Vadinamma Serial May 24th Episode: రఘురామ్ ఫ్యామిలీకి ఊచించని షాక్.. సొంత తమ్ముడే అలా.. సిరి తల్లి వార్నింగ్!
కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో దాదాపు అందరూ సీరియల్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఇక తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో టాప్ ఫైవ్ లో ఒకటిగా తీసుకుపోతున్న వదినమ్మ సీరియల్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ ఆసక్తికరంగా రోజుకు ఒక ట్విస్టుతో సాగుతోంది. ఈ కుటుంబానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటే వాటిని ఎలా ఎదుర్కొంటూ వస్తున్నారు అనేది కూడా ఆసక్తికరంగా చూపిస్తున్నారు మేకర్.

ఇంకా తీరని 20కోట్ల అప్పు
అయితే ఈ కుటుంబానికి తాజాగా పెద్ద కష్టమే వచ్చి పడిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబంలో ఒకడైన లక్ష్మణ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ప్రాజెక్ట్ కుప్పకూలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. విడుదల చేయాలంటే నాలుగు రోజుల్లో 20 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించాలని పోలీసులు పేర్కొంటారు. ఆ అమౌంట్ చెల్లించడానికి ఒప్పుకుని రఘురాం, సీతలు లక్ష్మణ్ ని విడిపించుకుని తీసుకువస్తారు.

ప్రాణాపాయం నుంచి బయటకు
అయితే తన వల్ల కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతున్న కారణంగా లక్ష్మణ్ సూసైడ్ చేసుకుని చనిపోవాలని భావిస్తాడు. కానీ లక్ష్మణ్ సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత భార్య శైలుకి విషయం తెలియడంతో అతనిని హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకు వెళ్తారు. దీంతో అతనికి ప్రాణపాయం తప్పుతుంది. అయితే అప్పుల నుంచి బయట పడాలంటే ఇల్లు, ఆస్తులతో పాటు ఉమ్మడి ఆస్తి అయిన పొలం కూడా అమ్మాలని రఘురాం భావిస్తాడు.

ఒప్పుకున్న లక్ష్మణ్
దానికి మిగతా కుటుంబ సభ్యులు అందరూ అంగీకరించినా ముందు లక్ష్మణ్ మాత్రం అంగీకరించడు. నేటి ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా తాను సంతకం పెట్టను అని లక్ష్మణ్ భీష్మించుకుని కూర్చుంటాడు. సీత సహా సిరి, భరత్, రఘురామ్ ఇలా అందరూ లక్ష్మణ్ కి నచ్చజెప్పి సంతకాలు చేయిస్తారు.

సిరి తల్లి ఎంట్రీ
ఇంతలో సిరి తల్లి రఘురామ్ ఇంటికి చేరుకుంటుంది. తన అల్లుడి ఆస్తిని ఎలా అమ్ముతారని ఆమె ప్రశ్నిస్తుంది. ఇంతలో భారత్ కల్పించుకుని తన భార్య వద్దకు వెళ్లి నీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పు లేదా మీ అమ్మను సైలెంట్ గా ఉండమని చెప్పమని కోరతాడు. సిరి అలా తన తల్లికి సర్ది చెప్పబోతే నీకు ఏమీ తెలియదని, నువ్వు తర్వాత బాధ పడతావు అని తను ఇంత దూరం వచ్చానని ఆమె చెబుతుంది..

తల్లికి షాకిచ్చిన సిరి
ఇక నువ్వు చచ్చిపోయావు అని తనతో అంటే అప్పుడు వెళ్ళిపోతానని సిరి తల్లి చెబుతుంది. కానీ అలా అనలేని సిరి తన తల్లి అంటున్న మాటలకు బాధపడుతుంది. దీంతో సిరి తల్లి రెచ్చిపోయి అందరి మీద కామెంట్స్ చేయడంతో సిరి ఇక నువ్వు ఆపకపోతే నువ్వు అడిగిన మాట అనాల్సి వస్తుంది దయచేసి ఆపేయమని కోరుతుంది. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

అందరికీ షాక్ ఇచ్చిన నాని
ఇక తదుపరి ఎపిసోడ్లో నాని ఇంటికి రావడం ఆస్తి సంతకాల పేపర్ల మీద సంతకాలు పెట్టిన తర్వాత ఉమ్మడి పొలం తాకట్టు పెట్టడానికి వీలు లేదని అంటూ షాక్ ఇస్తాడు. ఆ పొలం అనేది అమ్మితే తన పరిస్థితి ఏమిటి ? అని ప్రశ్నిస్తాడు. తాము అందరం ఉన్నాము కదా అంటే చిల్లిగవ్వ లేకపోతే మీరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టుగా నాని మాట్లాడుతున్నట్టు చూపించారు. అలా కుటుంబం మొత్తానికి షాక్ తగిలింది. దానిమీద క్లారిటీ రావాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..


Click it and Unblock the Notifications











