Vadinamma : జనార్ధన్ కు దిమ్మ తిరిగే షాక్.. వేషాలు మార్చి రెడీ.. కలిసొచ్చిన యాక్సిడెంట్!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 708 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిన సంగతి తెలిసిందే. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు ని కాపాడడానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘు రంను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితకబాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది. దీంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ ఒక్కడే ఇంటికి వస్తాడు.
తరువాత రిషి పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతాడు లక్ష్మణ్. దీంతో కుటుంబ సభ్యులు అందరూ బాధ పడతారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar

భరత్ ప్లాన్
ఎలా అయినా తన అన్న వదిన లను ఫంక్షన్ దగ్గరకు తీసుకు వెళ్లాలి, తీసుకువెళ్లి రిషితో తన తల్లిదండ్రులు ఆనందంగా గడిపే అవకాశం ఇవ్వాలి అని భరత్, సిరి ఆలోచిస్తుంటారు.. ఆ సమయంలోనే భరత్ కి ఒక ఊహించని ఆలోచన వస్తుంది. రఘురాం, సీత ఇద్దరికీ మారు వేషాలు వేసి లోపలికి తీసుకువెళ్లాలి అని భావిస్తారు. మరో పక్క ఎలా అయినా ఫంక్షన్ కి వెళ్ళాలి అని సీత రఘురాం ని బలవంతం చేస్తుంది. ఇదే సమయంలో భరత్ తన ఐడియా తీసుకువచ్చి తన అన్న, వదినలకు చెప్పి మిమ్మల్ని ఎలా అయినా లోపలికి తీసుకు వెళతాను అంటాడు.

బాధలో లక్ష్మణ్
ఇక మరోపక్క లక్ష్మణ్ ఒక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉన్న సమయంలో జనార్ధన్ ఆయనని చూసి కావాలనే ఈ ఫంక్షన్ క్యాన్సిల్ చేయించేద్దాం, అల్లుడు ఇలా బాధపడుతూ ఉంటే ఫంక్షన్ల చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో లక్ష్మణ్ అదేమీ కాదని వాళ్ళు రాకుండా ఉండటమే కరెక్ట్ అని అంటాడు. వాళ్లు వస్తే మళ్ళీ శైలు బాధపడుతుంది ఈ తలనొప్పి అంతా నేను భరించలేను అంటాడు. నాకు మాత్రం మిమ్మల్ని బాధ పెట్టాలని ఉంటుందా కానీ నా కూతురు నా మాటకూడా వినడం లేదు అని జనార్ధన్ అంటాడు.

ముసలి వాళ్ళ వేషం
ఇక అన్న మాట ప్రకారమే భరత్, సిరి, రఘురాం, సీత ఇద్దరికీ ముసలి వాళ్ళ లాగా గెటప్ చేయిస్తారు. మేకప్ మహిమతో పూర్తి స్థాయిలో వాళ్ళు ముసలివాళ్ళు ఏమో అని అనుమానం కలిగే విధంగా మారిపోతారు. అయితే వేషం అయితే వేసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళాక ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయి ఏమో అనే భయం మాత్రం వాళ్ళల్లో అలాగే ఉంటుంది. ఇదే విషయం మీద రఘురాం సీతను సంప్రదించగా ఏదైతే అదే జరిగింది మనం అయితే వెళ్లి తీరాల్సిందే అని భీష్మించుకుని కూర్చుంటుంది. మొత్తం మీద వాళ్ళు అయితే వెళ్లడానికి ఫిక్స్ అవుతారు.

వంట వాళ్ళ టెన్షన్
మరోపక్క జనార్ధన్ బావమరిది వంట వాళ్ల విషయంలో టెన్షన్ పడుతూ ఉంటాడు. తాను మాట్లాడుకున్న వంట వాళ్లకు యాక్సిడెంట్ కావడంతో వాళ్ళు వంట చేయడానికి రాలేము అని చెబుతారు. వంట చేయడానికి రాలేము అని చెబితే బావ తనను ఎక్కడ ఇబ్బంది పెడతాడు అని భయం తో అతనికి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంతలో అతని బావ రావడంతో పూర్తిగా విషయమంతా వివరించి చెబుతాడు. అయితే ఈ విషయాలు ఏమీ పట్టని బావ నాకు అనవసరం మధ్యాహ్నానికి వంట వాళ్ళు వచ్చి వంట వండి పని మొదలు పెట్టక పోతే నీ అంత చూస్తాను అంటాడు.
Recommended Video

కమింగ్ అప్ లో
అలా ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఇంట్లో వంట చేయడానికి వస్తాము అన్న వాళ్ళ హ్యాండ్ ఇవ్వడంతో అప్పుడే వచ్చిన భరత్ ఒక ఐడియా ఇస్తాడు. వంట వాళ్ళలాగా అన్నయ్యను వదినను రప్పించేలా చేస్తారు. వాళ్ళిద్దరూ ముసలి వేషం వేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు తర్వాత విషయం తెలిసి కుటుంబంతో షాక్ అవుతున్నట్టు చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











