Vadinamma : 'రిషి' విషయంలో కొత్త షాక్.. కుమిలిపోతున్న లక్ష్మణ్.. రఘు త్యాగం?

రిషి చావుబతుకుల మధ్య ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని బతికించుకోవడం కోసం రఘు రామ్, సీత కష్టాలు పడుతూ ఉంటే మరోపక్క తన బిడ్డను తనకు ఇప్పించాలని లక్ష్మణ్ పెద్ద ఎత్తున పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మణ్ దాని కోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఇక వీడి దగ్గర నిజం దాక్యాడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో లక్ష్మణ్ కి నిజం చెప్పేందుకు రాజేశ్వరి సిద్ధమవుతుంది. తన తల్లితో అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి లక్ష్మణ్ బయలుదేరి వెళతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు నిజం చెప్పేసిన రాజేశ్వరి

అసలు నిజం చెప్పేసిన రాజేశ్వరి


ఎందుకు కంప్లైంట్ రాస్తుంటే చింపేసావు అని తల్లిని లక్ష్మణ్ ప్రశ్నించడంతో నిన్ను నీ భార్యను కాపాడటం కోసమే అలా చేశాను అని అంటుంది. అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? నాకు ఏమీ అర్థం కావడం లేదు దయచేసి అర్థమయ్యేలా చెప్పమంటే బాబు ఇప్పుడు వాడి కన్నతండ్రి దగ్గరే ఉన్నాడు కన్నతండ్రే వాడికి లివర్ దానం చేస్తున్నాడు అని అంటుంది.. అదేమిటి నేను ఇక్కడ ఉంటే కన్నతండ్రి అంటున్నావు ఏమిటి అని అనడంతో అసలు బాబు నీకు పుట్టిన బిడ్డ కాదు అని సీత రఘురాంలకు పుట్టిన బిడ్డ అని రాజేశ్వరి చెబుతుంది. శైలు, సీత ఒకేసారి ప్రసవం జరగడంతో శైలు పురిటి బిడ్డ చనిపోతే ఆమె ఎక్కడ తట్టుకోలేకపోతుందేమో అనే బాధతో సీత తనకు పుట్టిన బిడ్డను మీ బిడ్డగా భావించి శైలు పక్కలో పడుకో పెట్టిన విషయాన్ని చెబుతుంది. ఈ విషయం మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. ఈ విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు అనే మీ వరకు రానివ్వకుండా రఘు రామ్ సీత జాగ్రత్తపడ్డారు అని చెబుతుంది.

ఆవేదనలో లక్ష్మణ్

ఆవేదనలో లక్ష్మణ్

అయితే తన అన్న, వదిన ఎంతటి గొప్ప వారు అనే విషయం అర్థం చేసుకున్న లక్ష్మణ్ ఇప్పటి వరకు తల్లి మాటలు విని భార్య మాటలు విని వాళ్ల అవమానించినందుకు కుమిలిపోతూ కూల బడిపోతాడు. అంత మంచి అన్నా వదిన ఇద్దరినీ ఎందుకు నీ కడుపున పుట్టలేదు అనే ఏకైక కారణంతో మాకు దూరం చేశావు అని తల్లిని ప్రశ్నించడంతో నా కొడుకులు ముగ్గురు అయినా కలిసి ఉంటారేమో అని దురుద్దేశంతో అలా చేశాను అని రాజేశ్వరి బాధపడుతుంది. అయితే రిషి మా కొడుకు కాదు అనే విషయం భరత్ కు తెలుసా అంటే తెలుసు అని అంటుంది. భరత్ అదృష్టవంతుడు వాడికైనా అన్ని విషయాలు తెలుసు అందుకే వాడు అన్న వైపే నిలబడ్డాడు అని లక్ష్మణ్ అంటాడు.

ఆపరేషన్ కు సిద్దం

ఆపరేషన్ కు సిద్దం

ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా రఘురాం ఆపరేషన్ థియేటర్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలో డాక్టర్ వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి వీలులేదు అని అంటుంది. అదేమిటి అంతా సిద్ధం అయిపోయింది కదా నా భార్య కూడా సంతకం పెట్టే ఉంటుంది కదా ఎందుకు నన్ను వద్దు అంటున్నారు, నేను ఆమెను ఒప్పించాను కదా అని రఘురాం ప్రశ్నిస్తాడు. మీరు ఒప్పించారా మీ భార్యకు మీకు 75 శాతం మాత్రమే బతికే అవకాశం ఉందని నేను చెప్పిన విషయం చెప్పారా అని డాక్టర్ ప్రశ్నిస్తుంది. అది చెప్పలేదు అది చెబితే ఆమె నన్ను ఆపరేషన్ థియేటర్ కి పంపడానికి కూడా ఇష్టపడదు పొరపాటున మీరు ఏమైనా చెప్పారా అని రఘురామ్ ప్రశ్నిస్తాడు. నేనెందుకు చెబుతాను నేను ఏమీ చెప్పలేదు. కానీ మీరు నేను మాట్లాడుకుంటున్న సమయంలో ఆమె విన్నారు అని అంటుంది డాక్టర్..

షాక్ ఇచ్చిన సీత

షాక్ ఇచ్చిన సీత

దీంతో ఏం చేయాలో అర్థం కాక రఘురాం బాధపడతాడు. మీరు ఆపరేషన్ కు సిద్ధం చేయండి నేను నా భార్యను ఒప్పించి ఆపరేషన్ థియేటర్ కు తీసుకు వస్తాను అని చెప్పి బయటకు వచ్చి సీతతో మాట్లాడడం మొదలు పెడతాడు. రఘురాం రావడం చూసి భరత్, సిరి కూడా ఆనందపడతారు వచ్చిన తర్వాత రఘురాం మాట్లాడుతూ సీత నువ్వు సంతకం పెట్టను అన్నావు ఏమిటి అని ప్రశ్నిస్తాడు. నువ్వు దూరమై పోతాను అంటే ఎలా నేను దానికి ఒప్పుకుంటాను అని సీత ప్రశ్నిస్తుంది. అయితే దానికి రఘురాం చాలా సేపు సీతతో మాట్లాడుతూ ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఒప్పుకునేది లేదు అని

ఒప్పుకునేది లేదు అని


సీత కూడా ఈ విషయంలో తాను ఒప్పుకునేది లేదు అని ఖరాఖండిగా చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ చివరికి ఇదే పరిస్థితిలో నువ్వు ఉండి నేను సంతకం పెట్టను అంటే ఊరుకునేదానివా? ఎలా అయినా సంతకం పెట్టేలా చేసే దానివి కదా అని రఘురామ్ అంటూ ఎట్టకేలకు సీతను ఒప్పిస్తాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం ఆపరేషన్ థియేటర్ కు వెళుతూ ఉండగా సీతతో మాట్లాడతాడు. ఖచ్చితంగా తిరిగి వస్తాను అంటూ సీతకు నమ్మకం కలిగిస్తాడు. సీత కూడా నువ్వు వస్తానని మాట ఇచ్చావు మాట తప్పద్దు అని కోరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X