Vadinamma : లివర్ మార్పిడి ఆపరేషన్ సక్సెస్.. కానీ ప్రమాదంలో రఘు ప్రాణం?

వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే నలుగురు అన్నదమ్ములు రెండు భాగాలుగా విడిపోయిన క్రమంలో మళ్లీ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఆ సమయంలో శైలు మూర్ఖత్వంతో బాబు అనుకోకుండా టాబ్లెట్ మింగుతాడు. అయితే చిన్నప్పటినుంచే బాబుకు లివర్ ప్రాబ్లం ఉండడంతో అది ఇప్పుడు ప్రాణాంతకం అవుతుంది.. బాబు లివర్ మార్చకపోతే చనిపోతాడు అని చెప్పడంతో లివర్ ఇచ్చేందుకు రఘురాం సిద్ధమవుతాడు..

అయితే రఘురాం లివర్ తీసుకోవచ్చు కానీ అతనికి గుండె సమస్య ఉండడంతో ఒకవేళ ఆపరేషన్ చేసి లివర్ మార్చే క్రమంలో 30 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తేల్చి చెబుతారు. రఘురాం తన కొడుకు రిషి కోసం లివర్ దానం చేస్తాను అంటే సీత ఒప్పుకోకపోవడంతో ఆమెను ఎట్టకేలకు ఒప్పిస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది తాజా ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బతకడు అని

బతకడు అని

రఘురామ్ ను ఆపరేషన్ థియేటర్ కి తీసుకు వెళ్తారు. అయితే శైలు మెలకువ రావడంతో ఆమెను చూసుకోవడం కోసం లక్ష్మణ్ అక్కడ నుంచి వెళ్లి శైలు దగ్గర కూర్చున్నాడు. శైలు లేచింది మొదలు నా బాబు ఎక్కడ నా బాబు ఎక్కడ అంటూ మళ్ళీ గోల మొదలు పెడుతుంది. నిజం తెలుసుకున్న లక్ష్మణ్ ఏం చెప్పాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఇలా మారిపోయావ్ ఇప్పుడు నా బాబును లాక్కొని వెళ్ళారు రేపు నిన్ను కూడా నా కళ్ళముందే లాక్కుని వాళ్ళ వైపు తీసుకు వెళ్లి పోయినా నువ్వు ఏమి మాట్లాడేటట్టు కనపడడం లేదు అంటూ శైలు పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంది.. ఆమెకు ముందు ఏమీ చెప్పకూడదు అని భావించి లక్ష్మణ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినా ఎంతకు వినకపోవడంతో సరే నువ్వు చెప్పిన విధంగానే బాబుని తీసుకు వస్తాను కానీ వాడు మాత్రం బతకడు అని చెబుతాడు.

ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళి

ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళి

అదేమిటి అంటే ఇప్పుడు వాడికి లివర్ ఆపరేషన్ జరుగుతోంది తీసుకుని రమ్మంటే ఆపరేషన్ మధ్యలోనే తీసుకు వచ్చి నీ దగ్గర పడుకో పెడతాను కానీ దాని వల్ల ఉపయోగం ఏమిటి అని ఆమెను ప్రశ్నిస్తాడు. అప్పటివరకు అరుస్తూ గోల చేసిన శైలు ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ సైలెంట్ అయిపోయి స్పృహ కోల్పోతుంది. ఆమె పడుకుంది కదా అని ఒక్కసారి రఘు అన్నయ్యతో మాట్లాడాలి అని లక్ష్మణ్ అనుకుంటాడు.

ఆపరేషన్ థియేటర్ కి వెళ్తే మళ్లీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు కాబట్టి ఇప్పుడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది అని భావించి అక్కడికి వెళతాడు. కానీ అప్పటికే ఆపరేషన్ థియేటర్ కు రఘురాముని తీసుకువెళ్తారు డాక్టర్లు. ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళిన తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి ఫైల్ పరిశీలించి నేను ఈ ఆపరేషన్ చెయ్యను అని అంటారు.

108 ప్రదక్షిణాలు చేస్తే

108 ప్రదక్షిణాలు చేస్తే

డాక్టర్లు అంటే ఒకరిని బతికించాలి కానీ ఇలా తెలిసి తెలిసి మరొకరు చావుకు కారణం కాకూడదు అని ఫైర్ అవుతారు. నాకు ఆపరేషన్ చేస్తే 30 శాతం బతికే అవకాశం అయినా ఉంది కానీ వాడికి చేయకపోతే 100% చనిపోతాడు కదా అని రఘురాం ప్రశ్నిస్తాడు. మీరు ఇప్పుడు చేయకపోతే నేను నా ఊపిరి తీసుకుంటాను, అప్పుడు చనిపోయిన వారి లివర్ తీసి వాడికి ఆపరేషన్ చేయవచ్చు కదా అని రఘురాం ప్రశ్నిస్తాడు.

అయితే చాలా సేపు తటపటాయించి తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేయడానికి సిద్ధం అవుతాడు. అయితే సీత దేవుడిని ప్రార్థించాలి అనే ఉద్దేశంతో గుడికి వెళుతుంది. గుడికి వెళితే అక్కడ పూజారి అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేస్తే ఏమైనా సమస్యలు ఉంటే తీరుతాయి అని చెబుతారు.

ధైర్యం నటిస్తూ

ధైర్యం నటిస్తూ

దీంతో 108 ప్రదక్షిణలు చేసిన సీత అమ్మవారి హారతి తీసుకునే సమయంలో అది ఆరిపోయింది. ఇదేదో కీడు శంకించేలా కనిపిస్తుంది అమ్మవారిని ప్రార్థించడం ఆపవద్దు ఆమె కరుణించే వరకు ప్రార్థించండి, కిందనుంచి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ చేతిలో దీపం పట్టుకొని వస్తే అమ్మవారు కరుగుతుంది అని చెబుతాడు. ప్రమాదంలో రఘు ప్రాణం ఉందేమో అనే భయంతో అలాగే చేయడానికి సీత సిద్ధం అవుతుంది.

మరో పక్క భారత్ దగ్గరికి వెళ్లిన లక్ష్మణ్ అన్నయ్యని చూసి మాట్లాడితే బాగుండేది అని భావిస్తూ చెబుతాడు. అన్నయ్య ధైర్యం నటిస్తూ లోపలికి వెళ్ళాడు కానీ ఏం జరగనుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని అంటాడు భరత్. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే డాక్టర్లు ఆపరేషన్ పూర్తి చేసి బయటకు వస్తారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
ఏం జరగబోతోంది?

ఏం జరగబోతోంది?

బాబుకు ఆపరేషన్ పూర్తయిందని బాబుకు ఎలాంటి సమస్య లేదని చెబుతారు. రఘురాం గురించి కూడా చెబుతూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోయే కమింగ్ ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం శైలు పూర్తిగా కోలుకుంటుంది. కోలుకున్న తర్వాత నా బాబు పూర్తిగా కోలుకున్నాడు వాడిని చూసి వచ్చాను అని చెబుతూ డాక్టర్లను తన కుమారుడికి ఎవరు ఎవరు లివర్ దానం చేశారు అనే విషయం చెప్పమని అడుగుతుంది..

చెప్తే ఏం చేస్తారు అని డాక్టర్ అడుగగా మాకు చేతనైన సాయం చేస్తామని శైలు అంటుంది. అయితే డాక్టర్ మరేదో షాకింగ్ విషయం చెప్పినట్లుగా చూపిస్తున్నారు. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X