Vadinamma : రాజేశ్వరి దుస్సాహసం.. అంతా తెలిసినా సైలెంట్ గా జనార్ధన్.. శైలుకి మరో షాక్?

వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. రఘురాం తన కుమారుడు రిషి కోసం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఆ విషయం కుటుంబ సభ్యులలో దాదాపు అందరికీ తెలిసినా కొందరికి మాత్రం తెలియదు ఆ విషయాన్ని తెలియకుండానే మెయింటెయిన్ చేయడం కోసం మిగతా వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు.. అయితే సీత తనను తోసి బాబు హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం కరెక్ట్ కాదు అని తనకు క్షమాపణలు చెప్పాలి అని శైలు కోరడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెబుతుంది. అయితే రిషి మీ కొడుకు అనే విషయం లక్ష్మణ్ కు అత్తయ్య చెప్పింది అనే విషయాన్ని సీతకు చెబుతుంది సిరి. అయితే సీత ఈ విషయాన్ని రఘురాంకి తెలియనివ్వద్దు అని కోరుతుంది.. కుటుంబానికి మరొక స్వీట్స్ ఆర్డర్ కూడా వస్తుంది అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విరుచుకుపడిన శైలు

విరుచుకుపడిన శైలు

రఘురాం పొద్దుపోయిన తర్వాత నిద్ర పట్టక పోవడంతో బయటకు వచ్చి నిలబడి ఉంటాడు. బయటకు వచ్చిన సీత ఏమిటి అని ప్రశ్నించగా తనకు నిద్ర పట్టడం లేదని అంటారు కానీ నువ్వు బయటకు వచ్చింది రిషి ఎలా ఉన్నాడో చూడటం కోసమే ఆ విషయం నాకు తెలుసు అని అంటుంది సీత. కానీవాడు గదిలో నిద్రపోతున్నాడు కదా ఎలా మనం చూడగలం అని ప్రశ్నిస్తే ఇదంతా వింటున్న లక్ష్మణ్ తన అన్న వదిన చూడడం కోసం బాబు ని కిందకు తీసుకు వస్తాడు. లక్ష్మణ్ రిషిని ఆడిస్తూ ఉండగా వాడిని చూసి రఘురాం, సీత ఇద్దరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే వాళ్లు అలా ఆనందపడుతూ ఉన్న సమయంలో శైలు ఎంట్రీ ఇస్తుంది. శైలు ఎంట్రి ఇవ్వడమే కాక వాడివి గదిలో నుంచి ఎందుకు తీసుకు వచ్చావ్ అంటూ పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంది.

తెలిసిపోయిన సీక్రెట్

తెలిసిపోయిన సీక్రెట్

అదేమీ లేదని ఎంతసేపు గదిలో ఉంటే ఊపిరాడక ఏడుస్తున్నాడు అనే ఉద్దేశంతో బయటకు తీసుకు వచ్చాను అని లక్ష్మణ్ చెబుతారు. ఇక అక్కడితో ఆ రోజు రాత్రి ముగుస్తుంది. తర్వాతి రోజు భారత్ స్వీట్ డెలివరీ ఇవ్వడం కోసం బయటకు వెళ్ళాడు. మరోపక్క రిషికి లివర్ ఇచ్చింది రఘురాం అనే విషయం జనార్దన్ కు చెబుతాడు లింగం. దీనిలో ఏదైనా లాజిక్ లు ఉన్నాయా భవిష్యత్తులో ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తారా అని ఆలోచించిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని భావించి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని అనుకుంటారు. ఆఫీసు నుంచి లక్ష్మణ్ త్వరగా ఇంటికి తిరిగి వస్తాడు అదేమిటి ముందే తిరిగి వచ్చావు నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకు వెళ్ళవచ్చు కదా అని అడుగుతుంది శైలు.

తెలిసిపోయిన సీక్రెట్

తెలిసిపోయిన సీక్రెట్

అదేమీ లేదని ఎంతసేపు గదిలో ఉంటే ఊపిరాడక ఏడుస్తున్నాడు అనే ఉద్దేశంతో బయటకు తీసుకు వచ్చాను అని లక్ష్మణ్ చెబుతారు. ఇక అక్కడితో ఆ రోజు రాత్రి ముగుస్తుంది. తర్వాతి రోజు భారత్ స్వీట్ డెలివరీ ఇవ్వడం కోసం బయటకు వెళ్ళాడు. మరోపక్క రిషికి లివర్ ఇచ్చింది రఘురాం అనే విషయం జనార్దన్ కు చెబుతాడు లింగం. దీనిలో ఏదైనా లాజిక్ లు ఉన్నాయా భవిష్యత్తులో ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తారా అని ఆలోచించిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని భావించి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని అనుకుంటారు. ఆఫీసు నుంచి లక్ష్మణ్ త్వరగా ఇంటికి తిరిగి వస్తాడు అదేమిటి ముందే తిరిగి వచ్చావు నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకు వెళ్ళవచ్చు కదా అని అడుగుతుంది శైలు.

