Vadinamma : కుటుంబంలో ముసలం.. రఘురాంకి జనార్ధన్ ఛాలెంజ్

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. రఘురామ్ కి గుండె పోటు రావడంతో అప్పటివరకు దాచిన నిజాన్ని సీత చెప్పేస్తుంది. రిషి మన కొడుకే అనే విషయం చెప్పడంతో రఘురాం కోలుకుంటారు.. అయితే సీత తన విషయంలో చేసిన ద్రోహాన్ని మాత్రం మరచిపోలేడు. ఈ విషయం మీద కొన్నాళ్లపాటు సీత తో మాట్లాడ కుండా ఉన్న రఘు రామ్ తర్వాత భాస్కర్ సముదాయించడం తో సీత తప్పు చేయ లేదు అనే విషయం తెలుసుకుని మళ్లీ మామూలు అవుతాడు.

అయితే తాను చేస్తున్న పనులతో శైలు ఇబ్బంది పడుతోంది అనే విషయం తెలుసుకుని బాబుకు దూరంగా ఉండడానికి ఫిక్స్ అవుతాడు. కానీ రిషి గురించి నిజం తెలుసుకున్న భరత్ రఘురాం కొంపముంచే పని చేస్తాడు. ఈ వ్యవహారంతో అన్నదమ్ముల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. భరత్, లక్ష్మణ్ ఇద్దరూ తన్నుకునే అడుగుతారు.. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. మరి ఈరోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భరత్ దే అన్నట్టు

భరత్ దే అన్నట్టు

జరిగిన గొడవలో తప్పంతా భరత్ దే అన్నట్టు లక్ష్మణ్ సహా నాని, శిల్పా, శైలు తదితరులు మాట్లాడతారు. దీంతో వాడు ముందు కొట్టాడు అయినా సరే నాదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు, అసలు శైలు వదిన చెప్పింది చెప్పినట్లు కాకుండా లక్ష్మణ్ అన్నయ్య కనుక ఆలోచించి ఉంటే సమస్య వచ్చేది కాదు అని అంటాడు. అయితే అప్పటి కప్పుడు అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.. వెళ్లారన్న మాటే గాని ఒక్కరికి కూడా మనశ్శాంతి ఉండదు.

ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి బాధపడుతుంటారు. తమను టార్గెట్ చేయడంతో భరత్, సిరి దగ్గర తన బాధనంతా చెప్పుకొన్నాడు. లక్ష్మణ్ కి నిజం తెలిస్తే లక్ష్మణ్ కూడా ఇలా మాట్లాడడు అని, ఎంతసేపు భార్య గురించి ఆలోచిస్తున్నాడు కానీ అన్నయ్య గురించి ఆలోచించడం లేదని అంటాడు.

కూతురే సహాయపడుతుందని

కూతురే సహాయపడుతుందని

మరోపక్క లక్ష్మణ్, శైలు కూడా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు.. ఈ సమయంలోనే శైలు తన తండ్రి జనార్ధన్ కి ఫోన్ చేస్తుంది.. ఫోన్ చేసి నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అవమానించినా, నన్ను క్షమిస్తావని అంటే ఒక మాట అడుగుతాను అంటుంది. అసలు నీ మీద నాకు కోపం లేదు అని జనార్ధన్ విషయం ఏంటో చెప్పు ఉంటాడు.

అయితే కొన్నాళ్ల పాటు తాము పుట్టింటికి రావాలి అనుకుంటున్నాం అని ఆమె అంటుంది. తప్పకుండ రావచ్చు అని తాను ఎదురు చూస్తున్నాం అని అన్నాడు. సరే అల్లుడు గారిని కూడా తీసుకు వస్తున్నావా అంటే ఆయన ఫోన్ చేయమన్నాడు అనే విషయం చెబుతుంది.

