Vadinamma: సీతను టార్గెట్ చేసిన శైలు.. రఘురాంకి చెప్పమంటూ బలవంతం.. పార్వతి దెబ్బకు ముసలం?
రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్న తర్వాత రఘురాంకు గుండె పోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. అయితే సీత రిషి గురించి నిజం చెప్పడంతో ఆయన కోలుకుంటాడు. అయితే సీత మీద అసహ్యం పెంచుకుంటాడు. ఇక కోలుకుని ఇంటికి వచ్చిన రఘురాం ఎక్కువగా తన కొడుకు రిషితోనే సమయం గడుపుతూ ఉంటాడు. అయితే సీత ఇంట్లో ఏదో జరుగుతోందని, అదేంటో కనుక్కోవాలనే కోరికతో రగిలిపోతూ ఉన్న దుర్గ రఘురాం ఇంటికి వెళ్లి కనుక్కునే ప్రయత్నం చేసింది.
అది వర్కవుట్ కాలేదు. ఇక రఘురాం సీతతో మాట్లాడకుండా చాలా బాధ పెడుతూ ఉంటాడు. రఘురాం సీత మీద కోపం కుటుంబ సభ్యుల మీద చూపిస్తూ ఉంటాడు. రిషిని తీసుకుని షాప్ కు బయలుదేరి వెళతాడు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జనార్ధన్ తన బావమరిది తో
రఘురాం ఎలా బతికి వచ్చాడు అనే విషయం మీద జనార్ధన్ తన బావమరిది తో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అది ఇప్పుడు చావడం, చంపడం గురించి మాట్లాడే మనం రఘురాం బతికి రావడం అనేదాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బామ్మర్ది అంటాడు. అయితే ఈ విషయం మీద డాక్టర్ ని అడిగితే మనకి కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నాడు. తాను డాక్టర్ తో మాట్లాడాను అని సీత తో మాట్లాడిన వెంటనే రఘురాం ఏదో ఇంజక్షన్ ఇచ్చినట్టు లేచి కూర్చున్నాడు అని ఏదో చెప్పిందని జనార్ధన్ అంటాడు. అయితే వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో శైలు తన కొడుకు కనపడటం లేదని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది.

రిషి కనబడటం లేదని
వైదేహి ఆడుకుంటుంది గాని రిషి ఎక్కడా కనబడటం లేదని ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఇంట్లో అందరూ అక్కడ సమావేశమవుతారు. అసలు రిషి ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం ఎవరికీ అర్థం కాదు. లక్ష్మణ్ వచ్చి రిషి ఎక్కడికి వెళ్ళాడో చూసుకోవడం తెలియదా అని అడిగితే మనిద్దరమే ఉంటే కనిపెట్టొచ్చు ఇంట్లో ఎంత మంది ఉంటే ఎవరు తీసుకువెళ్లారు ఎలా చెప్పగలను అంటుంది. అయితే ఒకవేళ రఘురాం తీసుకెళ్లి ఉంటాడు అనే అనుమానం కలగగా లక్ష్మణ్ రఘురాం కి ఫోన్ చేస్తాడు. అవును నేనే బాబు ని తీసుకుని వెళ్లాను, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వారసుల పూజ జరుగుతుంటే పూజ చేస్తున్నాను అంటాడు.

శైలు ఫైర్
ఈ మాట చెప్పగానే శైలు కోపం పడుతుంది ఇది మొదటి సారి కాదు గతంలో కూడా బావ గారు ఇలాగే చెప్పకుండా బయటికి తీసుకు వెళ్లారు, సీత కూడా ఇలాగే తీసుకువెళ్ళింది ఇది సరైన పద్ధతి కాదు తప్పు అని మాట్లాడుతుంది.. అయినా సరే సీత ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఎంత చెబుతున్నా సీతక్క ఇక మీదట ఇది రిపీట్ కాదు అని చెప్పడం లేదు చూడండి అని భర్త కు ఫిర్యాదు చేస్తుంది.. లక్ష్మణ్ కూడా ఏమీ మాట్లాడలేక ఉండిపోతాడు. అయితే ఇక మీదట అలా చెప్పాపెట్టకుండా బాబు ని బయటికి తీసుకెళ్లకుండా ఉండమని బావగారికి చెప్పమని శైలు బలవంతం చేస్తుంది.

సీత మాట వినని రఘురాం
దీంతో లక్ష్మణ్ ఫోన్ నుంచి రఘురాం కి మళ్ళీ ఫోన్ చేయగా ఫోన్ ఎత్తిన రఘురాం ఎవరు మాట్లాడుతున్నారో కూడా వినకుండా వాడిని బయటికి తీసుకు వెళ్లడంలో తప్పేంటి, నాకు మాత్రం హక్కు లేదా నేను వాడి పెదనాన్న నే కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేది లక్ష్మణ్ కాదని నేను సీతని సీత అంటుంది..ఇలా నువ్వు చెప్పా పెట్టకుండా తీసుకువెళితే శైలు వాళ్ళు భయపడుతున్నారని ఇక మీదట అలా తీసుకు వెళ్లదు అని చెప్పే ప్రయత్నం చేయబోగా రఘురాం తాను ఏమనుకుంటున్నారో చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు.. దీంతో కుటుంబ సభ్యులు లో టెన్షన్ నెలకొంది నువ్వు చెప్పు అన్న మాట ఎందుకు చెప్పలేదు సీతక్క అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక సీత అలాగే నిలబడి పోతుంది.
Recommended Video

కమింగ్ అప్ లో
దీంతో సీత బాధపడుతుంది రఘురాం షాప్ కి వెళ్ళి పోతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తరువాతి ఎపిసోడ్ కమింగ్ చూపిస్తున్న దాని ప్రకారం బాబు ని షాప్ కి తీసుకువెళతాడు రఘురాం. ఈ విషయం తెలిసి శైలు కోపంగా సీత దగ్గరకు వచ్చి బావగారు ఇలా షాప్ కి తీసుకోవడం మొదటి తప్పు ఎంతసేపు తీసుకు రాకపోవడం ఇంకా పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతుంది.
ఈ లోపు అక్కడికి వచ్చిన దుర్గ, పార్వతి ఇంకా ఆజ్యం పోస్తున్నట్లుగా ఏడాది కూడా నిండకుండానే అప్పుడే ప్రయోజకుడిని చేస్తున్నాడు రఘురాం. వాడిని షాప్ లో కూర్చోబెట్టి పొట్లాలు కట్టడం నేర్పిస్తున్నాడు అని నూరి పోస్తున్నారు. దీంతో కోపం వచ్చిన శైలు షాప్ కు బయలుదేరి వెళ్ళినట్లుగా చూపిస్తున్నారు. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











