Vadinamma Serial May 27th Episode: ఫామిలీ మొత్తానికి శైలు షాక్.. వచ్చే జన్మలో ఇలా వద్దంటూ రఘురామ్ ఎమోషనల్ !
తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో టాప్ 5 లో ఒకటిగా నిలిచింది వదినమ్మ సీరియల్. సెకండ్ వేవ్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిపోయిన
అందరూ ఇప్పుడు సినిమాలతో పాటు సీరియల్స్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే తెలుగు టీవీ సీరియల్ కి సైతం విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. వదినమ్మ సీరియల్ రోజుకు ఒక ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతోంది.. టెలివిజన్ మెగాస్టార్ ప్రభాకర్ సుజిత మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.

పెను గందరగోళం
రఘురాం తమ్ముడు లక్ష్మణ్ నిర్మిస్తున్న ఒక అపార్ట్మెంట్ కూలిపోవడంతో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆ కుటుంబం అంతా కలిసి 20 కోట్లు కడతామని ఒప్పుకుంటారు. అయితే ఇప్పుడు 20 కోట్ల విషయంలో పెను గందరగోళం ఏర్పడింది. తమకు ఉన్న ఆస్తులు కొన్నింటిని అమ్మి, మరి కొన్నింటిని తాకట్టుపెట్టి తీర్చాలని ముందు రఘురాం భావిస్తాడు.

బాధలో రఘురాం
అయితే మిగతా తమ్ముళ్ళు అందరూ తాను చెప్పినట్లు విన్నా చివరి తమ్ముడు నాని మాత్రం ఉమ్మడి పొలాన్ని తాకట్టు పెట్టడానికి తాను ఒప్పుకోనని అడ్డం తిరుగుతాడు. అయితే పైకి మాత్రం తమ్ముడు మాట కాదనకుండా పొలం తాకట్టు పెట్టవద్దని తేల్చేసిన రఘురాం లోలోపల మాత్రం తమ్ముడు తన మాట వినలేదని బాధపడుతూ ఉంటాడు.

ఇంటికి శైలు
ఇక ఎలా అయినా డబ్బు కట్టకపోతే లక్ష్మణ్ అరెస్ట్ అవుతాడు అని భావించిన శైలు గొడవ పడ్డ తండ్రి వద్దకు వెళ్ళి డబ్బు అడగాలని భావిస్తుంది. ఎంత కాదనుకున్నా తండ్రి కదా అడిగిన వెంటనే డబ్బులు ఇస్తాడు అని భావించి తండ్రి వద్దకు ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది. అయితే ఇంటికి వెళితే తండ్రి లోపలికి రమ్మని కూడా అడగడు. తల్లి బయటకు వచ్చి శైలుని లోపలికి తీసుకు వెళుతుంది.

రాజేంద్ర కండిషన్
అయితే ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఒక ఐదు కోట్లు డబ్బులు కావాల్సి వస్తాయని అప్పుగా ఇస్తే త్వరగా తీర్చే చేస్తామని శైలు నాన్నని అడుగుతుంది. అప్పు ఇవ్వడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్న రాజేంద్ర కాకపోతే రఘురాం సహా నలుగురు సోదరులు వచ్చి తనను అడిగితేనే డబ్బులు ఇస్తాను అని చెబుతాడు. అందుకు సరేనని ఒప్పుకున్న శైలు ఇంటికి తిరిగి వస్తుంది.

షాకిచ్చిన శైలు
అయితే ముందు తన తండ్రి డబ్బులు ఇస్తానన్నాడు అని చెబితే ఒప్పుకోరని తెలిసి రఘురాం, సీత, భరత్, సిరి అందరి ముందు ఒక వేరే వ్యక్తి డబ్బులు ఇస్తానని అన్నట్లుగా చెబుతుంది. వాళ్లంతా సంతోషపడి ఎవరా వ్యక్తి ?అని అడుగగా తన తండ్రి అని చెబుతోంది. దీంతో రఘురాం వెళ్ళిపోబోతాడు. ఎందుకలా వెళుతున్నారని అడిగితే గాడిద కాళ్ళు అయినా పట్టుకుంటా కానీ మీ నాన్న దగ్గర డబ్బు తీసుకోనని తేల్చిచెబుతాడు. అంతేకాక ఈ విషయం తెలిసి కూడా వెళ్ళినందుకు ఫైర్ అవుతాడు. ఇక తరువాతి ఎపిసోడ్ లో అప్పు దొరకలేదని లక్ష్మణ్ కి తేల్చి చెప్పేస్తాడు రఘురామ్,వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి అన్నకి తమ్ముడుగా పుట్టవద్దని ఎమోషనల్ అవుతాడు.


Click it and Unblock the Notifications











