Vadinamma : రిషి, రఘురాం సేఫ్.. ఫలించిన సీత పూజలు.. కానీ శైలు మాత్రం?

వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది ఒక సమస్య తీరిన వెంటనే మరో సమస్య కుటుంబాన్ని చుట్టుముడుతోంది. నలుగురు అన్నదమ్ములు రెండు టీములుగా విడిపోయి బతుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుకోని పరిస్థితులలో రిషి నరాల టాబ్లెట్ మింగుతాడు. దీంతో లివర్ చెడిపోతుంది. హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే రిషి బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పడంతో తనకు రిస్క్ అవుతుందని తెలిసినా తన లివర్ ఇవ్వడానికి రఘురామ్ సిద్ధమవుతాడు. గత ఎపిసోడ్ లో రఘురాం కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు చూపించారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భాస్కర్ వీరంగం

భాస్కర్ వీరంగం

గుడికి వెళ్ళిన సీత దండం పెట్టుకుని హారతి తీసుకుందాం అంటే హారతి ఆరిపోతుంది. దానిని అపశకునంగా భావించిన పూజారి మోకాళ్ళతో అమ్మ వారి మెట్లు ఎక్కి పైకి వస్తే మంచి జరుగుతుంది అని చెప్పడంతో అలాగే చేస్తుంది సీత. మరోపక్క రఘురాం హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలుసుకున్న భాస్కర్ హుటాహుటిన హాస్పిటల్కి పరిగెత్తుకొని వస్తాడు. అసలు నేను ఒకడిని ఉన్నాను అనుకున్నారా లేక చచ్చిపోయాను అనుకున్నారా ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలేదు అని భరత్ ను నిలదీస్తాడు.. అసలు ఇలాంటి పరిస్థితులలో లివర్ ఇవ్వకూడదు అని తెలిసినా ఎలా ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటూ అందరి మీద ఫైర్ అవుతాడు. అసలు డాక్టర్లు లివర్ ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు? ఒప్పుకోవడానికి రఘురాం కి ఆ మాత్రం జ్ఞానం లేదా సీత మనసు ఏమైంది? అంటూ అందరి మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న సమయంలో సీత ప్రవేశిస్తుంది.

ఒక్కదాన్నే వచ్చి చూడమని

ఒక్కదాన్నే వచ్చి చూడమని


ఎంతో సేవ చేస్తే రఘురాం మీ కుటుంబం కాదని పక్కన పెట్టారు ఇప్పుడు వాడి ప్రాణాల మీదకు తీసుకురావడం ఏ మాత్రం కరెక్ట్ గా లేదని చెబుతూ అక్కడ ఉన్న అందరి మీద తీవ్రస్థాయిలో మండి పడుతూ ఉంటాడు. మరోపక్క అదే సమయంలో రఘురాం పల్స్ అందడం లేదంటూ డాక్టర్లు కూడా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. దీంతో కుటుంబ సభ్యులు అందరిలో టెన్షన్ నెలకొంటుంది.. అయితే అసలు ఏం జరిగింది అని అంతా డాక్టర్లను ప్రశ్నించే సమయంలో వాళ్ళు ఏ మాత్రం సమాధానం చెప్పకుండా తమ తమ పనులలో బిజీగా ఉంటారు. చివరికి తమ చేతుల్లో ఏమీ లేదనే విషయం అర్థం చేసుకున్న తర్వాత సీత ఒక్క దానిని లోపలికి వచ్చి చూడమని డాక్టర్లు చెబుతారు.

కుంకుమ పెట్టడంతో

కుంకుమ పెట్టడంతో


సీత లోపలికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక దేవత దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుని ఆ సమయంలో అక్కడ తీసుకున్న కుంకుమ రఘురాం నుదుటికి పెడుతోంది. అలా రఘురామ్ నుదిటి కుంకుమ పెట్టి కొద్దిసేపు అక్కడ ఉన్న సీత ఆ తర్వాత బయటకు వస్తుంది. బయటికి వచ్చిన కాసేపటికి డాక్టర్లు రఘురాం ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతారు. దీంతో కుటుంబ సభ్యులు అందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. మరోసారి కూడా సీత ఒక్క దాన్ని లోపలికి వెళ్లి చూడమని చెబుతారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత సీత భర్త తిరిగి కోలుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆ తరువాత రిషిని చూస్తాను అంటూ ఆమె దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.

ఇద్దరూ సేఫ్

ఇద్దరూ సేఫ్

ఇదిలా జరుగుతుండగా రిషి ఆపరేషన్ పూర్తయ్యింది అని తెలుసుకున్న లక్ష్మణ్ శైలు లేచిన వెంటనే ఇదే విషయాన్ని చెబుతాడు. దీంతో శైలు ఆనందం వ్యక్తం చేస్తుంది. మరోపక్క రాజేశ్వరి వద్దకు వెళ్లిన సీత ఇద్దరు కోలుకుంటున్నారని చెబుతుంది. దీంతో రాజేశ్వరి ఆనందం వ్యక్తం చేస్తుంది. నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ వైపు ఎవరూ రాకుండా చూసుకున్నా అని రాజేశ్వరి చెప్పడంతో అది శైలు కోసం చూసుకున్నారు అనే విషయం నాకు అర్థం అయింది అంటూ మాట్లాడుతుంది. అంతేకాక మా బాబుని నేను మాట ప్రకారం శైలు కి అప్పగిస్తాను కానీ భవిష్యత్తులో మీరు నా భర్త సొంత బిడ్డ కార్డు అంటూ పక్కన పెట్టిన విధంగా నా బిడ్డ ని పక్కన పెట్టరు గ్యారెంటీ ఏమిటి అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్న విన్న తర్వాత రాజేశ్వరికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు.

పుట్టింటికి శైలు

పుట్టింటికి శైలు


నన్ను చూస్తుంటే నీకు కోపం వస్తోంది కదూ నాకు అర్థం అవుతోంది అంటూ సీతతో అంటుంది ఆమె. అదేమీ లేదని చెప్పిన సీత భరత్, సిరి ఉన్న వైపు వెళుతుంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం శైలు బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళి పోవడానికి సిద్ధమవుతుంది.ఎందుకు ఇప్పుడు ఏం జరిగిందని వెళ్లి పోతున్నావు అని లక్ష్మణ్ అడగడంతో నా బాబుని నాకు తెచ్చి ఇవ్వండి సీతక్క మనం పెట్టుకున్న రూల్ ఉల్లంఘించి మన వైపు వచ్చింది అని శైలు అంటుంది. నిజం తెలిసిన లక్ష్మణ్ ఏమనాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగానే తన పెట్టె తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోతున్నట్లు చూపించారు. చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X