Vadinamma: శ్రీరామనవమి ఉత్సవాలలో అగ్నిప్రమాదం.. రఘురాం చేతుల మీదుగానే వివాహం?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతానికి రఘురాం కుటుంబం అంతా కూడా శ్రీ రామనవమి ఉత్సవాలు జరుపుకునేందుకు సీతా రామస్వామి దేవస్థానానికి చేరుకుంటారు. అయితే ముందే గుడి పెద్దలు వచ్చి ఎవరు పీటల మీద కూర్చుంటారు అని అడిగితే శైలు నోటి కి భయపడి రాజేశ్వరి లక్ష్మణ్ శైలు దంపతులు పీటల మీద కూర్చుని కల్యాణం జరిపిస్తారు అని చెబుతోంది. దానికి భరత్ అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఎక్కువగా కుటుంబ సభ్యులందరూ శైలు నోటి కి భయపడి ఏమీ చేయలేక సైలెంట్గా ఉండి పోతారు.

కుటుంబ సభ్యులందరూ గుడికి వెళ్ళడం గుడిలో రఘురాం, సీత ఇద్దరిని అవమానించాలని శైలు నిర్ణయించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే అనూహ్యంగా దేవాదాయశాఖ కమిషనర్గా ఉన్న రాజగోపాల్ రఘురాం, సీత గతంలో తమ పాపను కాపాడారు అనే విషయం గుర్తు చేసుకుని వారిని వేదిక మీదకు పిలుస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాజగోపాల్ ఎంట్రీతో

రాజగోపాల్ ఎంట్రీతో

రఘురాం, సీత ఇద్దరినీ వేదిక మీదకు పిలిచి రాజగోపాల్ మాట్లాడుతూ ఉండడం చూసి లింగం తన బావతో మనల్ని ఇక్కడే కూర్చో బెట్టారు వాళ్ళు ఏమో వేదిక ఎక్కారు. మనకు దక్కాల్సిన గౌరవం వాళ్లకు దక్కడం తనకు ఏ మాత్రం నచ్చడం లేదని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క లక్ష్మణ్ మాత్రం ఎవరికి దక్కాల్సిన గౌరవం వాళ్లకు దక్కింది.

శైలు వాళ్లను ఎంత అవమానించాలని ప్రయత్నాలు చేసినా చివరికి భగవంతుడు వారికి సముచిత స్థానం కల్పించాడు అని ఆనంద పడుతూ ఉంటాడు. రాజేశ్వరి కూడా ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. శైలు వాళ్ళని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా భగవంతుడు వారిని తన వద్దకు తానే రప్పించుకున్నారు అని భావిస్తుంది.

ఊహించని షాక్

ఊహించని షాక్

ఇంతలో శిల్ప వెళ్లి శైలు ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు వేదిక దాకా వచ్చేశారు ఇంకాస్త ఉంటే వారే వివాహం జరిపించినా జరిపిస్తారు అదే కనుక జరిగితే నీ పెద్దరికం అనే మాట ఇక కల్ల అంటూ భయపెడుతుంది. ఇదిలా జరుగుతుండగా సీతా రాముల వారి గురించి కొన్ని మంచి విషయాలు చెప్పవలసిందిగా రాజగోపాల్ అందరిని అడుగుతాడు.. ముందుగా మైకు రాజేశ్వరి దగ్గరకు రావడంతో రాజేశ్వరి మాట్లాడుతూ రఘు రాముడి గురించి గొప్పగా చెబుతోంది.

రాముడు గురించి చెబుతూనే తన పెద్ద కొడుకు రఘురాం ని ఉద్దేశిస్తూ మాట్లాడినట్లుగా మిగతా కుటుంబ సభ్యులకు అనిపిస్తుంది. అయితే శైలు ఎప్పటిలాగే రాముడి గొప్పతనం కంటే రాముడు ఏం చెప్పినా చేసిన అతని తమ్ముడు గొప్పతనం ఎక్కువ అని చెబుతుంది.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

రఘురాం మాట్లాడుతూ రాముడు తల్లి చేసిన పని వల్లే తన తమ్ముళ్లకు తన మీద ఎంత ప్రేమ ఉందో అనే విషయం అర్థం అయింది అని చెబుతాడు. ఇక వారంతా మాట్లాడిన తర్వాత రాజగోపాల్ మాట్లాడుతూ ఉండగా అక్కడ ఒక వస్త్రానికి నిప్పు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. దీంతో అక్కడి వారంతా కకావికలం గా మారిపోయి పరిగెడుతూ ఉంటారు.

అసలు ఏం జరిగింది అని అర్థం చేసుకునే లోపే ఎవరికివారు పరుగులు తీస్తూ ఉండడంతో రాముల వారి విగ్రహాలు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయానికి అక్కడే ఉన్న రఘురాం సీత ఇద్దరు రాముల వారు సీతమ్మ వారి విగ్రహాలను పొదివి పట్టుకుని అక్కడ ఏర్పడిన అగ్నిప్రమాదం రూపుమాపే ప్రయత్నం చేస్తారు.

మీరే వివాహం జరిపించాలని

మీరే వివాహం జరిపించాలని

దీంతో ఇదంతా చూసిన తరువాత రాజగోపాల్ కూడా కాస్త తేరుకున్నాడు. ఇంతలో రఘురాం మైక్ అందుకొని ఎక్కడివారు అక్కడ ఆగిపొండి అగ్ని ప్రమాదాల్ని ఆపి వేసాము మీకు ఎలాంటి ఇబ్బంది ఇకమీదట ఉండదు మీరు దయచేసి కూర్చోండి అని కోరతాడు.. వెంటనే వాళ్ళందరూ కూడా ఎక్కడివారు అక్కడే ఆసీనులు అవుతారు.

తాము వెళ్లి అవతల కూర్చుంటాము అంటే అవతల కూర్చునే ప్రసక్తే లేదు ఈరోజు మీ చేతులలో స్వామివారు కింద పడకుండా ఆగారు అంటే కళ్యాణం కూడా మీ చేతుల మీద జరిపిస్తే బాగుంటుంది అని చెబుతూ రాజగోపాల్ ఇంకా ఎవరికైనా ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు.

అసలు నిజం తెలిసి పోవడంతో

అసలు నిజం తెలిసి పోవడంతో

అప్పటివరకు తానే పీటలమీద కూర్చుని వివాహం జరిపిస్తా అని భావిస్తూ వచ్చిన శైలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి లోకి వెళ్లిపోతుంది. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. అయితే రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం లక్ష్మణ్ ఏదో మార్పు కనిపిస్తోంది అని అంటాడు.

ఇలా దాచేయడం కరెక్ట్ కాదు అని భావించిన సీత అవును రిషి మన బిడ్డ అనే విషయం లక్ష్మణ్ కి తెలిసింది అనే నిజాన్ని చెప్పేస్తుంది. ఆ నిజం చెబుతున్నప్పుడే లింగం వినడం ఆ విషయాన్ని జనార్దన్ కు చెప్పడం జనార్ధన్ శైలుకు చెప్పినట్లుగా చూపిస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమి ఉన్నాయనేది ఆ ఎపిసోడ్ ప్రసారం అయితే గాని చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X