Vadinamma: సీతకు క్షణక్షణం నరకమే.. రఘురాం-శైలు మధ్య నలుగుతూ టార్చర్!
రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్న తర్వాత రఘురాంకు గుండె పోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. అయితే సీత రిషి గురించి నిజం చెప్పడంతో ఆయన కోలుకుంటాడు. అయితే సీత మీద అసహ్యం పెంచుకుంటాడు. ఇక కోలుకుని ఇంటికి వచ్చిన రఘురాం ఎక్కువగా తన కొడుకు రిషితోనే సమయం గడుపుతూ ఉంటాడు. అయితే సీత ఇంట్లో ఏదో జరుగుతోందని, అదేంటో కనుక్కోవాలనే కోరికతో రగిలిపోతూ ఉంటుంది దుర్గ. తన అత్త రఘురాంను చూడాలి అంటే నేను తీసుకు వెళతాను అంటుంది. అలా రఘురాం ఇంటికి వెళతారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏది జరిగితే అదే జరుగుతుంది
రఘురాం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రిషి తోనే ఆటలాడుతూ ఉంటాడు. అయితే రిషి తో రఘురాం మాట్లాడుతూ ఉంటే మరోపక్క శైలు మాత్రం గింజుకుంటూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకొని సీత తన అత్త రాజేశ్వరి దగ్గరికి వెళ్లి చూశారు. అత్తయ్య బావ రిషి తోనే ఎక్కువ సమయం గడుపుతున్నా డు శైలు ఈ విషయంలో బాధ పడుతోంది అని చెబుతుంది. వాడి కొడుకుతో వాడు సమయం గడిపే అవకాశం కూడా ఇవ్వాలి అనుకోవడం లేదా ఏది జరిగితే అదే జరుగుతుంది కనీసం వాడినైనా ప్రశాంతంగా ఉండనివ్వండి అని రాజేశ్వరి అంటుంది. ఇక ఇదంతా జరుగుతున్న సమయం లో సీత తల్లి సుశీల, సీత వదిన దుర్గా, సీత అన్న భాస్కర్ ముగ్గురు వస్తారు. వాళ్లను చూసి సీత షాక్ అవుతుంది ఇప్పటికే బావ నాతో మాట్లాడటం లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చారు వేళ్లతో ఎలా ప్రవర్తిస్తాడో అని టెన్షన్ పడుతూనే లోపలికి వెళ్లి వాళ్లు వచ్చిన సంగతి చెబుతుంది..

దుర్గకు అనుమానం
అయితే రాజేశ్వరి మాత్రం వాడికి ఆరోగ్యం అంత బాగా లేదని వీలైనంత త్వరగా మాట్లాడే వెళ్లిపోవాలని అంటుంది. దుర్గకు అప్పుడే అనుమానం వస్తుంది, సీత ఎందుకు మమ్మల్ని చూసి కంగారు పడుతుంది ఇక్కడ ఏదో జరుగుతోంది! ఏం జరుగుతుందో తెలుసుకునే తీరాలి అని భావిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత సుశీల రఘురామ్ ని పరామర్శిస్తున్నది పిల్లలు పుట్టడం లేదని నా కూతురు ధైర్యంగా ఉంది నువ్వు ఎందుకు బాధ పడతావు అంటుంది. నీ కూతురికి ఉన్నంత గుండె నిబ్బరం నాకు లేదు అని రఘురామ్ అంటాడు అదేమీ కాదని జాగ్రత్తగా ఉండాలని చెబుతూ సుశీల, దుర్గా బయటకు వెళ్తారు. తర్వాత నా మేనల్లుడుని ఇలా ఇవ్వు అని భాస్కర్ అడగడంతో సీతా రఘురాం ఇద్దరు షాక్ అవుతారు. నాకు అంతా తెలుసు అని సీత హాస్పిటల్ లో చెబుతుంటే విన్నాను అని భాస్కర్ అంటాడు.

