Vadinamma Serial May 29th Episode: కొట్టుకున్న అన్నాదమ్ములు, చెంపలు వాయించుకున్న రఘురామ్

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వదినమ్మ సీరియల్ ఈరోజు 555 ఎపిసోడ్ కి చేరింది. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ట్విస్టులతో సాగుతున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

రజని భరద్వాజ్: చీర వేసినా జీన్స్ వేసినా.. హాట్ గా ఉండాల్సిందే

కాస్త ఊరట

కాస్త ఊరట

లక్ష్మణ్ బిల్డింగ్ నిమిత్తం 20 కోట్లు కట్టేందుకు గాను గడువు దగ్గరపడుతోంది.. కానీ రఘురామ్ కి ఐదు కోట్లు అప్పు పుట్టదు. ఏం చేయాలో అని ఆలోచిస్తున్న రఘురామ్ కూర్చుంటే గతంలో తమ కుటుంబంలో జరిగిన శుభకార్యాలన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇప్పుడు అందరూ అప్పుడు టెన్షన్ లో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటుంటుంటే, ఇక ఇవే చివరి శుభకార్యాలుగా మిగిలి పోతాయేమో అన్నట్లుగా ఆయన బాధపడుతూ ఉంటాడు.

 బాధలో భరత్

బాధలో భరత్

ఇంతలో మధ్యవర్తి నుంచి ఫోన్ వస్తుంది. అతను రఘురాంని డబ్బు ఎప్పటిలోగా కడతావు అని ప్రశ్నిస్తారు, దానికి రఘురాం 15 కోట్లు ఇప్పటికిప్పుడే తెచ్చి ఇస్తామని మరో అయిదు కోట్లు దొరకడం లేదని చెబుతారు. అయితే రఘురామ్ కాస్త బతిమిలాడినా తర్వాత మరో రెండు రోజులు గడువు పెంచుతానని మధ్యవర్తి చెబుతాడు. ఇక భరత్ కూడా షాప్ కి వెళ్లకుండా తన కుటుంబానికి వచ్చిన కష్టం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సిరి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది.

 జాలీగా నాని

జాలీగా నాని

ఆ సమయంలో నాని అప్పుడే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చాలా జాలీగా మాట్లాడుతూ ఉంటాడు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను వచ్చాక పార్టీ చేసుకుందాం అని చెబుతూ పకపకా నవ్వుతూ మాట్లాడుతుంటే అది చూసిన భరత్ కి ఎక్కడ లేని కోపం వస్తుంది. వెంటనే కోపంగా వచ్చి ఫోన్ లాక్కుని కట్ చేసి, తమ్ముడు మీద ఫైర్ అవుతాడు. మళ్లీ అప్పు కోసం కాగితాల మీద సంతకాలు పెట్టే వ్యవహారం గుర్తు చేసి నీవల్ల ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నామని నానిని భరత్ మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు.

కొట్టుకున్న బ్రదర్స్

కొట్టుకున్న బ్రదర్స్

అయితే చదువురాని వాడివి నువ్వే నాకు చెప్పేది అని నాని భరత్ ని ఘోరంగా అవమానిస్తాడు. మాటామాటా పెరగడంతో ఇద్దరూ కొట్టుకునే దాకా వెళతారు. నాని చెంప కూడా భరత్ పగలగొడతాడు. దీంతో అక్కడికి వచ్చిన లక్ష్మణ్ వారిని ఆపడానికి ప్రయత్నిస్తే ఇద్దరూ కలిసి ఆయన కింద పడేస్తారు. దీంతో పైకి లేచిన లక్ష్మణ్ భరత్ మీద చెయ్యి లేపుతాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన రఘురాం దీనికోసమేనా నేను కష్టపడింది. ఎలాంటి ఉండేవాళ్ళం ఎలా అయిపోయామని ప్రశ్నిస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 తరువాతి ఎపిసోడ్ లో

తరువాతి ఎపిసోడ్ లో

ఇంతలో అక్కడికి వచ్చిన తల్లిని చూపించి చూసావా అమ్మ నా తమ్ముళ్ళను ఇలా పెంచడం నాదే తప్పు అంటూ చెంపలు వాయించుకుంటాడు. ఇది జరుగుతుండగా అక్కడికి వచ్చిన శైలు, మీరు వారి మధ్య జరుగుతున్న గొడవ ఆపారు గానీ అసలు గొడవకి కారణం క్లియర్ చేయడం లేదని చెబుతుంది.. మీకు ఎక్కడ పుట్టక పోవడం వల్ల ఈ గొడవ జరుగుతుంది కాబట్టి, అప్పు తీర్చే మార్గం చూడాలి అని తన తండ్రి వద్దకు వెళ్లాలని సూచిస్తుంది. ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్ లో రఘురాం శైలు తండ్రి దగ్గరకు వెళ్లడానికి ఒప్పుకుంటాడు. కానీ తమ్ముళ్లు అందరూ కలిసి వెళ్ళడానికి ఒప్పుకోకపోవడంతో రాబోయే ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X