Vadinamma Serial May 26th Episode: రఘురామ్ ఫ్యామిలీలో ముసలం.. కొట్టుకోబోయిన అన్నదమ్ములు.. షాకిచ్చిన శైలు!

తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో టాప్ 5 లో ఒకటిగా నిలిచింది వదినమ్మ సీరియల్. టెలివిజన్ మెగాస్టార్ ప్రభాకర్ అలాగే సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ స్టార్ మాటీవీలో ప్రసారం అవుతోంది. మహేశ్వరి, రాజేష్, ప్రియాంక నాయుడు, రాజేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కుటుంబానికి పెద్దగా రఘు రామ్ పాత్రలో ప్రభాకర్ నటిస్తూ ఉండగా ఆయన భార్య సీత పాత్రలో సుజిత నటిస్తోంది.

చావు అంచుల దాకా వెళ్లి

చావు అంచుల దాకా వెళ్లి

ఈ కుటుంబానికి ఒక పెద్ద కష్టం వచ్చి పడిన సంగతి అందరికీ తెలిసిందే. లక్ష్మణ్ పనిచేస్తున్న కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ ఒకటి కూలిపోవడంతో దానికి బాధ్యుడిగా లక్ష్మణ్ నిలబడతాడు. అరెస్ట్ కూడా అవడంతో విడిపించుకోడానికి గాను ఇరవై కోట్లు కడతామని ఒప్పుకుంటారు కుటుంబ సభ్యులు. ఈ టెన్షన్ భరించలేక లక్ష్మణ్ సూసైడ్ కూడా చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ కుటుంబ సభ్యులు మళ్లీ బ్రతికించుకుంటారు.

ఒప్పుకున్న లక్ష్మణ్

ఒప్పుకున్న లక్ష్మణ్

20 కోట్లు కట్టాలి అంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లు సహా అన్ని ఆస్తులు అమ్మి ఉమ్మడి పొలాన్ని తాకట్టు పెట్టాలని కుటుంబం అంతా నిర్ణయించుకుంటుంది. భరత్ ఒప్పుకుంటాడు కానీ లక్ష్మణ్ మాత్రం సంతకం పెట్టడానికి ఇష్టపడడు. కానీ అందరూ సర్దిచెప్పి ఇది తప్ప మరో దారి లేదని చెప్పడంతో లక్ష్మణ్ ఒప్పుకోక తప్పదు.

ఎదురు తిరిగిన నాని

ఎదురు తిరిగిన నాని

ఇక అప్పుడే ఇంటికి వచ్చిన నాని మిగతా అన్ని పత్రాల మీద సంతకాలు పెడతాడు. కానీ ఉమ్మడి పొలం తాకట్టు పెట్టడానికి మాత్రం ఒప్పుకోడు. తాను ఆ కాయితాల మీద సంతకాలు పెట్టను అని తేల్చి చెబుతాడు. దీంతో ముందు అందరూ షాక్ అయినా సరే రఘు మాత్రం తమ్ముడికి ఇష్టం లేనిదే సంతకాలు పెట్టవద్దని చెప్పేస్తాడు. ఈ విషయం మీద కాస్త గందరగోళం నెలకొంటుంది.

అన్నదమ్ముల మధ్య ముసలం

అన్నదమ్ముల మధ్య ముసలం

ఈ సమస్యను ఎలా అధిగమించాలో తాను ఆలోచిస్తానని రఘురాం అందరికీ చెప్పి పంపిస్తాడు.. తర్వాత భారత్ వెళ్లి నానిని సంతకం పెట్టాల్సిందిగా బలవంత పెడతాడు. మాటా మాటా పెరిగి భరత్ నాని మీద చెయ్యి చేసుకోబోతే అప్పుడే అక్కడికి వచ్చిన రఘురాం వారిస్తాడు. పెద్ద వాడు కావడంతో భారత్ ని మందలించి ఇంకోసారి ఇలాంటివి జరిగితే తాను చెయ్యి చేసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు.

బాధలో భరత్

బాధలో భరత్

అన్నయ్య అన్న మాటలకు బాధ పడిన భరత్ తాను చదువు లేని వాడిని, పొట్లాలు కట్టుకునే వాడిని కాబట్టి అన్న ఇలా మాట్లాడని అమ్మ దగ్గర, వదినమ్మ దగ్గర బాధపడతాడు. తాను కూడా చదువుకుని ఉంటే అన్న ఇలా మాట్లాడి ఉండకపోయి ఉండవచ్చని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. సిరి కూడా భర్తను అలా అన్నందుకు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆ తరువాత ఒక్కడే కూర్చుని బాధ పడుతున్న నానీ వద్దకు సీత అన్నం తీసుకెళ్లి తినిపిస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
షాకిచ్చిన శైలు

షాకిచ్చిన శైలు

తాను అలా అడ్డం తిరగడం కరెక్టా కాదా అని అడగగా కరెక్ట్ కాదు అంటే అన్నం తినడేమో అన్న ఉద్దేశంతో సీత నీ ఉద్దేశం నువ్వు చెప్పావు ఏమి తప్పు కాదని చెబుతుంది. ఇదంతా చాటు నుంచి చూసిన శైలు పొలం తాకట్టు పెట్టడం సీతక్కకి కూడా ఇష్టం లేదేమో అని పొరపాటు పడుతుంది.. దీంతో తనకు సహాయం చేసేది కేవలం తండ్రి మాత్రమేనని భావించి తండ్రి వద్దకు వెళ్లి సహాయపడుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.. తర్వాత ఎపిసోడ్ లో తన తండ్రి సహాయం చేస్తానన్నాడు అని అందరికీ చెబితే వారంతా షాక్ అవుతారు. ఇక తరువాతి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X