రాజేశ్వరి దుస్శాసాహం

రాజేశ్వరి దుస్శాసాహం


లక్ష్మణ్ వింతగా చూడటం తో అది ఏంటి బాబు పరిస్థితి ఇలా ఉంటే నన్ను బయటకు తీసుకువెళ్ళమని అంటుంది అనుకుంటున్నావా నేను సరదాకి అన్నాను నువ్వు ఎలా రియాక్ట్ అవుతవో తెలుసుకోవడం కోసమే అలా అన్నాను అని అంటుంది. అయితే లక్ష్మణ్ పొరపాటున అన్నయ్యకు ఎలా ఉంది అని అడగడంతో ఎక్కడలేని రాద్దాంతం చేస్తుంది శైలు. అలా ఎలా అడుగుతావు వేరే వాళ్ల గురించి నన్ను అడగడం మంచిది కాదు కదా అన్నట్లు ప్రవర్తిస్తుంది. అంత నిద్రకు ఉపక్రమిస్తారు కానీ సిరి మాత్రం భరత్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో రాజేశ్వరి కూడా కొడుకుని చూడాలి అనే ఉద్దేశంతో శైలు ఉన్న వైపు నుంచి రఘురాం ఉన్న వైపు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.. ఇది చూసిన సిరి ఆమె దగ్గరకు వెళ్లి మీ ఇంటి పెద్ద కోడలు చూస్తే నీ చైర్ కు చైన్ కట్టేస్తుంది అని మాట్లాడుతూ ఉంటుంది.

పీటల మీద

పీటల మీద

రఘురాం బావగారిని చూడాలి అనిపిస్తుందా అని అడిగితే అవును అని అంటుంది. తీసుకువెళ్లే ప్రయత్నం లో శైలు వస్తుంది. శైలు రావడంతో అత్తగారిని కనపడకుండా దాస్తుంది. శైలు చాలా సేపు అక్కడే తచ్చాడు ఉంటుంది. ఆ తర్వాత పైకి వెళ్లి పడుకుంటుంది ఇక ఆ సమయంలో రఘురాం దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని భావించి రాజేశ్వరి వెనక్కి వెళ్లి పోతుంది.. ఇక ఆ ఊరిలో శ్రీరామనవమి చేయాలి కాబట్టి ఈ సారి పీటల మీద కూర్చున్న వారు ఎవరు అని ప్రశ్నిస్తారు ఊరి పెద్దలు. భరత్ ప్పటిలాగే మా అన్న వదిన కూర్చుంటారు అని చెబుతాడు. కానీ శైలు మాత్రం అందుకు ఒప్పుకోదు. ఈ విషయం మా అత్తగారు మాత్రమే చెప్పాలి అని పట్టుబట్టడంతో ఏం చేయాలో తెలీక అవును లక్ష్మణ్ అన్న వదిన పీటల మీద కూర్చుంటారు అని చెబుతుంది.

Recommended Video

Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media | Filmibeat Telugu
మరో క్రాస్ ఓవర్

మరో క్రాస్ ఓవర్

లక్ష్మణ్ వచ్చి అలా ఎందుకు చెప్పావు అని ప్రశ్నిస్తే నీ భార్య నోటి కి భయపడి అని చెబుతోంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నట్లు చూపిస్తున్నారు.. పీటల మీద కూర్చుంటున్నది శైలు, లక్ష్మణ్ కాబట్టి వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కాని అక్కడ శ్రీరామనవమి నిర్వాహకులు మాత్రం శైలు ని అవమానించే విధంగా మాట్లాడతారు.. ఇంతలో మరో సీరియల్ క్రాస్ఓవర్ తీసుకురావడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. నటుడు కౌశిక్ సీరియల్లో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడో చివర కూర్చొని ఉన్న రఘురాం ని ముందుకు రమ్మని ఆ గుడికి పెద్దగా ఉన్న కౌశిక్ పిలవడంతో శైలు అండ్ కో ఫేసులు మాడిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X