Vadinamma : రఘు ఫ్యామిలీకి అనుకోని లాభం.. రాజేశ్వరి కారణంగా 'రిషి'కి అస్వస్థత!

ఇప్పటివరకు ఎంతో ఆసక్తికరంగా సాగిన జాతర విషయంలో రెండుగా విడిపోయిన రఘురాం ఫ్యామిలీ రెండు లక్షల రూపాయలు సంపాదించలేకపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిస్తేనే రెండు లక్షల రూపాయలు అవుతాయి అని భావించి సీత ఐడియా చెప్పడంతో అందరూ ఒప్పుకుంటారు అక్కడితో ఒక సమస్య తీరినట్లే అయింది. అయితే జాతరలో స్వీట్లు తిన్న ఒక వ్యక్తి తన అల్లుడుని పంపిస్తాడు. తాను కమిషన్ బిజినెస్ చేస్తానని వేరే వాళ్ల ఫంక్షన్ కోసం మీ స్వీట్లు కావాలని రఘురాం కుటుంబానికి పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత జనార్ధన్ ప్లాన్ ప్రకారం ఫోన్లు ఎత్తకుండా ఏడిపిస్తాడు. ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో చనిపోవడంతో ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యిందని ఆ వ్యక్తి రఘురామ్ కుటుంబానికి చెబుతారు.. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జనార్దన్ ఫోన్

జనార్దన్ ఫోన్

జనార్ధన్ ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరగడంతో వెంటనే భరత్ కు ఫోన్ చేసి నేనేదో ఈగలు తోలుకుంటున్నామని మమ్మల్ని ఎగతాళి చేశారు కదా ఇప్పుడు ఆ ఈగలలో కొన్నింటిని మీ దగ్గరకు పంపమంటావా ఏమిటి? మీ స్వీట్లు మీద వాలుతాయి అంటూ ఎగతాళి చేస్తాడు. అంతేగాక ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వంటే మీ శైలు వదినకి చాలా అభిమానం ఆమె కోరిన విధంగా షాప్ నీకు ఇస్తాను తీసుకో లేదంటే మీ బిజినెస్ లు ఇలానే నాశనం అవుతూ ఉంటాయి అని వార్నింగ్ ఇస్తాడు. భరత్ కి విషయం అర్థమవుతుంది. శైలు పక్కనుంచి చూస్తూ ఉండటంతో మరింత కోపం నషాలానికి అంటుతుంది. కానీ ఏమీ అనలేక కోపంగా చూస్తూ ఉంటాడు. ఎవరు ఫోన్ చేశారు అని రఘురామ్ అడిగితే ఇలా జనార్దన్ ఫోన్ చేశాడు అనే విషయం చెబుతాడు.

షాపులకు డెలివరీ

షాపులకు డెలివరీ

అంతేగాక దీనంతటికీ వెనకాల జనార్ధన్ ఉన్నాడు ఏమో అని అనుమానం తనకు కలుగుతుంది అని చెబుతాడు. అంతేకాక కృష్ణ అనే ఆ వ్యక్తి వాటిని షాపులకు డెలివరీ ఇస్తున్నాడు అని తనకు అనుమానంగా ఉందని ఎక్కడ డైరెక్టుగా కాంటాక్ట్ అవుతామో అనే ఉద్దేశంతో ఫంక్షన్లకు డెలివరీ ఇస్తున్నారు అని అబద్ధం చెప్పి ఉంటాడు అని అంటాడు. నీకు నిజంగా అతను డెలివరీ ఇచ్చే షాప్ తెలుసా అని రఘురామ్ అడగడంతో తనకు ఒక షాపు తెలుసు అని అక్కడికి వెళ్లి అడుగుదామని భరత్ అంటాడు. సరేనన్న రఘురాం తాము తయారు చేసిన స్వీట్లు, పిండి వంటలు అన్ని తీసుకుని సదర్ షాప్ దగ్గరికి వెళ్తారు. షాప్ దగ్గరకి వెళ్ళేటప్పటికి అందులో ఉన్న మార్వాడి శేటు కూడా ఆర్డర్ డెలివరీ ఇవ్వాల్సిన వ్యక్తి హ్యాండ్ ఇచ్చాడు అంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు.