కూతురే సహాయపడుతుందని

కూతురే సహాయపడుతుందని

దానికి సంతోషంగా ఒప్పుకున్న జనార్ధన్ రఘురాం పై చేయి సాధించడానికి తన కూతురే సహాయపడుతుందని ఆనందపడతాడు. అయితే జనార్ధన్ బావమరిది మాత్రం అప్పుడే ఆనంద పడిపోకు ఇంటికి వచ్చే వరకూ నమ్మకం లేదు అన్నట్లు మాట్లాడుతాడు. శుభం పలకరా అంటే పిచ్చి పిచ్చి సామెతలు అన్ని చెబుతున్నావ్ అంటూ బావ మరిది మీద జనార్ధన్ కొప్పడతాడు.

ఇక ఆ తర్వాత భార్యతో కలిసి అత్తారింటికి వెళ్తున్నా అనే విషయాన్ని రఘురాం సహా కుటుంబ సభ్యులందరికీ చెబుతాడు లక్ష్మణ్. దెబ్బకి అందరికీ మత్తులు వదిలి పోతాయి. ఇప్పటివరకు అత్తమామలు అంటే కోప్పడే లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి భార్యా బిడ్డను తీసుకుని ఎలా వెళ్తున్నాడు అని అందరూ షాక్ అవుతారు.

శైలుకి కోపం వచ్చి

శైలుకి కోపం వచ్చి

కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళితే మనశ్శాంతిగా ఉంటామని అందుకే అక్కడికి వెళ్తున్నాము అని చెబుతారు. ఎక్కడికైనా వెళ్ళండి కానీ అక్కడికి మాత్రం వద్దు అని కోరుతాడు. దీంతో శైలు కి కోపం వచ్చి మా పుట్టింటికి వెళితే మీకు ఏంటో నొప్పి అన్నట్టు మాట్లాడుతుంది.

వెంటనే భరత్ కలగజేసుకుని నిన్న మొన్నటి వరకు మీ పుట్టింటి గురించి ఏం మాటలు మాట్లాడారో మర్చిపోయారా ? వాళ్ళు చేసిన పనులు అన్నీ మర్చిపోయారా ? అని ప్రశ్నిస్తాడు.. అయితే ఆడపిల్లకి భర్త కంటే పుట్టిల్లు ముఖ్యమని ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్లే ముందు గుర్తుకు వస్తారు అని శైలు చెబుతుంది.

కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

మొత్తం మీద శైలు, లక్ష్మణ్, మనవడిని తీసుకువెళ్లడానికి జనార్ధన్ రఘురాం ఇంటికి వస్తాడు. రఘురామ్ కుటుంబ సభ్యులను అవమానపరిచి వాళ్ళ ఇంటికి తీసుకు వెళతాడు.. ఇంటికి తీసుకు వెళ్ళినప్పటి నుంచి బాబు తో ఆడుకుంటూ జనార్ధన్ హ్యాపీగా గడుపుతుంటాడు.. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు.. తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం అదే సమయంలో రిషి పుట్టినరోజు రావడంతో దానిని గ్రాండ్గా చేస్తాను అని జనార్ధన్ కూతురు అల్లుడు దగ్గర మాట తీసుకోవడం, దానికి రఘురాం సీతా తప్ప మిగతా వాళ్లందరినీ గెలిపించడానికి ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంటాడు..

వెళ్లాల్సిందే అని పట్టుపట్టి

వెళ్లాల్సిందే అని పట్టుపట్టి

అందులో భాగంగానే లక్ష్మణ్ భరత్ కి ఫోన్ చేసి పుట్టినరోజు వేడుకకు రావాలని ఆహ్వానించడమే కాక అన్నయ్య వదినలకు చెప్పవద్దు అని కోరుతాడు. కానీ జనార్ధన్ మాత్రం నేరుగా రఘురామ్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి దమ్ముంటే రమ్మని చాలెంజ్ చేస్తాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు వెళ్లాల్సిందే అని సీత పట్టుబడుతోంది. ఇదంతా చూస్తుంటే తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే ఎలా కనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X