్కి తగ్గని శైలు తన బావ గారిని అరెస్టు చేయాలని ఎస్ఐని కోరుతుంది. అయితే ఎస్ఐ ఆమెను మందలించి ఏం చేయాలో తనకు తెలుసు అని అంటాడు. ఇక ఎస్సై వెళ్లిపోయిన తర్వాత రఘురాం బాధపడతాడు. తాను అన్ని విషయాల్లోనూ అసమర్ధుడిని అని, డబ్బు ఏర్పాటు చేయలేనని అని తెలిసి సీత తన మొహం చూడలేక వెళ్లిపోయిందని అంటాడు.

ఇక బతికి అనవసరం

ఇక బతికి అనవసరం

తాను ఇక బతికి అనవసరమని, సీతకు లక్ష్మణ్ విషయంలో డబ్బు కట్టలేదని కోపం అని, శైలుకి భర్త ఎక్కడ జైలుకు వెళ్ళి పోతాడో అనే బాధ ఉందని ఒకవేళ లక్ష్మణ్ నిజంగానే జైలుకు వెళ్లాల్సి వస్తే తను కూడా నా మీద అసహ్యం పెంచుకుంటాడు అని బాధ పడతాడు. అయితే సీతను మరింత నిందించడానికి ప్రయత్నించబోతే అప్పుడు రఘురాం తల్లి అసలు విషయం చెబుతోంది.. సీత వెళ్ళింది మామూలుగా కాదని ఒకరికి కిడ్నీ దానం చేసి ఆ డబ్బుతో ఈ సమస్య తీర్చాలని అనుకుందని అలాంటి దాని మీద అభాండాలు వేయడం తగదు అని చెబుతోంది.

సీతకు ఏమయింది

సీతకు ఏమయింది

విషయం తెలుసుకున్న రఘురాం సీత గురించి తప్పుగా ఆలోచించినందుకు పశ్చాత్తాప పడతాడు. అయితే ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక సీతకు యాక్సిడెంట్ అయినట్టుగా నిన్న కమింగ్ అప్ లో చూపించినట్టుగానే ఈరోజు కమింగ్ అప్ లో కూడా చూపించారు. సీత కిడ్నీ ఇవ్వడానికి వెళ్ళిన మహిళ సోదరుడు రఘురామ్ కి ఫోన్ చేసి సీత యాక్సిడెంట్ అయిన విషయం చెబుతాడు. బహుశా ఈ వ్యవహారమంతా తరువాతి ఎపిసోడ్ లో చూపించే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X