Vadinamma Serial May 28th Episode: హ్యాండిచ్చిన తమ్ముళ్ళు, జైలుకు రఘురామ్.. ఎవరూ ఊచించని ట్విస్ట్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ ఫైవ్ లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ రోజుకు ఒక ట్విస్ట్ తో ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజేష్, ప్రియాంక, మహేశ్వరి, రాజేంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్ అన్ని ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే

లక్ష్మణ్ కోసం అప్పు

లక్ష్మణ్ కోసం అప్పు

లక్ష్మణ్ కోసం రఘురాం కుటుంబం 20 కోట్లు కట్టడానికి ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ డబ్బు కట్టడానికి ఇప్పుడు కుటుంబం అంతా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ముందు నుంచి కుటుంబం మొత్తం ఒకలా భావిస్తే నాని ఒక్కడే ఒకలా భావిస్తాడు. తాను పొలం తాకట్టు పెట్టేందుకు ఒప్పుకోనని అడ్డం తిరగడంతో మళ్ళీ కథ మొదటికి వస్తుంది.

అన్నాతమ్ముళ్ళ గొడవలు

అన్నాతమ్ముళ్ళ గొడవలు

నాని ఒప్పుకోకపోవడంతో భరత్ నాని దగ్గరికి వెళ్లి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఒప్పుకోకపోవడంతో పాటు అనుచితంగా మాట్లాడితే దండించబోయిన భరత్ ను రఘురాం వచ్చి తిట్టి పంపిస్తాడు. ఇక ఆ తర్వాత డబ్బులు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. బావ ఎలా అయినా డబ్బులు తీసుకు రాలేడు అని భావించిన శైలు తన తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతుంది.

తండ్రిని ఒప్పించిన శైలు

తండ్రిని ఒప్పించిన శైలు

తండ్రి, కూతురు నేరుగా మాట్లాడుకోకపోయినా, మధ్యలో అమ్మ మధ్యవర్తిగా ఉండి మాట్లాడిస్తుంది. అయితే తాను అప్పు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అప్పు తీర్చే నలుగురు అన్నదమ్ములు తనకు వద్దకు వచ్చి అడిగినప్పుడే ఇస్తానని రాజేంద్ర కండిషన్ పెడతాడు. ఈ విషయం శైలు తీసుకెళ్లి బావ సమక్షంలో కుటుంబం మొత్తానికి వివరిస్తుంది. అయితే గాడిద కాళ్ళు అయినా పట్టుకుంటాను కానీ మీ నాన్న దగ్గర అప్పుడు మాత్రం అడగమని రఘురాం తేల్చి చెబుతాడు.

చేతులెత్తేసిన రఘురామ్

చేతులెత్తేసిన రఘురామ్

అయితే రఘురామ్ కి ఇంకా ఎక్కడా అప్పు పుట్టదు, దీంతో మరింత గడువు పెంచమని డబ్బు కట్టాల్సిన వారి దగ్గరికి వెళ్లి అడిగే ప్రయత్నం చేస్తాడు. అయితే గడువు పెంచే ఆస్కారం లేదని గడువు దాటితే తమ చేతుల్లో కూడా ఏమీ ఉండదని మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి తేల్చి చెబుతాడు. ఇంటికి వచ్చి సీతతో మాట్లాడుతూ అవసరం అయితే నేనుజైలుకు వెళతానని రఘురామ్ చెబుతాడు. ఇక ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన రఘురాం తనను క్షమించమని తమ్ముడిని కోరుతాడు. ఇలాంటి అసమర్ధుడు అయినా అన్నకి తమ్ముడిగా పుట్టవద్దని కోరతారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
అన్నకి షాకిచ్చిన తమ్ముళ్ళు

అన్నకి షాకిచ్చిన తమ్ముళ్ళు

అయితే ఇప్పుడు ఏం చేయాలని శైలు అడగగా ఇంకేం చేస్తామని సీత సమాధానం ఇస్తుంది. అంటే లక్ష్మణ్ జైలుకు వెళ్ళిన మీకు పర్వాలేదా అంటూ శైలు అందరినీ ప్రశ్నిస్తుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిస్తుంది ఇక తర్వాత జరగబోయే ఎపిసోడ్ విషయానికి వస్తే రఘురాం శైలు తండ్రి డిమాండ్ కి తలొగ్గుతాడు.

ఇద్దరం కలిసి వెళ్లి మీ నాన్నను అడుగుదామని కోరతాడు. కానీ శైలు నలుగురూ వస్తే కానీ నాన్న డబ్బులు ఇవ్వనన్నాడనే విషయం చెబుతుంది. అయితే తమ్ముళ్లు మరోసారి ఎదురు తిరిగినట్లు రాబోయే ఎపిసోడ్ గురించి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X