Vadinamma Serial May 19th Episode: రఘురాం ఇంటి మీద దాడి..వదినమ్మ చేతిలో చెయ్యేసి... లక్ష్మణ్ సూసైడ్?

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దాదాపు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో జనం మొన్నటి దాకా సినిమాలని ఎంజాయ్ చేసినా ఇప్పుడు మళ్ళీ సినిమాల కంటే ఎక్కువ సీరియల్సే చూస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆడవాళ్ళతో పాటు మగవారు కూడా సీరియల్స్‌కి అభిమానులు అయ్యారు అంటే అతిసయోక్తి కాదు. ఇక తెలుగులో టాప్ 5 సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న వదినమ్మ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

టాప్ 5లో ఒకటి

టాప్ 5లో ఒకటి

545 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ 546 ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం కానుంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌గా ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. ఒక రకంగా ఈ సీరియల్ లో ఒక సమస్య తీరింది అనుకునే సమయానికి మరో పెద్ద సమస్య తెర మీదకు తెస్తారు. ఇక ఎలాంటి సమస్య వచ్చినా అందరూ సంతృప్తి పడేలా ఏదో ఒక పరిష్కారం తీసుకొచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది ఈ సీరియల్ యూనిట్.

కండిషన్ మీద రిలీజ్ అయిన లక్ష్మణ్

కండిషన్ మీద రిలీజ్ అయిన లక్ష్మణ్

రఘురాం సోదరుడు లక్ష్మణ్‌ నాసిరకం అపార్ట్ మెంట్ కట్టి అవి కూలిపోవడానికి కారణం కావడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. లక్ష్మణ్‌ని విడుదల చెయ్యాలంటే.. ఓ కండిషన్ ఉందని.. అలా అయితే లక్ష్మణ్‌ని విడుదల చేస్తానని పోలీసులు చెబుతారు. లక్ష్మణ్ కంపెనీ కస్టమర్స్‌కి కట్టాల్సిన 20 కోట్లు 4 రోజుల్లో చెల్లిస్తామని అంటేనే లక్ష్మణ్‌ని విడిఛి పెడతామని చెబుతారు. అందుకు ఓకే చెప్పి లక్ష్మణ్‌ని ఇంటికి తీసుకొస్తాడు రఘురాం.

ఇంటి మీద దాడికి

ఇంటి మీద దాడికి

ఇక తాజా ఎపిసోడ్ లో లక్ష్మణ్ కంపెనీ వలన మోస పోయిన అందరూ అతని మీద కసితో పగ తీర్చుకునేందుకు ఇంటిపైకి కర్రలు రాడ్లతో దాడికి వస్తారు. కర్రలతో వాళ్లంతా లక్ష్మణ్ బయటికి రారా అంటూ పెద్ద ఎత్తున అరుస్తూ ఉండడంతో భయపడి రఘురాం, భరత్‌లు అన్ని వైపులా తలుపులు వేసేస్తారు. అయితే రాద్దాంతం జరుగుతూ ఉండడంతో ఇంట్లో ఆడవాళ్ళూ డోర్ వద్దకు వస్తారు. లక్ష్మణ్ అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడతాను అన్నా వాళ్ళు కొట్టడానికి వచ్చారు అని రఘురాం లక్ష్మణ్‌ని బయటికి వెళ్లనీయడు. అయితే వాళ్లు ఆరుస్తూ తలుపులు పగల కొట్టడానికి చూస్తూ ఉంటారు.

పోలీసులకు ఫోన్

పోలీసులకు ఫోన్

ఈ సమయంలో రఘురాం తలుపులకు అడ్డు నిలబడి.. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెబుతాడు. ఇక చాలా సేపు వాళ్ళంతా ఇంట్లోకి చొచ్చుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఆడవాళ్లు కూడా ఇదంతా చూసి భయపడి పోతూ ఉంటారు. ఇక ఇదే సమయంలో లక్ష్మణ్ ఎలాగైనా బయటికి వెళ్తాను అని అంటాడు. అయితే బయటకు రాకపోతే ఇల్లు తగలబెడతాం అని బయట నుంచి మాటలు వినిపించడంతో లక్ష్మణ్ ఇక ఎవరు ఆపినా ఆగకుండా అందరికీ సర్ది చెప్పి బయటికి వెళ్తాడు. ఈ సమయంలో వాళ్లకు లక్ష్మణ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది..

రఘురామ్ తలకి గాయం

రఘురామ్ తలకి గాయం

కావాలంటే చంపుకోమని లక్ష్మణ్ అనడంతో వాళ్లలో ఒకరు ఆయనను కొట్టబోతారు ఈ సమయంలో రఘురాం అడ్డం వస్తాడు.. ఆ దెబ్బ రఘురాం తలకి తగులుతుంది. దీంతో ఆయన నుదుటి నుంచి రక్తం కారుతుంది.. ఈ సమయంలో పోలీసులు వచ్చి దాడికి వచ్చిన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో కి వెళ్ళాక లక్ష్మణ్ తన వల్లే అన్న కు దెబ్బ తగిలింది అని బాధ పడతాడు. భరత్ కూడా నువ్వు బయటకు వెళ్లకుండా ఉంటే దెబ్బ తగిలింది కాదని చెబుతుండడంతో తాను బయటకు వెళ్లడం
ఇదంతా తప్పా అని లక్ష్మణ్ ప్రశ్నిస్తాడు.

భోజనానికి రాకుండా

భోజనానికి రాకుండా

అయితే రాత్రి అందరూ భోజనానికి కూర్చున్న లక్ష్మణ్ మాత్రం భోజనం చేయడానికి రాడు. అయితే లక్ష్మణ్ ను బతిమాలి తీసుకువస్తానని సీత అతని రూమ్ కి వెళుతుంది. అయితే తనను తీసుకువెళ్లడానికి వచ్చిన వదినమ్మకు తన మనసేం బాలేదు అని తలనొప్పిగా ఉందని చెబుతాడు లక్ష్మణ్. దీంతో కిందకు వచ్చిన సీత శైలు తో తిన్నాక లక్ష్మణ్ కి పాలు తీసుకు వెళ్ళు, తలనొప్పిగా ఉందని చెబుతుంది.

నిద్రమాత్రలు మింగి

నిద్రమాత్రలు మింగి

ఇక అందరూ తిని పడుకున్నా గా లక్ష్మణ్ ఇంకా మెలకువగా ఉండి జరిగినదానికి బాధపడుతూ ఉంటాడు.. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ వద్దకు వెళ్లిన సీత మళ్లీ ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో లక్ష్మణ్ సీత చేతిలో చేయి వేసి వదినను ఇంకాసేపు ఇక్కడే ఉండు అంటూ ఎమోషనల్ డైలాగ్ చెబుతాడు. అయితే ఎప్పుడూ లేనిది ఏమిటి ఎలా చిన్నపిల్లల మాట్లాడుతున్నావు అని అడిగితే అదేం లేదు వదినమ్మ ఆకలేస్తుంది ఆఖరి సారి నాకు అన్నం పెడతావా అని అడుగుతాడు.

ఇక ఆ తరువాత జరగబోయే ఎపిసోడ్ లో లక్ష్మణ్ నిద్రమాత్రలు మింగుతున్న విజువల్స్ చూపించారు. ఇక ఎప్పుడు తెల్లవారుతుందా అని సీతా, రఘురాం ఇద్దరు వేచి చూస్తున్నట్లు కూడా చూపించారు. దీనికి సంబంధించి తరువాయి భాగంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X