Vadinamma Serial June 9th Episode: రఘురామ్ కాళ్ళ మీద పడ్డ నాని.. శైలుకు జ్ఞానోదయం.. సీతకి అసలేమైంది??

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మాలో ప్రసారమయ్యే వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలు చూస్తే

 నా వల్లే అంటూ శైలు

నా వల్లే అంటూ శైలు

సీత అలా వెళ్ళిపోతుంటే తాను ఆపి ఉంటే బాగుండేదని రఘురామ్ తల్లి బాధపడుతుంది. ఇక సీత కోసం ఎదురుచూస్తూ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే తన వల్ల సీత అక్క అలా బయటకు వెళ్లిందని శైలు బాధపడుతుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి తనను క్షమించమని కోరుతుంది.. అయిత చేయాల్సిందంతా చేసి అందర్నీ టెన్షన్ పెట్టి ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నావా అని లక్ష్మణ్ ప్రశ్నిస్తాడు. అయితే రఘురాం శైలు ని ఎలా అనవద్దని తన భర్త ఎక్కడ జైలుకు వెళతాడో అనే భయంతో ఆమె అలా మాట్లాడిందని వెనకేసుకు వస్తాడు. ఇక తండ్రికి ఫోన్ చేసిన శైలు తాను ఇక ఇంటి గడప తొక్కనని చెబుతుంది.

గోళ్లరంగు వేస్తూ టైం పాస్

గోళ్లరంగు వేస్తూ టైం పాస్

అయితే శైలుని అలా వెనకేసుకు రావద్దని కేవలం ఆమె నానా మాటలు అనడం వల్లే సీత వదిన అంత రిస్క్ చేయడానికి సిద్ధమైందని లక్ష్మణ్ చెబుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భాస్కర్ సీత వెళ్ళింది అన్న విషయం తెలుసుకుని బాధపడుతుంటాడు. ఇక మరో పక్క సిరి తల్లికి భాస్కర్ భార్య గోళ్లరంగు వేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటుంది. ఈ వయసులో మనకు అవసరమా అంటే ఈ వయసులో వేసుకుంటే ఇంకా కుర్రతనం లో ఉన్నట్లు భావిస్తారని చెబుతూ ఇలా సీత కిడ్నీ ఇవ్వడానికి వెళ్ళింది అన్న విషయం ప్రస్తావిస్తుంది. అయితే మొగుడికి కూడా చెప్పకుండా వెళ్ళడం తప్పు అన్నట్లు ఇద్దరు సీతను ఆడిపోసుకుంటారు.

నా తమ్ముడివేనా

నా తమ్ముడివేనా

ఇక రఘురాం కుటుంబం అంతా బాధ పడుతూ ఉంటే నాని వచ్చి తనకు ఆకలేస్తుంది అన్నం పెట్టాలని సిరిని కోరతాడు.. దీంతో కోపం పట్టలేని భరత్ వెళ్ళి నానీ కాలర్ పట్టుకుని అసలు నువ్వు నా తమ్ముడివేనా మేమంతా వదిన కిడ్నీ ఇవ్వడానికి వెళ్లిందని ఆమె ఫోన్ ఎత్తడం లేదని ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత కూల్ గా ఉండి ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడుగుతావా అంటూ ఫైర్ అవుతాడు. అయితే అప్పటికి నానికి విషయం తెలియకపోవడంతో విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. నువ్వు సంతకం పెట్టి ఉంటే అసలు ఇంత దాకా వ్యవహారం వచ్చేది కాదని భరత్ నానికి చెబుతాడు.

 రఘురామ్ కాళ్ల మీద నాని

రఘురామ్ కాళ్ల మీద నాని


అయితే ఇదంతా తెలియడంతో నాని కి బాధ కలిగి వెంటనే వెళ్లి రఘురామ్ కాళ్ల మీద పడతాడు. సంతకం పెట్టను అన్నందుకు రఘురాం ఎంత బాధ పడ్డాడు అనే విషయాన్ని భాస్కర్ నానికి వివరంగా చెబుతాడు. దీంతో తాను సంతకం పెట్టను అన్నది తన స్వార్థం కోసం కాదని ఇల్లు, వాకిళ్ళు వేసిన తర్వాత పొలం కూడా తాకట్టు పెడితే పెద్దన్నయ్య ఏమైపోతాడో అనే భయంతో అలా చేశానని నాని చెబుతాడు. లక్ష్మణ్ అన్నకు వాళ్ళ మామగారు ఉన్నారని భరత్ అన్నకు అత్తమ్మ ఉందని కానీ ఏ అండ లేని వాళ్ళు అన్న వదిన మాత్రమే అని చెబుతాడు. వాళ్లకు ఎలాంటి ఆధారాలు లేకుండా చేయకూడదు అనే ఉద్దేశంతోనే తాను సంతకాలు పెట్టలేదు అని అంటాడు.

 సీతకు ఏమైంది ?

సీతకు ఏమైంది ?

ఇంత దూరం వచ్చాక సంతకాలు పెట్టకపోవడం తన తప్పు అవుతుంది అని చెబుతూ లోపలికి వెళ్లి కాగితాలు తీసుకువచ్చి సంతకాలు పెట్టి ఇస్తాడు. అయితే సీతకి ఆక్సిడెంట్ అయిందని రెండు రోజుల నుంచి కమింగ్ అప్ లో చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా ఆ సస్పెన్స్ క్లియర్ చేయలేదు. మళ్లీ తదుపరి ఎపిసోడ్లో సీత యాక్సిడెంట్ వ్యవహారం చూపించే అవకాశం ఉందని చెబుతూ వేశారు. తదుపరి ఎపిసోడ్ లో అయినా క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X