twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : చావు బతుకుల్లోనే 'రిషి'.. లక్ష్మణ్ చేత మరో ఆటకు సిద్దమైన జనార్ధన్?

    |

    రఘురామ్ కుటుంబంలో అన్ని కష్టాలు తీరి పోయాయి అనుకున్న సమయంలో రిషి అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. అతడిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా లివర్ చెడిపోయిందని వీలైనంత త్వరగా లివర్ మార్చాలి అని డాక్టర్లు షాక్ ఇస్తారు. మరోపక్క నా కొడుకుని చంపనయినా చంపుకుంటాను నా ఇష్టం అంటూ మాట్లాడిన శైలు ని సీత ఒక్క తోపు తోయడంతో ఆమె వెళ్ళి కిందపడి గాయపడుతుంది. ఆమెను కూడా అదే హాస్పిటల్ కు తీసుకు వచ్చిన ఆమె తండ్రి జనార్ధన్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు.

    ఆమెకు ఏమైంది అని డాక్టర్ ను ప్రశ్నించగా జరిగిన విషయం అంతా చెబుతాడు. అయితే ఆమె ఇక మీదట ఆందోళన కలిగించే విషయాలు ఏవీ తెలుసుకోకూడదు అని ఆ విషయంలో జాగ్రత్త తీసుకోమని జనార్ధన్ కు చెబుతుంది డాక్టర్. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

    జనార్ధన్ తన బావ మరిదితో కలిసి

    జనార్ధన్ తన బావ మరిదితో కలిసి

    ఆమె లేచేటప్పటికి ఆమె కొడుకు ఎక్కడ ఉన్నాడో వెతుక్కుని తీసుకువచ్చి ఇస్తే గానీ మనం బ్రతకలేము. దానికి తోడు ఆమె అసలు ఏమాత్రం యాంగ్జైటీ ఫీల్ అవ్వకూడదు అని డాక్టర్లు చెప్పారు అనే ఉద్దేశంతో జనార్ధన్ తన బావ మరిదితో కలిసి ఎక్కడ పిల్లవాడు ఉన్నాడు అని వెతికేందుకు బయలుదేరుతాడు. ఇంతలో బావమరిది వాళ్ళు కూడా ఇదే హాస్పిటల్ కి బాబు ని తీసుకు వచ్చినట్లు నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే మనం కంగారులో శైలు ని తీసుకుని వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేస్తున్న సమయంలో నేను భరత్ లాంటి వ్యక్తిని చూశాను.

    బహుశా వాళ్లు కూడా ఇదే హాస్పిటల్ లో ఉండి ఉండవచ్చు అని అంటాడు. దీంతో రిసెప్షన్ వద్దకు వెళ్లి రిషి అనే పేరుతో ఎవరైనా పిల్లవాడిని తీసుకు వచ్చి జాయిన్ చేశారా అనే విషయం తెలుసుకుని అటుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా భరత్ అడ్డుపడతాడు. భరత్ మీద అరుస్తూ గోల చేయడానికి ప్రయత్నించిన సమయంలో రఘురామ్ అక్కడికి చేరుకుంటాడు.

    దూరం చేస్తున్నారు అంటూ

    దూరం చేస్తున్నారు అంటూ

    ఎంత చెప్పినా జనార్ధన్ వినకుండా అల్లరి చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో సీత బాబు లివర్ సమస్యతో బాధపడుతున్నాడు అని వాడు ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నాడు అని చెబుతోంది. అప్పటివరకు అల్లరి చేయాలని ఫిక్స్ అయి వచ్చిన జనార్ధన్ కూడా ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తాడు, ఒకవేళ వాడికి ఏమైనా జరిగితే నా కూతురు తట్టుకోలేదు అదికూడా చచ్చిపోతుంది ఇప్పుడు నేను సైలెంట్ గా ఉండడమే బెటర్ అని భావించి ఎంత ఖర్చయినా పర్వాలేదు వాడు మాత్రం ప్రాణాలతో బతకాలి అనే రఘురాంతో అంటాడు జనార్ధన్.

