Vadinamma: రఘురామ్ కి ఊహించని షాకులు ఇచ్చిన లక్ష్మణ్.. అనాథాశ్రమం అంటూ చెప్పడంతో!
రఘు రామ్- సీతల పెళ్లి రోజు తర్వాత రఘురాంకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. అయితే సీత రిషి గురించి నిజం చెప్పడంతో ఆయన కోలుకుంటాడు కానీ సీత మీద అసహ్యం పెంచుకుంటాడు, కోలుకుని ఇంటికి వచ్చిన రఘురాం ఎక్కువగా తన కొడుకు రిషితోనే సమయం గడుపుతూ ఉంటాడు. ఒకానొక రోజు రిషిని తీసుకుని షాప్ కు బయలుదేరి వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేస్తుంది. తరువాతి రోజు కూడా అదే పరిస్థితి ఎదురు కాగా బాబును పైకి తీసుకు వెళ్లి సముదాయిచబోతుంది.
అంతలో బాబు మెట్ల మీద నుంచి పడిపోగానే తీవ్ర గాయాలు అవుతాయి. దీంతో వాళ్ళు హాస్పిటల్ కి వెళితే అక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. బాబు కోలుకొని బయటకు వచ్చినా జనార్దన్ ఎంట్రీతో కుటుంబంలో మరిన్ని సమస్యలు మొదలయ్యాయి. అలా గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాబు కోసమే
వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏమేమి జరిగాయి అనే విషయం తెలుసుకుందాం. ఈ రోజు 11 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 697 హైలైట్స్ విషయానికి వస్తే లక్కీ మనం మా అమ్మ వాళ్లింటికి వెళ్లిపోదాం ఇక్కడ వద్దు.. ఇక్కడ ఉండొద్దు అంటున్న శైలూని లక్ష్మణ్ బుజ్జగిస్తాడు. రఘురామ్ అన్నయ్యను నిన్న నిలదీసి నేను పెద్ద తప్పు చేశాను.
వద్దు.. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోవద్దు. ఏం కాదు.. కలిసి ఉందాం.. అంటాడు లక్ష్మణ్. ఉదయాన్నే రఘురామ్.. లక్ష్మణ్ అని పిలుస్తాడు. దీంతో శైలూ షాక్ అవుతుంది. బావ గారు.. బాబు కోసమే పిలుస్తున్నారు అంటుంది. కాదులే.. వేరే పని అయి ఉంటుంది అని అంటాడు లక్ష్మణ్. అయితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమని చెబుతుంది ఆమె.

రఘురామ్ బాధతో
ఇక మరోవైపు లక్ష్మణ్.. లక్ష్మణ్ అని పిలిచినా పలక పోయేసరికి.. ఏం చేస్తున్నావురా పలకవేంటి. రిషి ఎక్కడ ఒకసారి వాడిని తీసుకురా ఆడుకుంటాను అంటాడు రఘురామ్. దీంతో లక్ష్మణ్ షాక్ అవుతాడు, రిషి లేవలేదు అన్నయ్య. పడుకున్నాడు అంటాడు. రిషి లేవగానే తీసుకొచ్చి నేనే ఇస్తాను అన్నయ్య అంటాడు లక్కీ. ఇంతలో రిషి ఆడుతున్న సౌండ్ వినిపిస్తుంది. దీంతో రఘురామ్ పైకి వస్తాడు.
రిషిని చూసి ఖుషీ అవుతాడు కానీ రిషి దగ్గరికి వెళ్లబోయేసరికి.. ఛీ..ఛీ..ఛీ.. సిగ్గు లేదరా నీకు.. పాంట్ లో పోసేసుకున్నావు. పదా.. నీకు స్నానం చేయిస్తాను అని శైలూ అంటుంది. దీంతో రఘురామ్ బాధతో కిందికి వెళ్లిపోతాడు. లక్కీ తన గదికి వెళ్లి బాధపడతాడు.

