Vadinamma: భరత్ చెంప పగలగొట్టిన లక్ష్మణ్.. పెద్ద రాద్దాంతం.. రఘురాంను కూడా?

వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. రఘురాం సీత పెళ్లి రోజు వేడుకల సందర్భంగా ఆనందంగా గడిపిన రఘురాం కి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ తరువాత హాస్పటల్ బెడ్ మీద ఉన్న రఘురాం కోలుకోవడం కష్టమే అని చెప్పడంతో సీత రఘురాం కు తనకు పుట్టిన బిడ్డ గురించి నిజం చెబుతుంది. అయితే సీతను ఈ విషయంలో అసహ్యించుకున్న రఘురాం తన బిడ్డ మీద మమకారం పెంచుకుంటాడు.. అయితే శైలు రఘురాం తీరుతో విసిగిపోయి బాబును పైకి తీసుకు వెళ్ళడంతో అతను అక్కడి నుంచి పడి గాయాలపాలైన అవుతాడు. ఈ గ్రామంలో రఘురాం తమ్ముడు లక్ష్మణ్ అనాధ పిల్లలను దత్తత తీసుకోవడానికి తీసుకువస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ పూర్తిగా లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్ 2021, సోమవారం 700 ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే

జనార్ధన్ వచ్చి

జనార్ధన్ వచ్చి


శైలు తండ్రి జనార్ధన్.. ధాన్యం కొనుగోలు చేస్తున్న రఘురామ్ దగ్గరికి వచ్చి.. నీకు బిడ్డలు లేరు కదా అని కొడుకా కొడుకా అంటూ నా మనవడి వెంట ఎందుకు పడుతున్నావు? అందుకే జాలిపడి అనాథను దత్తత తీసుకోవడానికి సెట్ చేస్తే వెనక్కి తిరిగి పంపించావట. ఇంతకీ నీ మనసులో ఏముంది. ఏమనుకుంటున్నావు చెప్పు అంటాడు జనార్థన్. నీ మరో తమ్ముడు కూతురు వైదేహి ఉన్నా, ఎందుకు నా మానవుడి వెంటే పడుతున్నావు? అసలు ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి అన్నట్లుగా ప్రశ్నిస్తాడు?

మా వాడు మంచోడు

మా వాడు మంచోడు

అంటే.. ఇది నీ ఐడియానా అని రఘురామ్ ప్రశ్నిస్తాడు. అవును.. లేకపోతే లక్ష్మణ్ కు అంత సీన్ ఎక్కడిది అంటాడు. ఇంట్లో భరత్ బిడ్డ కూడా ఉంది. మరి.. భరత్ బిడ్డను దగ్గరకు తీసుకోకుండా కేవలం రిషిని మాత్రమే ఎందుకు దగ్గరికి తీస్తున్నావు. అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని రఘురామ్ ను జనార్థన్ ప్రశ్నిస్తాడు. పిల్లలు కావాలంటే మరింత కష్ట పడు, లేదంటే నీ భార్య సీత పర్మిషన్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకో.. అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతాడు జనార్థన్. ఆయన ఏమన్నా కూడా రఘురామ్ ఏమనడు. భరత్ మాట్లాడబోతన్న సమయంలో జనార్ధన్ బావమరిది ఎంటర్ అయ్యి అనరాని మాటలు అంటాడు..ఒక పక్క భరత్ కోపం నషాళానికి ఎక్కుతుంది. అతను కోపంతో ఊగిపోతూ ఉంటాడు.

రఘురాం ఊరట

రఘురాం ఊరట

నా గురించి తెలిసి కూడా నా తమ్ముడు అనాథను ఎలా దత్తత తీసుకొమ్మన్నాడా అని ఇన్ని రోజులు ఆలోచించాను కానీ.. ఇప్పుడు అర్థం అయింది. ఇది వాడి ఉద్దేశం కాదు, ఇది నీ సలహా అని అర్థం అయింది. ఇప్పుడు నేను రిలాక్స్ అవుతానన్నట్టు మాట్లాడతాడు రఘురామ్. అంతేకాక వాడు మారిపోయాడు ఏమో అని భావిస్తూ బాధ పడ్డాను, కానీ అది నిజం కాదని తెలిసింది అని అంటాడు. అయితే అతను అలా మాట్లాడుతుంటే భరత్ కోపం ఆపుకోలేడు. అతని మీదకు వెళ్లబోతుంటే రఘురాం ఆపేసాడు. ఆపేయడం ఆ కోపం ఈ కోపం కలిపి వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. లక్ష్మణ్ అన్నయ్య అంటూ ఆవేశంతో పిలుస్తాడు. ఇంతలోనే రఘురామ్ కూడా ఇంటికి వస్తాడు.

రచ్చ చేసిన భరత్

రచ్చ చేసిన భరత్

ఒరేయ్ భరత్ ఏమైందిరా అని అంటుంది సీత. ఒరేయ్ వద్దురా అంటాడు రఘురామ్ కానీ.. భరత్ వినడు.. దీంతో లక్ష్మణ్ కిందికి వస్తాడు. ఎందుకురా అలా అరుస్తున్నావు అంటాడు లక్ష్మణ్. ఏంట్రా నువ్వు చేసిన పని. మన ఇంటి వ్యవహారాల్లో బయటి వ్యక్తి ఎందుకు ఎంటర్ అవ్వాలి అని అడుగుతాడు. వీడు ఇన్నాళ్లు వీళ్లు మామ గారిని చీకొట్టి.. ఇప్పుడు ఆయనే దేవుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మార్గదర్శకుడు కూడా అయ్యాడు. అనాథను మీకు దత్తతగా ఇప్పించమని ఆయనగారే నీ బిడ్డ లక్ష్మణ్ కు సలహా ఇచ్చారట.. అని అసలు నిజం చెబుతాడు భరత్.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
చెంప చెళ్లమనిపించి

చెంప చెళ్లమనిపించి

లక్ష్మణ్ కూడా ఎక్కడా తగ్గకుండా అవును విన్నాను అయితే ఏంటి అంటాడు. భరత్ అస్సలు ఆగడు అసలు నీది సంస్కారమేనా? అని ప్రశ్నిస్తాడు. దీంతో నా భార్యను కాపాడుకోవడం కోసం.. అన్నయ్య దృష్టిని రిషి నుంచి మళ్లించడం కోసం నేను ఈ పని చేశాను తప్పితే.. ఇందులో తప్పేముంది అంటాడు లక్ష్మణ్. అక్కడితో అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మొత్తం మీద వ్యవహరం నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. మరో పక్క ఉదయమే బాబుతో ఆడుకోవడానికి భరత్.. రిషిని రఘురామ్ కు ఇస్తాడు. శైలూ మళ్లీ బాబు కనిపించడం లేదని టెన్షన్ పడుతుంది. చూస్తే బాబు రఘురామ్ దగ్గర ఉండటంతో బాబును మళ్లీ ఎందుకు తీసుకున్నావంటూ ప్రశ్నిస్తాడు లక్ష్మణ్. భరత్ ఇచ్చాడని రఘురామ్ చెబుతాడు. దీంతో భరత్ చెంప చెళ్లుమనిపిస్తాడు లక్ష్మణ్. రఘురామ్ ను కొట్టలేక నాకన్నా పెద్ద అని వదిలేస్తున్నా అంటాడు. దీంతో తమ్ముడి మాటలకు రఘురాం షాక్ అవుతాడు. ఏం మాట్లాడాలో కూడా ఆయనకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X