Vadinamma : రిషి ఆరోగ్యం గురించి షాకింగ్ విషయం బయట పెట్టిన సీత.. ప్రమాదంలో 'రిషి' ప్రాణం?

రఘురామ్ స్వీట్ల వ్యాపారం ఇప్పుడు కుటుంబంలో కొత్త టెన్షన్ తీసుకువచ్చింది స్వీట్ల వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో భార్యలకు చీరలు సహా ఇంట్లో పాపకు ఆడుకునే బొమ్మలు కొనుక్కుని తీసుకువస్తారు. రిషి కోసం కొనుక్కుని తీసుకుని వద్దామని అనుకున్నా శైలు ఏదో ఒకటి అంటుంది అనే ఉద్దేశంతో ఎలాంటి బొమ్మలు తీసుకు రాకుండా ఇంటికి వస్తారు. ఇంట్లో వైదేహి ఆడుకుంటూ ఉంటే ఆ బొమ్మల కోసం రిషి ఒక పక్క నుంచి మరో పక్కకి రావడం ఆ తర్వాత శైలు వచ్చి రిషిని లాక్కొని వెళ్ళటం అందరికీ తెలిసిందే.. అయితే రాజేశ్వరి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా అనుకోని పరిస్థితుల్లో దానిని రిషి మింగటంతో అతని ఆరోగ్య పరిస్థితి చిక్కుల్లో పడుతుంది.. ఎవరు ఎన్ని చెప్పినా శైలు మాత్రం అదేమీ లేదు అని వాదిస్తూ ఉంటుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అవమానిస్తూ

అవమానిస్తూ

పిల్లవాడు కేవలం ఆటబొమ్మల కోసమే ఏడుస్తున్నాడు అని భావిస్తున్న శైలు రఘురాం కానీ సీత గాని సిరి, భరత్ గాని చెబుతున్న మాటలు ఏ మాత్రం పట్టించుకునే స్థితిలో ఉండదు. శైలు బాబు టాబ్లెట్ మింగి ఉంటాడు వాడిని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని సీత చెబుతుంటే వాడు మింగి ఉంటాడు అని బాధ పడుతున్నారా లేక మింగాలని కోరుకుంటున్నారా? అని మాటలతో బాధ పెడుతుంది. అంటే మీకు పిల్లలు లేరు నాకు ఉన్నారు అని అసూయతో అలా మాట్లాడుతున్నారు అంటూ శైలు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆమె మాత్రం వినిపించుకునే పరిస్థితుల్లో ఉండదు. దీంతో రఘురాం భరత్ ను పిలిచి ఈ విషయం లక్ష్మణ్ కి చెప్పాలి వాడికి ఫోన్ చేయమని చెబుతాడు. లక్ష్మణ్ కి భరత్ ఫోన్ చేస్తూ ఉండగా ఫోన్ కట్ చేసి తాను బిజీగా మీటింగ్లో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను అని మెసేజ్ పెడతాడు లక్ష్మణ్.

వణికి పోతానా?

వణికి పోతానా?


అయితే ఏంటి లక్ష్మణ్ ఫోన్ చేస్తే నేను వణికి పోతానా? నేను ఎవరు చెప్పినా వినేది లేదు అన్నట్లు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటుంది శైలు. అయితే ఒకసారి ఫోన్ ఎత్తడం లేదు అని చెబితే గట్టిగా అరుస్తూ మరోసారి ఫోన్ చెయ్ ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అని రఘురాం అంటాడు. అయినా సరే లక్ష్మణ్ ఫోనెత్తడు. ఈలోపు శైలు మాట్లాడుతూ మా నాన్న కాసేపట్లో బొమ్మలు తీసుకుని ఇంటికి వస్తాడు ఆ బొమ్మలు తీసుకు వచ్చిన తర్వాత వాడు ఆడుకుంటుంటే అప్పుడు చూసి తెలుసుకుందురు గాని అని అంటుంది. అయితే వాడు టాబ్లెట్ మింగాడు అని వీళ్ళందరూ భావిస్తూ ఉండగా వాడికి అన్నం తినిపించే టైం దగ్గర పడింది ఆకలి వేసి ఏడుస్తున్నాడు అంటూ శైలు అన్నం కలుపుకు వస్తానని చెప్పి బాబును శిల్పకి అప్పగించి వెళుతుంది. బాబును ఇవ్వమని శిల్పను ఎంత బతిమిలాడినా ఆమె కూడా కదలకుండా ఉంటుంది. శైలు వచ్చి బాబుకి అన్నం తినిపిస్తూ ఉండగా బాబు నోటి నుంచి నురగ రావడం మిగతా కుటుంబ సభ్యులు గమనిస్తారు.