మొదటిసారి అన్నయ్యకు అబద్ధం
మొదటిసారి అన్నయ్యకు అబద్ధం చెప్పాను.. అని శైలూతో అంటాడు లక్కీ. అన్నయ్య ముఖం ఎలా చూడాలి అని శైలూతో అంటాడు. నువ్వు అబద్ధం చెప్పలేదు.. చెప్పేలా మీ అన్నయ్య చేశాడు అంటుంది శైలూ. రఘురామ్ కిందికి వచ్చి రాజేశ్వరి దగ్గర బాధ పడుతూ కూర్చుంటాడు. ఏమైందిరా పెద్దోడా అంటే.. నా ఇంట్లోనే నేను పరాయి వాడిని అయ్యాను అంటాడు రఘురామ్. ఎవడ్రా నిన్ను అలా చేసింది అని అడుగుతుంది రాజేశ్వరి.
రిషితో ఆడుకోవాలని నేను పైకి వెళ్లబోయాను. బాబును కొంతసేపు ఇవ్వు.. ఆడుకుంటా అని లక్కీతో అన్నా. దీంతో బాబు పడుకున్నాడని చెప్పాడు. నేను వెనుదిరిగే సమయానికి బాబు అరుపులు వినిపించాయి. పైకి వెళ్లి చూస్తే.. శైలూ బాబుతో ఆడుకుంటూ ఉంది. లక్కీ నాకు అబద్ధం చెప్పడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు రఘురామ్.

రఘురామ్ కళ్లు తెరిపించిన భాస్కర్
అయితే తల్లికి చెప్పి ఇంట్లో ఉండబుద్ధి గాక రఘురామ్ గుడికి వస్తాడు. అక్కడికి వచ్చిన భాస్కర్.. రఘురామ్ ను చూసి బావ ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు. కోపం నా మీదా లేక నా చెల్లెలు మీదా అని అడుగుతాడు. ఎవరి మీద కాదురా.. నా మీద, నా దురదృష్టం మీద.. అంటాడు రఘు. మరి.. సీతను ఎందుకు బాధపెడుతున్నావు? అని ప్రశ్నిస్తాడు భాస్కర్.
నేను ఎవరినీ బాధ పెట్టడం లేదు అని రఘురామ్ అంటాడు. సీత ఎంత బాధపడింది.. శైలూ కోసం ఎలా త్యాగం చేసిందో రఘురామ్ కి భాస్కర్ అర్థమయ్యేలా చెబుతాడు. నువ్వయితే శైలూను అలాగే వదిలేసి.. నీ బిడ్డతో సంబరాలు చేసుకునేవాడివా? సీత.. బిడ్డను త్యాగం చేసింది ఎవరికి.. పుట్టింటి వాళ్లకు కాదు కదా. నీ తమ్ముడికి కదా.. నీ ఇంటికి కదా అని అంటాడు భాస్కర్. మొత్తానికి రఘురామ్ కళ్లు తెరిపిస్తాడు భాస్కర్.

మరో షాకింగ్ అంశం
మరోవైపు లక్ష్మణ్ అన్నకు అబద్ధం చెప్పానన్న బాధలో బాధపడుతూ కూర్చుంటాడు. భరత్ చూసి ఏమైంది అన్నయ్య అని అడిగి ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు. రిషి పడిపోవడం గురించి ఆలోచిస్తున్నావా అంటే.. అన్నయ్యలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తున్నాను చెబుతూ ఇదివరకటిలా ఫ్రీగా మాట్లాడటం లేదు. తన లోకంలోనే ఉంటున్నాడు.
ఎంతసేపు రిషి ద్యాసలోనే ఉంటున్నాడు.. అని అంటాడు లక్కీ ఇక దానికి ఒక ఉపాయం వచ్చినట్టుగా హాపీ ఫీలవుతాడు. తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం అనాథ ఆశ్రమం నుంచి లక్కీ ఇద్దరు వ్యక్తులను ఇంటికి పిలుస్తారు. ఎవర్రా వాళ్ళు అని రఘురామ్ అడిగే సరికి.. అనాధ ఆశ్రమం నుంచి వచ్చారు. వాళ్ల దగ్గర అనాధ పిల్లలు ఉన్నారు. ఎవరో ఒకరిని దత్తత తీసుకోవడం పిలిచాను అన్నయ్య అని లక్కీ అనడంతో రఘురామ్ షాక్ అవుతాడు.


Click it and Unblock the Notifications











