Vadinamma : రఘురాంని తీవ్రంగా అవమానించిన శైలు.. రిషి గురించి అసలు నిజం లీక్?

ప్రభాకర్, సుజిత ప్రధానపాత్రలలో తెరకెక్కిన వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతానికి నలుగురు అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరు చొప్పున విడిపోయిన సంగతి తెలిసిందే. భరత, రఘురాం ఒకపక్క లక్ష్మణ్, నాని మరోపక్క నివసిస్తున్నారు.

రిషి అనారోగ్యం పాలైన సమయంలో రఘురామే రిషి అసలైన తండ్రి అనే నిజాన్ని తెలుసుకుంటాడు లక్ష్మణ్.. అప్పటి నుంచి అతను అన్న మీద ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు.. అయితే శ్రీరామనవమి ఉత్సవాలలో శైలు, లక్ష్మణ్ పీటలమీద కూర్చుని వివాహం జరిపిస్తారు అని రాజేశ్వరి చెప్పడంతో గత ఎపిసోడ్ ముగించారు. ఈ విషయంలో భరత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోరు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాళ్ళే ఫైనల్

వాళ్ళే ఫైనల్

రాముల వారి కళ్యాణం జరిపించేది శైలు, లక్ష్మణ్ అనే విషయాన్ని రాజేశ్వరి ప్రకటించడంతో శైలు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇంటి మొత్తానికి నేనే పెద్ద దిక్కు నిరూపించుకునే రోజు వచ్చింది అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న భరత్ మాత్రం ఇప్పటివరకు మన కుటుంబం మీద ఒక గౌరవం ఉంది.

మనలో మనం ఎన్ని గొడవలు పడినా బయటకు మాత్రం కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నాము ఇప్పుడు కనుక మీరు కాకుండా శైలు, లక్ష్మణ్ పీటల మీద కూర్చుంటే ఏదో జరిగిందనే విషయం అందరికీ తెలుస్తుంది అని బాధ పడతాడు. అయితే రఘురాం మాట్లాడుతూ అదేమీ పట్టించుకోవద్దు అని ఎవరు కూర్చుంటే ఏమిటి మనం కూడా కళ్యాణం చూడడానికి వెళ్దాం అన్నట్టు మాట్లాడుతాడు.

మాట ఇచ్చిన జనార్ధన్

మాట ఇచ్చిన జనార్ధన్

అంతే కాక నాకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి లక్ష్మణ్, శైలు కూర్చుంటున్నారు అని జనం అనుకుంటారులే నువ్వేమీ టెన్షన్ పడకు అన్నట్లుగా అభయం చెబుతాడు. తాము పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపిస్తున్న విషయాన్ని శైలు వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి చెబుతుంది. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఇది మొట్ట మొదటి అడుగు అవుతుంది మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ ఆమె ఫోన్ చేయడంతో జనార్ధన్ కూడా నువ్వు ఎప్పటికైనా ఇంటి పెద్ద కోడలు కదా అంటూ ఆమెను మరింత ఆనందింప చేస్తాడు.

అంతేకాక మీకు నా తరపున ముత్యాల తలంబ్రాలు బహుమతిగా తీసుకు వచ్చి ఇస్తాను అని చెప్పు వస్తాడు. ఎమ్మెల్యే జనార్దన్ రావు కూతురు అంటే ఎలా ఉండాలి ఆ రేంజ్ లోనే మీ కార్యక్రమాలు జరిగేలా చూస్తానని మాట ఇస్తాడు.

సీత అభయం

సీత అభయం

మరోపక్క సీత బయటకు వెళ్లడంతో ఆమెతో మాట్లాడేందుకు రాజేశ్వరి ప్రయత్నిస్తుంది. ఎందుకు అలా ఉన్నారు అంటే శైలు కి కోపం రాకూడదు అనే ఉద్దేశంతోనే ఆమె పేరు చెప్పాను కానీ మిమ్మల్ని అవమానించాలని ఉద్దేశం నాకు లేదు అని అంటుంది. రఘురాం ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటే బాగానే ఉన్నాడు మీరేం చెబితే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటూ సీత కూడా చెబుతుంది. నా మీద కోపం లేదు కదా అంటే అలాంటిదేమీ లేదని మీరు ఎలాంటి అనుమానాలు మనసులో పెట్టుకోవద్దని చెబుతుంది.

 సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

ఇక రాములవారి కల్యాణానికి సర్వం సిద్ధమైంది ఇంటి నుంచి బయలుదేరడం కోసం అందరూ కూడా సిద్ధమై కూర్చుంటారు. నాకు మా నాన్న గారి కారు పంపిస్తా అన్నారు అని శైలు చెబుతుంది. మిగిలిన వాళ్లు సరేలే అన్నట్లు అనుకుంటారు. ఆ తర్వాత శైలు, రఘు రామ్ సీత ఇద్దరిని అవమానించే విధంగా ఈసారి పీటలమీద కళ్యాణం చేసేది మేము ఎవరైనా వచ్చి దగ్గర కూర్చుంటారేమో ఇప్పుడే చెబుతున్నాను అంటూ వాళ్లనే అవమానించే విధంగా మాట్లాడుతుంది. అయితే శైలు గురించి అన్ని విషయాలు ముందే తెలిసిన రఘురాం ఈ విషయాల మీద పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయినా సరే అవమానించే విధంగా మాట్లాడుతూ వాళ్లు బయలుదేరి వెళ్తారు.

 అడ్డం తిరిగిన భారత్

అడ్డం తిరిగిన భారత్

ఇక్కడ ఇంతలా అవమానిస్తుంటే కళ్యాణం వద్ద ఇంకెలా అవమానిస్తుందో మనం ఎక్కడికి వెళ్ళద్దు అని భరత్ అంటాడు. ముందు అతనికి సర్దిచెప్పడానికి చాలా ప్రయత్నించారు గానీ ఏ మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో సరే మనం వెళ్లడం మానేద్దాం అని రఘురాం ఉంటాడు. కానీ చివరికి భరత్ కన్విన్స్ కావడంతో సరే మనం వెళదాం అని అంటాడు. అందరూ శ్రీరామనవమి వేడుకల కోసం గుడి దగ్గరికి చేరుకుంటారు. గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత ఈరోజు ఎపిసోడ్ ముగించారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
రిషి గురించి నిజం బట్టబయలు

రిషి గురించి నిజం బట్టబయలు

అయితే రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం లక్ష్మణ్ ఏదో మార్పు కనిపిస్తోంది అని అంటాడు. ఇలా దాచేయడం కరెక్ట్ కాదు అని భావించిన సీత అవును రిషి మన బిడ్డ అనే విషయం లక్ష్మణ్ కి తెలిసింది అనే నిజాన్ని చెప్పేస్తుంది. ఆ నిజం చెబుతున్నప్పుడే లింగం వినడం ఆ విషయాన్ని జనార్దన్ కు చెప్పడం జనార్ధన్ శైలుకు చెప్పినట్లుగా చూపిస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమి ఉన్నాయనేది ఆ ఎపిసోడ్ ప్రసారం అయితే గాని చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X