    డబ్బు పెట్టిననా బతుకుతాడు అని చెప్పలేము అంతా డాక్టర్ల చేతిలో ఉంది అని సీత కూడా అనడంతో ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళి పోతారు. అయితే రాజేశ్వరి హాస్పిటల్ కి వస్తుంది. బాబు దగ్గరికి వెళ్లనివ్వడం లేదు అంట ఏమిటి అసలు ఎందుకు వాడిని ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు వాడిని దూరం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంది.

    గొడవ పెట్టుకుంటే చెబుతా

    గొడవ పెట్టుకుంటే చెబుతా

    నేను సీత తోనే మాట్లాడుతా అంటూ సీత దగ్గరకు వెళ్ళిన రాజేశ్వరి ఎందుకు శైలు నుంచి వారిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు? వాడి తల్లి వాడికి దూరంగా ఉంటే తట్టుకోగలదా అని ప్రశ్నిస్తుంది. అయితే దానికి సీత మాత్రం వాడు చావుబతుకుల్లో ఉన్నాడు వాడు పూర్తిగా కోలుకున్న తర్వాత నేను వాళ్లకు అప్ప చెబుతాను, నేను నా మనస్ఫూర్తిగా శైలు కి బాబుని ఇచ్చేసాను ఇప్పుడు వెనక్కి లాక్కునే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు అని అంటుంటే అప్పటివరకు భయపెట్టడం కోసం అలా చెబుతూ ఉందేమోనని అనుకున్న రాజేశ్వరి సీత మాటలు విన్నాక భయపడుతుంది.

    ఇప్పుడు ఏం చేయాలి ? వాడు నా టాబ్లెట్ వల్ల ఇలా ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు అని ఆమె బాధ పడుతుంది. జరిగిన దాన్ని ఏమి చేయలేము ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి, నా అంతట నేను వాడు నా కొడుకు అనే విషయం ఎవరికీ చెప్పను వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటే చెబుతాను ఏమో తెలియదు వాళ్ళు నా దగ్గరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అత్తగారితో అంటుంది సీత.

    పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలని

    పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలని

    లెక్క ప్రకారం రఘురాం కన్నతండ్రి కావడంతో తన లివర్ మ్యాచ్ అవుతుందేమో చూడండి అని డాక్టర్లకు చెప్పడంతో డాక్టర్లు రఘురామ్ కి సంబంధించి టెస్టులు చేస్తూ ఉంటారు. తన భార్య హాస్పిటల్ పాలయింది అనే విషయం తెలుసుకుని హుటాహుటిన హాస్పిటల్ కి వస్తాడు లక్ష్మణ్. అయితే జనార్ధన్ అప్పటికే లక్ష్మణ్ చేత వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలని అనుకుంటూ ఉంటారు. లక్ష్మణ్ వచ్చిన తర్వాత శైలు ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది అంటూ చెబుతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు.

    కమింగ్ ఎపిసోడ్ లో

    కమింగ్ ఎపిసోడ్ లో

    కమింగ్ ఎపిసోడ్ లో చూపిస్తుంది దాని ప్రకారం రిషిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ అందరూ టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మణ్ మాత్రం కోపంగా వెళ్లినట్టు కనిపిస్తోంది లక్ష్మణ్ ను ఆపి ఇది పగలు ప్రతీకారాలకు సమయం కాదు దయచేసి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని భరత్ అంటాడు. కానీ నా కొడుకుని బలవంతంగా తీసుకు వెళ్లడం ఏంటి అంటూ లక్ష్మణ్ సీరియస్ అవుతున్నాడు. ఇంతలో జనార్ధన్ నా కొడుకుని లాక్కెళ్లారు అంటూ కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు అని లక్ష్మణ్ కి ఇస్తాడు. లక్ష్మణ్ కూడా సంతకం పెడుతున్నట్లు కనిపిస్తోంది చూడాలి తరువాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది.

    English summary
    Vadinamma Episode 795: Janardhan is stunned when he learns about Rishi's health condition. Sita, on the other hand, demands Rajeshwari to stay away from her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X