Vadinamma: రిషి గురించి అందరికీ చెప్పేసిన సుశీల.. సీత నిర్ణయంతో హార్ట్ ఎటాక్?
రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్న తరువాత రఘురాంకు గుండె పోటు వస్తుంది. రఘురాంకి గుండెపోటు వచ్చిందని తెలియడంతో వెంటనే హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి చేరుస్తారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడంతో డాక్టర్ రఘురాంకి చికిత్స చేయడం మొదలుపెడతారు. రఘు రామ్ చికిత్సకు స్పందించడం లేదని చెబుతూ డాక్టర్ తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో దమయంతి, జనార్ధన్, పార్వతి ఇంటికి వచ్చి రఘురాం ఇక బతకడు అని చెబుతూ ఉన్న ఆస్తిని పంచాలని కోరతారు. సీత దెబ్బకు వాళ్లంతా వెళ్ళిపోతారు. అయితే రాజేశ్వరి మాటలకు బాధ పడ్డ సీత తన కొడుకు రిషి గురించి రఘురామ్ కి చెప్పాలని ఫిక్స్ అవుతుంది. అలా రఘురామ్ కి ఈ విషయం చెప్పడంతో ఆయన లేచి కూర్చుంటాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రఘురామ్ కి వివరంగా
ఎలా అయినా నిజం చెప్పాలని నిర్ణయించుకున్న సీత రిషిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి జరిగిన విషయం అంతా స్పృహలో లేని రఘురాం కి వివరంగా చెబుతుంది. అయితే రఘురాం స్పృహలో లేకపోయినా సీత మాటలు చెవికి ఎక్కుతాయి దీంతో ఆయనకు స్పృహ వస్తుంది. ఆయన లేచేసరికి లక్ష్మణ్ శైలు బాబు ని వెతుక్కుంటూ హాస్పిటల్ కి వస్తారు సీత ఒడిలో బాబును చూసి కాస్త రిలాక్స్ అవుతారు. అయితే సీత నేను ఇప్పుడే బాబును ఇస్తానని వాళ్లను బయటకు పంపించి జరిగిన విషయం అంతా రఘురామ్ కి వివరంగా చెబుతుంది.

చెప్పే దానివి కాదు కదా
అయితే రఘురాం మాత్రం సీత తనను బుజ్జగించడానికి తనను స్పృహలోకి తీసుకురావడానికి ఇలా మాట్లాడుతుంది అని భావిస్తాడు.. కానీ సీత మాట్లాడుతూ బాబు మీద ఒట్టు నిజంగా వాడు నీ కొడుకు బావ అని చెబుతోంది. తర్వాత బాబు వెళ్లిపోయిన తర్వాత రఘురాం చాలా బాధపడతాడు. బాధపడటమే కాక సీత తనకు ద్రోహం చేసింది అని ఆమె ముఖం మీదనే ఆమెను అసహ్యించుకుంటారు.. ఇప్పుడు కూడా నేను చావుబతుకుల్లో ఉన్నాను కాబట్టి ఈ నిజం చెప్పావు లేకపోతే ఇప్పుడు కూడా నిజం చెప్పే దానివి కాదు కదా అంటాడు.

భాస్కర్ బాధ
తనకు కూడా తన కుటుంబం అంటే చాలా ఇష్టం కానీ నా కొడుకు విషయానికి వస్తే నేనైతే అలా చేసే వాడిని కాదు నువ్వు నన్ను సంప్రదించకుండా ఈ పని చేసి చాలా తప్పు చేసావు అని నిందిస్తాడు. అయితే సీత మాత్రం రఘురాముని బతిమలాడి పనిలో పడుతుంది.. ఇంతలో సీత చెబుతున్న మాటలు విని భాస్కర్ ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటాడు.. ఇంతలో తన తల్లి సుశీల రావడంతో ఏం జరిగింది అని అడిగితే నిజం చెబుతాడు. ఇలా సీత తన భర్తకు చెబుతున్న విషయాన్ని నేను చాటుగా విన్నానని సీత ఇలా చేయడం నాకు కూడా నచ్చలేదు అని అంటాడు.

నేనే పెంచుతా
భాస్కర్ చెబుతున్న మాటలు పూర్తికాకుండానే సుశీల హుటాహుటిన రఘురామ్ ఇంటికి వెళ్లి అప్పుడే బాబుకు అన్నం తినిపిస్తున్న శైలు చేతుల్లోంచి బాబుని లాక్కుని మరీ ముద్దాడుతోంది. అలాగే ఇకమీదట నేనే నీకు గోరుముద్దలు తినిపిస్తూ అని చెబుతూ ఎంతో ప్రేమ వ్యక్తం చేస్తోంది.. తన చేతుల్లో నుంచి తన కొడుకుని లాక్కోవడం నచ్చని శైలు ఏంటి ఇలా చేస్తుంది అని బాధ పడుతుంది.. సిరి కూడా ఆమెను సముదాయించి బాబుని శైలుకి ఇప్పించాలని ప్రయత్నం చేస్తుంది.. కానీ చాలా ఆవేశంగా ఉన్న సుశీల ఈ బాబుని ఇక మీదట నేనే పెంచుతానని అంటుంది.

సీత అయితే చెప్పదు
ఇంతలో లక్ష్మణ్ రావడంతో శైలు లక్ష్మణ్ కి ఫిర్యాదు చేస్తుంది, ఆవిడ నా కొడుకుని నేనే పెంచుతాను అంటోంది నాకేదో భయంగా ఉంది అని భర్తకు మొరపెట్టుకుంటే, అతను వచ్చి అత్తయ్య నీకేమన్నా పిచ్చి పట్టిందా శైలు బాబుని శైలుకి ఇచ్చేయ్ అంటాడు. పిచ్చి నాకు కాదు నీకే.. వీడు నా కూతురికి పుట్టిన బిడ్డ నీ పెళ్ళాం పురిటిలో కన్న బిడ్డ చనిపోతే ఆమె ఎక్కడ చనిపోతుందో అనే బాధతో నా కూతురు ఈ బిడ్డను దానం చేసింది.. అని అసలు విషయం కుండ బద్దలు కొడుతుంది.. అయితే ఈ విషయం సుశీలకు ఎలా తెలిసింది, సీత అయితే చెప్పదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది
Recommended Video

సుశీలకు గుండెనొప్పి
ఇంతలో ఇంటికి వచ్చిన సీత దగ్గరకు హుటాహుటిన పరుగెత్తుకు వెళ్ళిన శైలు ఏంటి ఇదంతా నా కొడుకుని నాకు ఇప్పించమని చెప్పు సీతక్క అని ప్రాధేయ పడుతోంది.. ఇంతలో ఇంటికి వచ్చిన భాస్కర్ వాళ్ళ బాబు ని వాళ్ళకి ఇచ్చేసి ఇటుపక్క కి వచ్చేయ్ అమ్మ అంటాడు. ఆమె ససేమిరా నేను రాను అంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు ఇక తర్వాత ఎపిసోడ్ లొ సీత ఆమె బాబు ని వాళ్ళకి ఇచ్చేసి రాకపోతే జన్మలో ఆమె తో మాట్లాడను అని అంటుంది. అయితే ఈ మాటలు విన్న సీత తల్లి సుశీల బాధపడుతూ బాబు ని వాళ్ళకి ఇచ్చేసి బయటికి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆమెకు గుండెనొప్పి వచ్చినట్లు చూపించారు ఇక తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