 కృష్ణ బాధితులమని చెప్పి

కృష్ణ బాధితులమని చెప్పి


రఘురామ్ ఈ విషయం విని జాగ్రత్తగా డీల్ చేయని తమ్ముడిని పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శేటుతో తాము కూడా మీలాగే కృష్ణ బాధితులమని చెప్పి మాట్లాడుతుండగా నాకు ఏమీ అర్థం కావడం లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపొండి అంటూ శేటు అంటాడు. రఘురామ్ కి వెంటనే ఒక ఐడియా వచ్చి మీరు కృష్ణకు ఆర్డర్ ఇచ్చింది ఈ సరుకులు ఏమో చూడండి అంటూ ఒక లిస్ట్ ఇస్తాడు. తాను ఇచ్చిన సరుకులు లిస్ట్ తనకే ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయిన శేటు అవును ఇది మా సరుకుల లిస్ట్ మీ దగ్గరకు ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తాడు. సరుకులు తయారు చేసి ఇచ్చేది కృష్ణ వాళ్ళు కదా అని అనడంతో లేదు ఈ సరుకులు తయారు చేసేది మేము వాటిని తీసుకువచ్చి మీకు కమిషన్ కి అతను అమ్ముకుంటాడు అనే విషయాన్ని రఘురాం చెబుతాడు.

 బిజినెస్ ఆఫర్

బిజినెస్ ఆఫర్


అంతేకాక మాకు ఆర్డర్ ఇవ్వడంతో మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా ఈ స్వీట్లన్నీ తయారు చేశామని ఇప్పుడు వీటిని ఏం చేయాలో మీరే ఒక దారి చూపించాలి అని అడుగుతారు. వెంటనే శేటు వాటిని మాకు డెలివరీ ఇచ్చేయండి డబ్బులు తీసుకుని వెళ్ళండి ఇకమీదట కూడా మీరే డైరెక్ట్ డెలివరీ చేయండి వాడు మీ దగ్గరికి వస్తే కాళ్లు విరగ్గొట్టండి అని చెబుతాడు. ఆనందంతో సరుకు వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఈలోపు సీత దేవుడి దగ్గర కూర్చుని ప్రార్ధిస్తూ ఉంటుంది ఎందుకు అక్క అంత బాధ పడుతున్నావు అంటే మన వాళ్ళు వెళ్ళిన పని సవ్యంగా జరగాలని అంటుంది. రఘురాం భరత్ రావడంతోనే మేము ఏం తీసుకొచ్చాము చూడండి అంటూ ఇంటికి వస్తారు.

మందులు మింగేసిన రిషి

మందులు మింగేసిన రిషి

ఏం తీసుకువచ్చారు అని అడిగితే ఇలా సరుకు అమ్ముడు పోయిన సంగతి చెప్పి మీకు చీరలు తీసుకు వచ్చామని చెప్పి చూపిస్తారు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని పైకి అంటున్నా లోలోపల మాత్రం ఆనంద పడుతూనే ఉంటారు. భరత్, శైలు ముఖం మీదే ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా చెప్పి ఆమె మరింత కొప్పడేందుకు కారణమవుతాడు. ఆ తర్వాత శైలు తన కొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది. కొడుకు మాత్రం రఘురాం తీసుకువచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ ఉండడం చూసి కోపంతో అరుస్తూ ఉంటుంది. వెంటనే తన వద్దకు రావాలి అంటూ గట్టి గట్టిగా అరవడంతో పాపం పిల్లవాడు ఏడుస్తూ అటువైపు వెళ్ళిపోతాడు. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు.. తాజా ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రాజేశ్వరి మందులు వేసుకోవడం కోసం ఒక క్యాప్సూల్ తీసి బయట పెడుతుంది. మంచినీళ్లు తెచ్చుకోవడం కోసం పక్కకు వెళ్లే లోపు రిషి ఆడుకుంటూ దానిని మింగేసినట్టు చూపిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులందరిలో మరోసారి టెన్షన్ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X