నాకంతా తెలుసు
పిల్లవాడిని ఎత్తుకుని ముద్దాడుతున్న సమయంలో రఘురాం మళ్లీ లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. ఏం బావ కొద్దిసేపు కూడా పిల్లవాడిని దూరంగా ఉంచ లేక పోతున్నావా అని అడుగుతాడు భాస్కర్. ఇక అలా భాస్కర్, దుర్గా, సుశీల మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్లారు.. అయితే ఈ దుర్గం మాత్రం ఏదో జరుగుతోంది అని అనుమానం మాత్రం పీడిస్తూనే ఉంది. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రఘురాం రిషి తో కలిసి నిద్ర పోతారు. కొడుకు కోసం శైలు ఆరాట పడుతూ ఉంటుంది లోపలికి వెళ్లి అడగాలి అంటే ఏమనుకుంటారో అని భయం అందుకే గుమ్మం దగ్గర నిలబడి తచ్చాడుతున్న శైలుని చూసి సీత వెళ్లి పలకరిస్తుంది అయితే నా కొడుకుని నాకు తెచ్చి ఇవ్వు అని అడుగుతుంది శైలు. ఒకవేళ వారికి దూరంగా ఉండాల్సి వస్తే ఎం చేస్తావు ఇప్పటినుంచి అలవాటు చేసుకో అన్నట్లు మాట్లాడుతుంది సీత. ఎప్పుడో చూస్తాం కదా అని ఇప్పటి నుంచే బతకడం మానేయండి అంటే ఎలా అంటుంది శైలు.

చచ్చిపో అన్నట్లు
అదేంటి అలా అంటావ్ అంటే వారికి దూరంగా ఉండడం అంటే నన్ను చచ్చిపో అన్నట్లు అనిపిస్తోందని శైలు అంటుంది. బాధ పడిన సీత రిషిని తీసుకురావడానికి లోపలికి వెళ్ళి తీసుకు రాబోతుండగా అనుమానంగా చూస్తాడు. వాళ్ళ బాబు కోసం శైలు వచ్చి నిలబడింది అంటే ఏమీ చేయలేక ఇచ్చేస్తాడు. ఇక తెల్లవారిన తర్వాత రఘురాం షాపుకు బయలుదేరడం కోసం బయటికి వచ్చి కూర్చుంటాడు, టిఫిన్ పెట్టమని సీతను అడగకుండా సిరిని అడుగుతాడు. సిరి పక్కన సీత ఉంది కదా అనే ఉద్దేశంతో బయటకు వెళ్ళిపోతుంది. సీత ఇడ్లీ పెడితే కోపం గా అరుస్తూ సిరిని పిలుస్తాడు రఘురాం. నీకు కూడా నేను లెక్క లేకుండా పోయానా, నీకు పెట్టడం ఇష్టం లేకపోతే చెప్పేయ్ లేదా పనిలో ఉంటే ఆ విషయం చెప్పు నేను వేరే వాళ్ళని అడుగుతాను అంటే ఆల్రెడీ టిఫిన్ పెట్టారు కదా అంటుంది సిరి, ఆ విషయం నాకు తెలియదా నువ్వు నాకు చెబుతున్నావా అంటూ సీరియస్ అవుతాడు.
Recommended Video

కమింగ్ అప్ లో
దీంతో సీత బాధపడుతుంది రఘురాం షాప్ కి వెళ్ళి పోతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తరువాతి ఎపిసోడ్ కమింగ్ చూపిస్తున్న దాని ప్రకారం బాబు ని షాప్ కి తీసుకువెళతాడు రఘురాం. ఈ విషయం తెలిసి శైలు కోపంగా సీత దగ్గరకు వచ్చి బావగారు ఇలా షాప్ కి తీసుకోవడం మొదటి తప్పు ఎంతసేపు తీసుకు రాకపోవడం ఇంకా పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతుంది. ఈ లోపు అక్కడికి వచ్చిన దుర్గ, పార్వతి ఇంకా ఆజ్యం పోస్తున్నట్లుగా ఏడాది కూడా నిండకుండానే అప్పుడే ప్రయోజకుడిని చేస్తున్నాడు రఘురాం. వాడిని షాప్ లో కూర్చోబెట్టి పొట్లాలు కట్టడం నేర్పిస్తున్నాడు అని నూరి పోస్తున్నారు. దీంతో కోపం వచ్చిన శైలు షాప్ కు బయలుదేరి వెళ్ళినట్లుగా చూపిస్తున్నారు. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











