Vadinamma : కొంప ముంచిన పార్వతి.. భరత్ ను ట్రాప్ చేసి జనార్ధన్ కి నిజాలు వెల్లడి?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 709 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళ్లిన సంగతి తెలిసిందే. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు ని కాపాడటానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘురామ్ ను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితకబాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతాడు లక్ష్మణ్. ఎలా అయినా అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

దుర్గ, పార్వతి ఎంట్రీ

దుర్గ, పార్వతి ఎంట్రీ

ఫంక్షన్ కు రఘురాం, సీత సహా మిగతా అందరినీ అన్ని పిలుస్తారు రా జనార్ధన్ వాళ్ల కుటుంబ సభ్యులు.. రఘురాం సీత తప్ప మిగతా అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఇదే సందు దొరికింది కదా ఏదో ఒక వంక పెట్టి మళ్లీ కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక రచ్చ చేయాలి అని భావిస్తూ పార్వతి, దుర్గ కూడా అక్కడికి చేరుకుంటారు.. అక్కడికి వెళ్ళాక శైలు వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తుంది. అక్కడ తమ తెలివితేటలు వాడీ ఏదో ఒక విషయం తెలుసుకుని కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే శైలు తన ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటే మీ అన్న వదిన లు రాలేదా అని, మీ ఫంక్షన్ లు అన్నీ వాళ్ళ చేతులమీదుగా జరుగుతూ ఉంటాయి కదా అని ప్రశ్నిస్తారు.

సిరిని పట్టుకుని

సిరిని పట్టుకుని

ఇది మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి వాళ్ళని పిలవలేదు అని పిలవకుండానే మేము ఫంక్షన్ చేసుకుంటున్నాము అని చెబుతోంది. తాము వచ్చిన పని ఇక్కడ వర్కౌట్ అయ్యేలా ఉందని ఆనందపడతారు. ఇదే విషయాన్ని దుర్గ చెప్పిన పార్వతి ఈ ఫంక్షన్ జరిగేటట్టు కనిపించడం లేదు. మనం మాత్రం రఘురాం కి సీత ఏం చెప్పి ప్రాణాపాయం నుంచి తప్పించింది, అనే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ముందుగా నేను నా కూతురు సిరి దగ్గరకు వెళ్లి ఎలాగోలా ఆ విషయం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తాను అని కూతురు దగ్గరకి వెళ్తుంది. అసలు ఏం జరిగింది? అనే విషయం తెలుసుకోవడం కోసం, తనకు శైలు ఏదో ఒక సీక్రెట్ చెప్పిందని, అబద్ధం చెబుతుంది.

 చీకట్లో రాళ్ళు

చీకట్లో రాళ్ళు

దీంతో సిరి కన్ఫ్యూజన్లో పడి ఆవిడకు అసలు ఏం తెలిసింది? శైలు ఏం తెలియదు కదా శైలు ఆమెకు ఏం చెప్పింది? లేకపోతే ఈవిడ చీకట్లో రాళ్లు వేస్తుందా? అనే అనుమానం కలుగుతుంది. చివరికి తన తల్లి సంగతి తెలియడంతో ఎందుకైనా మంచిది అని భావించి మా ఇద్దరికీ ఒక చీర కట్టుకునే విషయంలో గొడవ వచ్చింది అని అంటుంది. అదేంటి అని ప్రశ్నిస్తే నీకు ఏమీ తెలియదు, అయినా అంతా తెలుసు అన్నట్టు నా నుంచి నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా? అని మందలిస్తుంది. అసలు ఏం జరుగుతోంది చెప్పు అంటే ఒక విషయాన్నీ చాలా కన్ఫ్యూజన్ లో పడేలా చెబుతుంది.

బాధలో లక్ష్మణ్

బాధలో లక్ష్మణ్

మరోపక్క లక్ష్మణ్ బాధ పడుతూ తనకు తెలియకుండానే అన్న వదిన ఉన్న దగ్గరకు వచ్చి తన బాధ అంతా వాళ్ళకే చెప్పుకుంటాడు. తాను అన్న వడినలకు ద్రోహం చేశాను అని బాధ వ్యక్తం చేశారు. రఘురాం సీత కూడా తమ మీద లక్ష్మన్ ఎంత ప్రేమ పెంచుకున్నాడు? అనే సంగతి అతని నోటి ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు. బాధ పడవద్దు అని పెద్దలుగా ధైర్యం చెబుతారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

మరో పక్క దుర్గ పార్వతి దగ్గరకు వెళ్ళి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా సిరి తనను కన్ఫ్యూజ్ చేసినట్టు తాను కూడా దుర్గను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇదేదో తేడాగా ఉంది. నీ కూతురిని కాదు, నీ అల్లుడిని పట్టుకుంటే మనకు ఏదన్నా దారి దొరకవచ్చు అని భావించి అతనిని టార్గెట్ చేయమని చెబియింది. ఆమె చెప్పినట్టు తన అల్లుడిని పార్వతి టార్గెట్ చేసింది. అల్లుడి కోసం వెతుకుతూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తరువాత కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ అనుకోకుండా జరిగిన విషయం అంతా తన అత్త పార్వతికి పూస గుచ్చినట్లు చెప్పడం పార్వతి వెళ్లి ఈ విషయాన్ని జనార్ధన్ కుటుంబ సభ్యులకి చెప్పడంతో పెద్ద కలకలం రేపినట్టు చూపిస్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు తలెత్తనున్నాయి? అనే విషయాలు మాత్రం తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X