Vadinamma : ఒక సమస్య క్లియర్ అయిన వెంటనే మరో టెన్షన్.. ప్రమాదంలో 'రిషి'!
జాతరకు విరాళాలు ఇచ్చే విషయంలో రఘురాం కుటుంబ సభ్యుల మధ్య పోటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే రెండు టీములు ఎలాగో పూర్తిస్థాయిలో డబ్బులు సంపాదించే లేకపోయిన కారణంగా సీత సలహా మేరకు రెండు లక్షల 16 వేల రూపాయలు కలిపి జనార్ధన్ తల్లి రాజేశ్వరి చేత ఇప్పిస్తారు. అయితే శైలు ఈ విషయం మీద కూడా బాధపడుతూ తనకు ఇంటి పెద్ద హోదా ఇవ్వలేదని, తన చేతుల మీదుగా ఇప్పించమని చెబుతారు అనుకుంటే చెప్పలేదు అని బాధపడి అత్తగారి దగ్గర గారాలు పోతూ ఉంటుంది. దానికి ఆవిడ కూడా కరిగిపోయి ఇక మీదట ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని చెబుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గిరాకీ లేక
షాపులో గిరాకీ లేక లింగం అలాగే జనార్ధన్ ఇద్దరూ కూడా ఈగలు, దోమలు తోలు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎలా అయినా ఈ షాప్ వదిలించుకోమని లింగం అనడంతో అదే సమయానికి అటుగా వెళుతున్న భరత్ ను పిలుస్తాడు జనార్ధన్. భరత్ దగ్గరకు వచ్చాక మీ వదినకు నువ్వంటే చాలా ఇష్టం. షాప్ ఇవ్వాలని చూస్తే మొన్న తీసుకోలేదు ఇప్పటికైనా సమయం మించిపోయింది ఏమీ లేదు షాపు తీసుకుని మీ వదినతో బావుండు, మీ లక్ష్మణ అన్నయ్య వైపు వెళ్లి అతనితో కలిసి ఉండు అని చెబుతాడు. అయితే భరత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ససేమిరా షాపు తీసుకునేది లేదు ఎలా బతకాలో మా అన్నయ్య మాకు చెబుతాడు మా అన్నయ్య తలుచుకుంటే ఎలా అయినా బతికేలా చేయ గలడు అంటూ జనార్ధన్ కు వార్నింగ్ ఇస్తాడు.

కాళ్ళ దగ్గర పడి ఉంటాడు
భరత్ బయటకు వెళ్లిన తర్వాత స్వీట్ల ఆర్డర్ కోసం ఒక వ్యక్తి వచ్చి వెళ్లిన విషయం తెలుసుకున్న శైలు ఆ ఆర్డర్లను చెడగొట్టాలని తండ్రికి చెబుతుంది. ఇప్పుడే భరత్ వచ్చి వెళ్ళాడు వాడి పొగరు ఏ మాత్రం తగ్గలేదు అని ఈ జనార్ధన్ అంటే ఇలా మనం వాళ్ళ పని చెడగొడుతూ ఉంటే ఏదో ఒక రోజు వాడే వచ్చి మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడు అని శైలు అంటుంది. మొత్తం మీద భరత్ ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో భరత్ ను ఆపిన రాజేశ్వరి ఇప్పటికైనా మావైపు రావచ్చు కదా అని అడుగుతుంది. నాకు మీ వైపు రావాలంటేనే చిరాకుగా ఉంది మీరందరూ వాగు దాటాక తెప్ప తగలేసే రకాలుగా తయారయ్యారు. ఒక అమ్మగా నాకు మంచి విషయాలు బోధించాల్సిన నువ్వే కష్టపడి కుటుంబాన్ని ఇంతవరకు తీసుకువచ్చిన అన్నయ్య గురించి దారుణంగా మాట్లాడావని అంటాడు.

50 వేలు పెట్టి సామాన్లు కొన్నానని
మీ విషయం నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని భరత్ చెబుతాడు. నువ్వెందుకు మీ రఘురాంతో పోల్చుకుంటున్నవు? రఘురాం వేరు మనం వేరు అని చెబుతున్నాను కదా అని తల్లి అంటే నాకు అవన్నీ అనవసరం, ఆయన వైపు నుంచి గంజి నీళ్లు తాగుతా కానీ ఎన్ని ఆస్తులు ఇచ్చినా మీ వైపు మాత్రం రాను అనే విషయాన్ని తెగేసి చెబుతాడు. ఇవన్నీ వింటున్న సీత ఆనందబాష్పాలు రాలుస్తూ భరత్ రాగానే అతనిని మెచ్చుకుంటుంది. అలాగే సిరి కూడా ఇలా తమకు ఆర్డర్ వచ్చిన విషయాన్ని వెల్లడిస్తుంది. మరి అన్నయ్య ఎక్కడ అంటే ఆర్డర్ ఇచ్చిన సామాన్ల కోసం సరుకులు తీసుకురావడం కోసం వెళ్ళాడు అనే విషయం చెబుతుంది. అదే సమయంలో రఘురాం కష్టపడి సరుకులు మోసుకుంటూ వస్తాడు వాళ్ళు ఇచ్చిన పదివేల రూపాయలు అడ్వాన్స్ కాకుండా మరొక 50 వేల రూపాయలు పెట్టి సామాన్లు కొన్నానని రాత్రి అంతా కష్టపడి సరుకు సిద్ధం చేయాలని అంటాడు.

ఫంక్షన్ క్యాన్సిల్
దీంతో వారందరూ కూడా కష్టపడి చేస్తూ స్వీట్లు తయారు చేసే పనిలో బిజీగా ఉంటారు. తెల్లవారిన తర్వాత ఎంతసేపటికి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి వాటిని తీసుకోవడానికి రాడు. ఇదేమిటి ఎంత సమయం దాటుతున్నా ఇంకా రాలేదు అనే ఉద్దేశంతో రఘురామ్ అతనికి ఫోన్ చేయగా అవతలివాళ్ళు ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకున్నారు అని వాళ్ళ తరపు బంధువులు ఎవరు చనిపోయారు అని తెలియడంతో అది క్యాన్సిల్ అయిందని చెబుతారు. ఇంకా ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయేమో మీరు తయారు చేసిన వాటిని ఎవరికైనా ఇవ్వచ్చేమో అని చూస్తున్నాను అని అంటాడు.
Recommended Video

కమింగ్ అప్ ఎపిసోడ్లో
అదేమిటి అలా అంటారు మీ మాట మీద మేము అప్పు చేసి మరీ సామాన్లు సిద్ధం చేశాం ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? అంటే మీ సంగతి సరే నేను కూడా పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను కదా అది మర్చిపోయారా అని ప్రశ్నిస్తాడు సదరు వ్యక్తి. అయితే ఇదంతా జనార్దన్ డైరెక్షన్ మేరకే చేశాడు సదరు వ్యక్తి. దీంతో జనార్దన్ అతనికి 50 వేల రూపాయలు డబ్బులు ముట్ట చెబుతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఇక కమింగ్ అప్ ఎపిసోడ్లో చూపిస్తున్న దాని ప్రకారం రాజేశ్వరి మందులు వేసుకోవడం కోసం ఒక క్యాప్సిల్ తీసి బయట పెడుతుంది. మంచినీళ్లు తెచ్చుకోవడం కోసం పక్కకు వెళ్లే లోపు రిషి ఆడుకుంటూ దానిని మింగేసినట్టు చూపిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులందరిలో మరోసారి టెన్షన్ నెలకొంది.


Click it and Unblock the Notifications











