Vadinamma: ఇంట్లో చిచ్చు పెట్టిన పార్వతి, దుర్గ.. బాబు మీద బెంగతో అల్లాడిన శైలు.. కళ్ళు తిరిగి పడడంతో!

రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్న తర్వాత రఘురాంకు గుండె పోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. అయితే సీత రిషి గురించి నిజం చెప్పడంతో ఆయన కోలుకుంటాడు. కానీ సీత మీద అసహ్యం పెంచుకుంటాడు, కోలుకుని ఇంటికి వచ్చిన రఘురాం ఎక్కువగా తన కొడుకు రిషితోనే సమయం గడుపుతూ ఉంటాడు. ఒకానొక రోజు రిషిని తీసుకుని షాప్ కు బయలుదేరి వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేస్తుంది. తన కొడుకు తనకు కావాలంటూ హడావుడి చేస్తుంది. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సీత బాధపడుతూ

సీత బాధపడుతూ


రఘురాం ప్రవర్తిస్తున్న తీరు విషయంలో సీత చాలా బాధపడుతూ ఉండగా ఆమె అన్న భాస్కర్ వచ్చి ఆమెకు ధైర్యం చెబుతాడు. ఇంకొకరు ఇంకొకరు తప్పు చేస్తున్నారు అంటే సర్ది చెప్పవచ్చు కానీ రఘురామ్ ఇలా చేస్తున్నాడు అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు. నువ్వు వచ్చేస్తాను అంటే చెప్పు నిన్ను మా ఇంటికి తీసుకు వెళ్ళి పోతాను అని సీతతో అంటాడు. అయితే అదేమీ లేదని సర్ది చెప్పిన సీత తన అన్న భాస్కర్ గుండెల మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇంట్లో బాబు కనపడడం లేదు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో బాబు షాప్ లో ఉన్న సంగతి రఘురాం చెబుతాడు కదా, షాపులో రఘురాం తో బుడతడు ఆడుకుంటూ ఉంటాడు.

షాప్ లో సరదాగా

షాప్ లో సరదాగా

అయితే అనుకోకుండా ఏడుస్తూ ఉండడంతో షాప్ లో పనిచేస్తున్న కుర్రవాడు ఏమిటి సడన్గా బాబు ఏడుస్తున్నాడు అని ప్రశ్నిస్తాడు.. దానికి రఘురాం లోలోపల బాధపడుతూ వాడు ఏడవడం కాదు నన్ను ఏడిపిస్తున్నారు కన్న కొడుకును కూడా ఇలా దొంగతనంగా బయటికి తీసుకు వచ్చేలా చేసింది వాళ్ళమ్మ అని బాధపడుతూ ఉంటే భారత్ కల్పించుకుని ఏమిటి అన్నయ్య బాబు వంక అదోలా చూస్తూ బాధపడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. చచ అదేమీ లేదు వీడు ఉదయం నుంచి నన్ను వదిలి ఉండడం లేదు రా అంటూ రఘురాం మాట్లాడుతాడు.. ఇక ఆ తర్వాత షాప్ లో ఏదో కొనడానికి వస్తే అది ఋషి చేతులమీదుగా కస్టమర్ కు ఇప్పిస్తాడు రఘురాం. ఆ తర్వాత సరదాగా రిషి కి పొట్లాలు కట్టడం నేర్పిస్తూ ఉంటాడు

పొట్లం కట్టడం ఏమిటి ?

పొట్లం కట్టడం ఏమిటి ?

అదే సమయంలో అటుగా వెళుతున్న పార్వతి దుర్గ ఇద్దరు ఈ దృశ్యాన్ని చూస్తారు. దీనిని శైలు ని రెచ్చగొట్టేందుకు వాడవచ్చు అని ఐడియా వచ్చిన వెంటనే పార్వతి, దుర్గ చేత ఫోటోలు తీయిస్తుంది. ఫోటోలు తీసిన వెంటనే ఆ ఫోటోలు తీసుకుని సీత ఇంటికి బయలుదేరి వెళతారు పార్వతి దుర్గ. వెంటనే శైలు ని పిలిపించి నీ కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు ఇంకా నిక్కర్ కూడా సరిగ్గా వేసుకోవడం రాని సమయంలోనే వారికి ఎలా పొట్లాలు కట్టాలో నేర్పిస్తున్నాడు మీ బావ ఇంకా నీ కొడుకు గురించి టెన్షన్ పెట్టుకోకు అసలా టెన్షనే అక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది. అయితే వాడు పొట్లం కట్టడం ఏమిటి వాడు తన తండ్రిలా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తాడు అని శైలు అంటుంది.

చిచ్చు పెట్టిన పార్వతి, దుర్గ

చిచ్చు పెట్టిన పార్వతి, దుర్గ

ఏమో మాకేం తెలుసు వాడు అలా పొట్లాలు కట్టడం మా కళ్లారా చూశాం అని పార్వతి అంటుంది. అయితే నా తల్లి మాటలు నమ్మవద్దు గొడవలు పెట్టడం కోసం ఏమైనా చేస్తుంది అని సిరి అంటుంది. నన్ను నమ్మరు అని తెలిస్తే ఫోటోలు తీసుకువచ్చామని చెబుతూ తీసిన ఫోటోలను చూపిస్తుంది దుర్గ. కొడుకు చేత రఘురాం పొట్లాలు కట్టించడం చూసి తట్టుకోలేని శైలు హుటాహుటిన షాప్ కి బయలుదేరి వెళ్ళింది. అయితే ఆమె షాప్ కి బయలుదేరి వెళ్ళే సమయానికి రఘురాం ఎక్కడికో బయలుదేరి వెళతారు. శైలు వెళ్లే సమయానికి షాపులో భరత్ ఒక్కడే ఉంటాడు మీ అన్నయ్య బాబు ఎక్కడికి వెళ్లారు అంటే ఇప్పుడే ఎక్కడికో వెళ్లారు అంటాడు. అలా వెళ్ళారా లేకపోతే లోపల ఉండి నీతో అలా చెప్పిస్తున్నారా అన్నట్లు మాట్లాడుతుంది శైలు.

కళ్ళు తిరిగి పడిన శైలు

కళ్ళు తిరిగి పడిన శైలు

షాప్ కు వచ్చిన కస్టమర్ తో కూడా దురుసుగా ప్రవర్తించటంతో కస్టమర్ వెళ్ళిపోతాడు. షాప్ లో లేరు బహుశా ఇంటికి వెళ్లి ఉండవచ్చు అని చెప్పడంతో ఇంటికి బయలుదేరి వెళ్ళింది. అనూహ్యంగా ఇంట్లో కూడా రఘురాం బాబు ఇద్దరూ కనిపించరు.. సీతను ఫోన్ చేసి కనుక్కో మంటే సీత ఫోన్ చేస్తుంది కానీ రఘురాం కట్ చేస్తాడు. సిరి ఫోన్ చేస్తున్నా రఘురాం ఎత్తే ప్రయత్నం చేయడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తరువాత కమింగ్ లో చూపిస్తున్న దాని ప్రకారం బాబు రాగానే వెంటనే లాక్కుని ఎత్తుకున్న శైలు ఇకమీదట ఎవ్వరికీ ఇవ్వనని, నా దగ్గరే ఉంటాడు అని అంటుంది.. అంతేకాక ఆమె అలా మాట్లాడుతూ కళ్లు తిరిగి పడిపోవడం కూడా చూపించారు.. చూస్తూ ఉంటే తర్వాత ఎపిసోడ్ లో ఇంకా ఏదో ట్విస్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X