Vadinamma: దొంగలా జనార్ధన్ ఇంట్లో దూరిన రఘురాం.. షాకిచ్చిన నాని, శిల్పలు!

రఘు రామ్ రిషిని తీసుకుని షాప్ కు వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాబుకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు కూడా తీసుకు వెళతారు. రఘురాం రిషి వెంట పడుతూ ఉండడంతో అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలి అని లక్ష్మణ్ అన్నయ్యకు నేరుగా చెప్పకుండా అనాధాశ్రమం అధికారులను ఇంటికి తీసుకువస్తాడు. అయితే పరిస్థితులు బాగోలేక పోవడంతో వాళ్ళని ఇంటి నుంచి వెళ్లిపోవాలని అంటారు. తరువాత తాను కొన్ని రోజుల పాటు బయటకు వెళ్లి రావాలి అని చెబుతూ లక్ష్మణ్ తన భార్య శైలు సహా తన కొడుకు ని తీసుకుని శైలు తల్లి గారి ఇంటికి వెళతాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

హాస్పిటాలిటీ చూసి

హాస్పిటాలిటీ చూసి

శైలు తల్లి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత రఘురామ్ మేము ఒక పక్క బాధపడుతూ ఉంటాడు జనార్ధన్ మాత్రం తన ఇంటికి తన అల్లుడు కూతురు వచ్చారు అని ఆనంద పడుతూ ఉంటాడు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎలా ట్రీట్ చేస్తాడో అలాగే, తన అల్లుడి ని కూడా ఆయన ట్రీట్ చేస్తాడు. అలా చేస్తున్న సమయంలో లక్ష్మణ్ కూడా తన మామగారి హాస్పిటాలిటీ చూసి చాలా ఆనందపడతారు. అయితే ఒక పక్క రఘురాం మాత్రం ఇదంతా చూసి బాధపడుతూ ఉంటాడు.

మర్చిపోలేక పోతున్నాను

మర్చిపోలేక పోతున్నాను

నేను బాబుని మర్చిపోలేక పోతున్నాను అని సీతతో రఘురాం చెబుతున్నాడు. అయితే వాళ్ళ అమ్మానాన్న బాబు ని తీసుకు వెళ్లడం మంచిది అని, ఇక్కడే ఉంటే నువ్వు ఇంకా బాబు గురించి తలచుకుని బాధ పడతావు అని అంటుంది. అలా ఆమె విషయం చెప్పి బాధ పడకుండా ఉండాల్సిందిగా కోరుతుంది. అయితే బాబు వెళ్లిపోయిన అప్పటి నుంచి రఘురాం మనిషి మనిషిగా ఉండడు.

ఛాదస్తం వచ్చినట్లు

ఛాదస్తం వచ్చినట్లు

షాప్ కి వెళ్ళాక కూడా కస్టమర్లు ఇచ్చిన వస్తువులను కట్టించడం మీద కూడా దృష్టి పెట్టలేక పోతాడు. దీంతో భారత్ కి అన్నయ్య పరిస్థితి అర్థమై అన్నయ్యను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. మరోపక్క జనార్ధన అల్లుడు మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.. మీ అన్నయ్య మంచివాడే కానీ అతనికి వయసు అయిపోయింది అందుకే ఇలా ఛాదస్తం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.

అన్యమనస్కంగా

అన్యమనస్కంగా

అసలు మిమ్మల్ని వేరు చేయడం నా ఉద్దేశ్యం కాదు కానీ నీ భార్య బిడ్డలు గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా అంటూ ఉంటారు. ఇంటికి వచ్చాక కూడా రఘురాం అన్యమనస్కంగా కనిపిస్తూ ఉంటాడు దీంతో సీత రఘురాం ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే నిద్ర పోయిన తర్వాత బాబు కి గాయాలు అయినట్లుగా రఘురామ్ కి పీడకల వస్తుంది. దీంతో రిస్క్ అని తెలిసినా సరే జనార్దన్ ఇంటికి వెళ్లి బాబు ని చూడాలని ఫిక్స్ అవుతాడు.

కమింగ్ అప్ ప్రకారం

కమింగ్ అప్ ప్రకారం

అలా దొంగలాగా రఘురాం జనార్దన్ ఇంటికి వెళ్లడం, అక్కడ బాబుని చూసి ఆనంద పడడం కూడా చూపించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం అదే సమయంలో రిషి పుట్టినరోజు రావడంతో దాన్ని గ్రాండ్గా చేస్తాను అని జనార్ధన్ కూతురు అల్లుడు దగ్గర మాట తీసుకోవడం, దానికి రఘురాం సీతా తప్ప మిగతా వాళ్లందరినీ గెలిపించడానికి ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంటాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
రమ్మని చాలెంజ్

రమ్మని చాలెంజ్


అందులో భాగంగానే లక్ష్మణ్ భరత్ కి ఫోన్ చేసి పుట్టినరోజు వేడుకకు రావాలని ఆహ్వానించడమే కాక అన్నయ్య వదినలకు చెప్పవద్దు అని కోరుతాడు. కానీ జనార్ధన్ మాత్రం నేరుగా రఘురామ్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి దమ్ముంటే రమ్మని చాలెంజ్ చేస్తాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు వెళ్లాల్సిందే అని సీత పట్టుబడుతోంది. ఇదంతా చూస్తుంటే తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే ఎలా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X