twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : జనార్ధన్ ఛాలెంజ్.. దిమ్మ తిరిగే స్కెచ్ వేసిన రఘురాం.. అలా ఫంక్షన్ లోకి ఎంట్రీ!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 707 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిన సంగతి తెలిసిందే. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు ని కాపాడడానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని అతనిని దొంగగా భావించి ఇంట్లో అందరూ చితకబాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు సైలు మాట్లాడుతుంది.

    దీంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ ఒక్కడే ఇంటికి వస్తాడు. శైలు రాను అన్న విషయాన్ని తన అన్నయ్యకు వదినకు వెల్లడిస్తాడు. ఈ విషయం మీద రఘురాం సహా మిగతా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. బాబు పుట్టినరోజు ఉంది కాబట్టి ఆ రోజు శైలు తీసుకు వస్తుంది అని లక్ష్మణ్ అంటాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    Photos Courtesy: Star MAA and Disney+Hotstar

    గ్రాండ్ పార్టీ

    గ్రాండ్ పార్టీ

    ఈరోజు ఎపిసోడ్ లో తన తండ్రి రిషి పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నట్లు శైలు భర్తకు చెబుతుంది. పెద్ద పెద్ద వాళ్లందరినీ పిలుస్తున్నారని మొదటి పుట్టిన రోజు కావడంతో చాలా గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేసినట్లు చెబుతుంది. అంతేకాక ఆ రోజు మీ ఇంటికి మనం వెళ్ళలేము అనే సంగతి కూడా వాళ్ళకు చెప్పమని అంటుంది.

    అయితే రఘురాం సీత రాకుండా ఉంటేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది అని వాళ్లు కనుక వస్తే తన దృష్టి మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది కానీ ఫంక్షన్ ని ఫంక్షన్ లాగా జరుపుకోలేము అని అంటుంది. దీంతో ముందు లక్ష్మణ్ బాధపడతాడు తన అన్న, వదిన లేకుండా తన కొడుకు పుట్టిన రోజు ఫంక్షన్ ఎలా చేయాలి అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జనార్ధన్ తన కుమార్తెను మందలించి లక్ష్మణ్ అన్న అయిన రఘురాం, వదిన సీత లేకుండా ఈ ఫంక్షన్ జరగదు అని అంటాడు.

    షాకిచ్చిన శైలు

    షాకిచ్చిన శైలు

    అలా కాసేపు తాను రఘు రామ్, సీత ఇద్దరు వస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నట్లు గా జనార్దన్ భ్రమ కల్పిస్తాడు. కానీ మొండిది అయిన శైలు తన తండ్రి మాట సహా భర్త మాట కూడా అస్సలు వినదు. వాళ్ళు వస్తే అసలు ఫంక్షన్ నే చేయవద్దు అంటూ మాట్లాడుతుంది. మరో పక్క రఘురామ్ తన కొడుకు వస్తాడు అన్న ఆనందంతో బయట నుంచుని ఎదురు చూస్తూ ఉంటాడు కాని ఎంత సేపటికీ రాక పోవడంతో సీత అక్కడికి వెళ్ళి కాఫీ ఇచ్చి ఎక్కడ దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఉంటారా.. మీరు ఇక్కడ ఎదురు చూసినంత మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు లోపలికి వెళదామా ఉంటుంది.

    అయితే రఘురాం మాత్రం అదేమీ లేదు అని అంటాడు. అయితే సీత మాత్రం నాకు అంతా అర్థం అయింది నీ కొడుకు కోసమే కదా అన్ని ఎదురు చూపులు ఉంటుంది ఆ తర్వాత వాడి కోసం బట్టలు కొందామని అంటుంది.

    భరత్ కు లక్ష్మణ్ ఫోన్

    భరత్ కు లక్ష్మణ్ ఫోన్

    ఇక ఈ లోపు రఘురాం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తరువాత భరత్ కు లక్ష్మణ్ నుంచి ఫోన్ వస్తుంది. భరత్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతుండగా తన మామగారు నా కొడుకు పుట్టిన రోజు అని చాలా గ్రాండ్ గా జరపడానికి అనుకుంటున్నారు అని కానీ దానికి అన్నయ్య వదిన రావడం వాళ్ళకు ఇష్టం లేదు అని అంటాడు.

    నిజానికి నేను ఎంతో బలవంతం చేశాను గానీ శైలు ఈ విషయంలో చాలా మొండి పట్టు పట్టింది అని చెబుతాడు. అయితే అన్నయ్య వదిన రాకపోతే మేము ఎలా వస్తాము అని అనుకున్నాం అని భారత్ అడిగితే అర్థం చేసుకోరా నన్ను ఒంటరి వాడిని చేయొద్దు కనీసం మీరైనా రండి అంటాడు. అయితే ఇదంతా విన్న రఘురాం కుప్పకూలిపోయాడు.

    రఘురామ్ ఛాలెంజ్

    రఘురామ్ ఛాలెంజ్

    తర్వాత రఘురాం సీత కూర్చుని ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. మరో గదిలో భారత్ కూడా దాదాపు అదే పరిస్థితి లో ఉంటారు. ఇదే సమయంలో జనార్ధన్ మంచి ఫోన్ రావడంతో తన పిలవడానికి ఏమో అని అనుకుంటాడు కానీ జనార్ధన్ ఫోన్ చేసి నా అల్లుడుతోనే అలా చెప్పించాను ఇక వాడు నేను చెప్పినట్లే వింటాడు మీ ఇద్దరు దయచేసి మా ఇంటికి రావడానికి ప్రయత్నించకండి ప్రయత్నిస్తే కాళ్లు విరగొడతా అన్నట్లు చెబుతాడు. అయితే రఘురాం తో జనార్ధన ఛాలెంజ్ చేయడం సీతకి నచ్చదు ఎలా అయినా వెళ్లి మన పిల్లవాడిని ఆశీర్వదించి రావాల్సింది అంటుంది.

     దిమ్మ తిరిగే షాక్

    దిమ్మ తిరిగే షాక్

    ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఇంట్లో వంట చేయడానికి వస్తాము అన్న వాళ్ళ హ్యాండ్ ఇవ్వడంతో అప్పుడే వచ్చిన భరత్ ఒక ఐడియా ఇస్తాడు. వంట వాళ్ళలాగా అన్నయ్యను వదినను రప్పించేలా చేస్తారు. వాళ్ళిద్దరూ ముసలి వేషం వేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు తర్వాత విషయం తెలిసి కుటుంబంతో షాక్ అవుతున్నట్టు చూపిస్తున్నారు.

    English summary
    Vadinamma Episode 707: influenced by Janardhan's tactics lakshman decides not to invite Raghuram and sitha to Rishi's birthday party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X