Vadinamma : అడకత్తెరలో పోక చెక్కలా మారిన లక్ష్మణ్.. అసలు విషయం తెలియడంతో రెచ్చిపోయిన శైలు?

రఘురామ్ కుటుంబంలో ఏర్పడిన మరో సమస్య నుంచి కుటుంబం గట్టెక్కింది. రఘురాం- సీత అసలు కొడుకు లక్ష్మణ్, శైలు దగ్గర పెరుగుతున్న రిషి అనుకోని విధంగా లివర్ చెడిపోవడంతో హాస్పిటల్ పాలవుతాడు. అయితే తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా రఘురాం అతనికి లివర్ దానం చేసి సీత పూజలతో మళ్ళీ లేచి కూర్చుంటాడు. తొలుత రఘురాం ఆరోగ్యానికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కానీ అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ తీసుకువచ్చి రఘురాం నుదుటి మీద పెట్టడంతో అతనికి కాస్త శక్తి వచ్చినట్లు అవుతుంది. దీంతో వెంటనే అతను కోలుకుంటాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కోలుకోవవడంతో

కోలుకోవవడంతో

లక్ష్మణ్ వెళ్లి శైలు దగ్గర నీ కొడుకు అన్ని ఇబ్బందుల నుంచి జయించి మృత్యుంజయుడై కోలుకున్నాడు అని చెబుతారు. వెంటనే నేను వాడిని చూడాలి అంటూ శైలు అక్కడి నుంచి లేచి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది కానీ అక్కడి డాక్టర్లు ఆమెను కదిలి వెళ్ళవద్దు అని చెబుతారు. అయినా సరే మీరు నన్ను వెళ్లనిస్తారా? లేక వీటిని తెంపుకుని వెళ్లాలా అంటూ ఆమె అడగడంతో ఎట్టకేలకు ఆమెకు పెట్టిన సెలైన్ కూడా తీస్తారు.

తన కొడుకు కోసం ఆదుర్దాగా వెళ్లడానికి శైలు ప్రయత్నిస్తుంది కాని ఐసియు దగ్గరకు వెళ్లకుండా అక్కడి డాక్టర్లు అపుతారు. అయితే శైలు బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఆమె దగ్గరకు వస్తారు ఆమె కోలుకోవవడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. శైలు కూడా రిషి ఇబ్బందుల నుంచి బయట పడ్డాడు అని ఆనందం వ్యక్తం చేస్తోంది.

రఘురాంకు ప్రమాదం

రఘురాంకు ప్రమాదం

అయితే తన భర్తతో మాత్రం మనమే బాబు దగ్గరికి వెళ్ళాలి మీ అన్న వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారేమో వాళ్ళను మాత్రం దగ్గరకు రానిచ్చేది ప్రసక్తే లేదు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సీత, భరత్, సహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఐసియు దగ్గర ఉండటం చూసి ఇదేంటి వీళ్ళు అందరూ ఎందుకు వచ్చారు మనకు తెలియకుండా వాడిని వాళ్ళు తీసుకు వెళ్లి పోతారు అని లక్ష్మణ్ తో అంటుంది.

తీసుకు వెళ్తారా? ఎక్కడికి తీసుకు వెళతారు మన ఇంటికె కదా తీసుకు వెళతారు అయినా నువ్వు ఎందుకు వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు అంటూ లక్ష్మణ్ అంటాడు. అయితే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించడంతో రఘురాం అన్నయ్యకు ప్రమాదం జరిగిందని లక్ష్మణ్ అబద్ధం చెబుతాడు.

అలాగే చేస్తావు అంటూ

అలాగే చేస్తావు అంటూ

అయితే నువ్వు వాళ్లని చూడడానికి వెళ్ళావా అని శైలు ప్రశ్నిస్తుంది లేదు నేను వెళ్ళలేదు నీ దగ్గరే ఉన్నాను అని లక్ష్మణ్ అబద్ధం చెబుతాడు.. అయితే శైలు మాత్రం వాళ్లకి ఇలా జరగాల్సిందే నా కొడుకుని నా దగ్గర నుంచి దూరం చేస్తారా వాళ్ళకి ఏ మాత్రం శాస్తి జరగాల్సిందే అంటూ మాట్లాడుతూ ఉంటుంది.

అన్ని నిజాలు తెలిసిన లక్ష్మణ్ తన అన్న వదిన లను శైలు అలా అంటుంటే భరించలేక పోతాడు. అలా అనవద్దు అంటే నేను ఇంకా ఇంకా అంటా అని శైలు రెచ్చిపోతుంది. మరోపక్క సీత మెలకువ వచ్చిన రఘురాం దగ్గరికి వెళ్లి కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. నీకు నాకంటే రిషి ఎక్కువ అయ్యాడు కదా అని భర్తతో అంటే రఘురాం బాధపడుతూ వాడికి పునర్జన్మ ప్రసాదించే భాగ్యం దేవుడు నాకు కల్పించాడు.. నువ్వు ఆ స్థానంలో ఉన్న అలాగే చేస్తావు అంటూ చెబుతాడు.

పుట్టింటికి వెళ్లి

పుట్టింటికి వెళ్లి

అలా వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అసలు రఘురాం బయటకు ఎప్పుడు వెళ్ళాడు ?రిషికి బాగోలేదు అని హాస్పిటల్లో జాయిన్ చేసింది రఘురామే కదా మనకు తెలియకుండా రఘురాం ఎప్పుడు బయటికి వెళ్ళాడు? ఎప్పుడు యాక్సిడెంట్ అయింది అంటూ జనార్ధన్ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని లింగానికి పని అప్పగిస్తాడు జనార్ధన్. మరోపక్క రిషి రఘురాం తప్ప మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత శైలు మరో గొడవ మొదలు పెడుతుంది. నేను మా పుట్టింటికి వెళ్లి పోతున్నాను అంటూ పెట్టి తీసుకుని రావడంతో ఏం జరిగింది అని లక్ష్మణ్ ప్రశ్నిస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
ఏహ్య భావంతో

ఏహ్య భావంతో

సీతక్క మనం పెట్టుకున్న రూల్స్ అతిక్రమించి నా వైపు రావడమే కాక నా కొడుకుని తీసుకుని వెళ్ళింది అంటూమాట్లాడుతుంది. అయితే లక్ష్మణ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నా ఆమె వినే పరిస్థితిలో ఉండదు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషి కోసం లివర్ ఇచ్చింది రఘురాం అనే విషయం తెలుసుకుని లింగం తన బావ జనార్ధన్ కి చెబుతాడు..

ఈ విషయం విని జనార్దన్ షాక్ అవుతాడు. షాక్ అయిన తరువాత తన కుమార్తెకు కూడా ఈ విషయం చెప్పినట్లే కనిపిస్తోంది. దీంతో తన కుమారుడుని హత్తుకొని ఆడుకుంటున్న లక్ష్మణ్ దగ్గరకు వచ్చిన శైలు కుమారుడిని ఏహ్య భావంతో చూస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి తర్వాత ఎపిసోడ్ ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X