కాపాడటం కోసమే

కాపాడటం కోసమే


రాజేశ్వరి కూడా గమనించి వాడి నోటి నుంచి నురగ వస్తోంది శైలు అంటే అది నురగ కాదు మీ బొంద కాదు అది చొంగ అని శైలు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇక ఎన్ని చెప్పినా వినడం లేదు అనే ఉద్దేశంతో సీత వెళ్లి బాబుని లాక్కుని హాస్పిటల్ కి బయలుదేరుతుంది. నేను వెళ్ళనివ్వనని శైలు అడ్డం తగలడంతో ఆమెను తోసివేయడంతో వెళ్ళి కింద పడుతుంది. కింద పడిన తర్వాత ఓవరాక్షన్ చేస్తూ తనకు ఏదో జరిగి పోయింది అనే ఉద్దేశంతో అక్కడే పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత జనార్ధన్ రావడంతో సీత నన్ను ఇలా పడేసి నా బాబుని లాక్కుని వెళ్ళిపోయింది బతికితే అది బతకాలి లేదా నేను బతకాలని అంటుంది. రాజేశ్వరి అదేమీ లేదని బాబు నోటి నురగ నుంచి వస్తుంటే కాపాడటం కోసమే సీత హాస్పిటల్ కు తీసుకు వెళ్ళింది అని చెబుతోంది.

లివర్ సమస్యతో

లివర్ సమస్యతో


మరోపక్క హాస్పిటల్ కి తీసుకు వెళ్ళిన తర్వాత సీత బాబుని అడ్మిట్ చేస్తుంది. ఆ తర్వాత రఘురాంతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నీకు ఈ విషయం చెప్పలేదు బాబు పుట్టినప్పుడు లివర్ సమస్యతో పుట్టాడు అని రఘు రాంకు చెబుతుంది. పెరిగే కొద్దీ సమస్య నయం అవుతుందని అన్నారు కాబట్టి నేను ఎవరితోనూ చెప్పాలి అనుకోలేదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందో అని భయంగా ఉందని చెబుతుంది. మరోపక్క డాక్టర్ వచ్చి బాబు లివర్ సమస్యతో బాధపడుతున్నాడు అని టెస్ట్ చేసిన తర్వాత తాను ఊహించిన దానికంటే పరిస్థితి తీవ్రంగా ఉందనే విషయం చెబుతుంది. ఏం చేయాలో అర్థం కాక రఘురాం, సీత, భరత్, సిరి బాధపడుతూ ఉంటారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 పోలీస్ కంప్లయింట్

పోలీస్ కంప్లయింట్

అయితే అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. కమింగ్ ఎపిసోడ్ లో చూపిస్తుంది దాని ప్రకారం రిషిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ అందరూ టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మణ్ మాత్రం కోపంగా వెళ్లినట్టు కనిపిస్తోంది లక్ష్మణ్ ను ఆపి ఇది పగలు ప్రతీకారాలకు సమయం కాదు దయచేసి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని భరత్ అంటాడు. కానీ నా కొడుకుని బలవంతంగా తీసుకు వెళ్లడం ఏంటి అంటూ లక్ష్మణ్ సీరియస్ అవుతున్నాడు. ఇంతలో జనార్ధన్ నా కొడుకుని లాక్కెళ్లారు అంటూ కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు అని లక్ష్మణ్ కి ఇస్తాడు. లక్ష్మణ్ కూడా సంతకం పెడుతున్నట్లు కనిపిస్తోంది చూడాలి తరువాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X