Vadinamma : రఘురాంని అవమానించాలనుకుని బొక్కబోర్లా పడ్డ శైలు.. ఆయన ఎంట్రీతో అంతా రివర్స్

స్టార్ మా లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ఆసక్తి కరంగా సాగుతోంది. కుటుంబ సభ్యుల మధ్య అనేక మనస్పర్థలు రావడంతో విడివిడిగా బతుకుతున్నారు.. అయితే భరత్ ఎంతసేపటికీ రఘురామ్ తోనే ఉండేందుకు ఇష్టపడటం ఉండడంతో అతనిని ఏం చేసి అయినా సరే తమ వైపు తిప్పుకోవడం కోసం శైలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే తన కుమారుడు రిషికి లివర్ దానం చేసిన సమయంలో తన సొంత కొడుకు కాదనే విషయం తెలుసుకున్న లక్ష్మణ్ అన్నయ్య చేసిన త్యాగం మీద గొప్ప గౌరవం పెంచుకుంటాడు. అయినా సరే భార్యకు ఎదురు చెప్పలేక ఆమె చేస్తున్న అన్ని అవమానాలను చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాముల వారి కళ్యాణం కోసం కుటుంబ సభ్యులు అందరూ సిద్ధమవుతారు అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

చాలా అదృష్టం

చాలా అదృష్టం

శైలు కుటుంబ సభ్యులు, రఘురాం అలాగే మిగతా కుటుంబ సభ్యులు వేరువేరుగా సీతారాముల కళ్యాణం కోసం సీతారామ స్వామి దేవస్థానానికి చేరుకుంటారు.. శైలు అక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూస్తుంటే చాలా బాగుంది అలాగే వీళ్లందరినీ చూస్తుంటే నాకు గర్వంగా కూడా ఉంది అందరూ సీతారాముల కళ్యాణం చూడడానికి వస్తే మనం మాత్రం కళ్యాణం జరిపించడానికి వచ్చాం అలా చేయడానికి చాలా అదృష్టం చేసుకుని ఉండాలి అని అంటుంది. దానికి శిల్ప మాట్లాడుతూ అవును ఆ అదృష్టం నీకు మన అత్తగారు కదా కల్పించింది అన్నట్లు మాట్లాడితే ఆ అవును అన్నట్లు నిష్టూరుస్తుంది.

కళ్యాణం చేసేది మేమే

కళ్యాణం చేసేది మేమే

అయితే శైలు తన తండ్రి కోసం వెతుకుతూ ఉండగా లక్ష్మణ్ ఎవరికోసం వెతుకుతున్నావు అన్నా వదినలకు కోసం వెతుకుతున్నావా అంటే గుడికి వచ్చాక కూడా మీ అన్న వదిన భజన మానవా నేను వెతికేది మా నాన్నగారి కోసం ఆయన నా కోసం ముత్యాల తలంబ్రాలు బహుమతిగా తీసుకు వస్తానని చెప్పారు అని అంటుంది. సరే ముందు లోపలికి వెళతాం అని చెబుతూ లోపలికి వెళుతుంటే అక్కడ ఉన్న వాలంటీర్లు శైలు ఆమె, కుటుంబాన్ని అడ్డుకుంటారు.. ఇది సీతారాముల కళ్యాణం జరిపించేవారు వెళ్లే మార్గం సీతారాముల కళ్యాణం చూసే వారు పక్కన కూర్చోవాలి అని చెప్పి చెబుతారు. ఈ మాట ఏ మాత్రం ఊహించని శైలు తోక తొక్కిన త్రాచు లాగా ఎగిసిపడుతూ నన్నే అవమానించే విధంగా మాట్లాడుతావా లక్కీ నేనెవరో చెప్పు అంటూ భర్తను ఈగ వేస్తుంది.. లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ ఏడాది సీతారాముల కళ్యాణం చేసేది మేమే అని చెబుతాడు.

 అందరూ సమానమే

అందరూ సమానమే

అదేమిటి రామాపురం నుంచి సీతారాముల కళ్యాణం చేసేది రఘురాం గారు కదా అని ప్రశ్నిస్తాడు సదరు వ్యక్తి. వెంటనే రఘురాం ఊరికి సంబంధించిన మరో వ్యక్తిని పిలిచి నీది అదే ఊరు కదా వీళ్ళు ఎవరో నీకు తెలుసా అని అడిగితే వీళ్ళు రఘురాం గారి తమ్ముళ్లు అంటే ఆయన ఉండగా వీళ్ళు ఎందుకు కళ్యాణం జరిపిస్తారు అని అడిగితే అది వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్య మనకు ఎందుకు అరె ప్రశ్నించడంతో సరే లోపలికి వెళ్ళమని పంపిస్తాడు. శైలు వెళ్లి లోపల హడావిడి చేస్తూ ఉన్న సమయంలో జనార్ధన్ వస్తాడు కానీ జనార్ధన్ ను లోపలికి పంపించడానికి ఒప్పుకోరు. నేను మాజీ ఎమ్మెల్యే అని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ జనార్ధన్ ఎంత ప్రయత్నించినా దేవుడు ముందు అందరూ సమానమే పక్కకి వెళ్ళి కూర్చోమని అంటారు.

జీర్ణించుకోలేక తంటాలు

జీర్ణించుకోలేక తంటాలు

అప్పటికే అక్కడ కూర్చుని చూస్తున్న రఘురాం అలాగే మిగతా కుటుంబ సభ్యులు జనార్ధన్ ను చూసి నవ్వుకుంటారు. అయితే అనూహ్యంగా సీరియల్ లో గెస్ట్ ఎంట్రీ ఇచ్చిన కౌశిక్ రాజగోపాల్ అని దేవాదాయ శాఖ అధికారి గా కనిపిస్తున్నారు. గతంలో ఆయన కుమార్తె ఒక రోడ్డు ప్రమాదానికి గురైతే దాని నుంచి సీత ఆమెను కాపాడడంతో ప్రత్యేకంగా రఘురాం సీత ఇద్దరినీ కూడా సీతారాముల కళ్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లి మాట్లాడుతుంటారు. ఇదంతా చూసి ఒక పక్క జనార్ధన్ మరోపక్క శైలు కూడా జీర్ణించుకోలేక తంటాలు పడుతూ ఉంటారు.. ముందు వారు ఎవరో గుర్తు లేకపోయినా చివరికి వారు గుర్తు రావడంతో సీత రఘురాం ఇద్దరు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు.

మరోసారి ఎదురు దెబ్బ

మరోసారి ఎదురు దెబ్బ

మొత్తం మీద సీతారాముల ముందు రఘురాం సీతను అవమానించాలని ప్లాన్ చేసిన శైలుకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పక మానదు.అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. అయితే రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం లక్ష్మణ్ ఏదో మార్పు కనిపిస్తోంది అని అంటాడు. ఇలా దాచేయడం కరెక్ట్ కాదు అని భావించిన సీత అవును రిషి మన బిడ్డ అనే విషయం లక్ష్మణ్ కి తెలిసింది అనే నిజాన్ని చెప్పేస్తుంది. ఆ నిజం చెబుతున్నప్పుడే లింగం వినడం ఆ విషయాన్ని జనార్దన్ కు చెప్పడం జనార్ధన్ శైలుకు చెప్పినట్లుగా చూపిస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమి ఉన్నాయనేది ఆ ఎపిసోడ్ ప్రసారం అయితే గాని చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X