Vadinamma: రఘురాం ఇంట ముసలం.. అనూహ్యంగా బాబుకు తీవ్రగాయం.. రక్తస్రావం కూడా?

రఘు రామ్- సీతల పెళ్లి రోజు తర్వాత రఘురాంకు గుండె పోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. అయితే సీత రిషి గురించి నిజం చెప్పడంతో ఆయన కోలుకుంటాడు కానీ సీత మీద అసహ్యం పెంచుకుంటాడు, కోలుకుని ఇంటికి వచ్చిన రఘురాం ఎక్కువగా తన కొడుకు రిషితోనే సమయం గడుపుతూ ఉంటాడు. ఒకానొక రోజు రిషిని తీసుకుని షాప్ కు బయలుదేరి వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేస్తుంది. తన కొడుకు తనకు కావాలంటూ హడావిడి చేస్తుంది.

అయినా బాబును తీసుకుని రోజంతా తనతోనే ఉంచుకుంటాడు రఘురాం, బాబు రాగానే వెంటనే లాక్కుని ఎత్తుకున్న శైలు ఇకమీదట ఎవ్వరికీ ఇవ్వనని, నా దగ్గరే ఉంటాడు అని అంటుంది.. అంతేకాక ఆమె అలా మాట్లాడుతూ తన భర్తను తన కోసం మాట్లాడడం లేదని అంటున్నారు. ఇక అలా గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శైలు రాద్ధాంతం

శైలు రాద్ధాంతం

రఘురాం బాబుని ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత శైలు పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఇకమీదట తన బాబు ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది లేదని ఊరికే వదిలేస్తే, ఎక్కడికి పడితే అక్కడికి చెప్పకుండా తీసుకు వెళ్ళిపోతున్నారు అని అంటుంది. అలా శైలు అందరి మీద ఫైర్ అవుతున్న సమయంలో ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోవడం కూడా జరుగుతుంది.

భార్య పరిస్థితి చూసి లక్ష్మణ్ కి చాలా కోపం వస్తుంది. అన్న మీదకు వెళ్లి అలా తీసుకు వెళ్లడం కరెక్టేనా, చెప్పి తీసుకువెళ్లాలి కదా అన్నట్లు సీరియస్గా మాట్లాడుతాడు. దీంతో సీతకు కోపం నషాళానికంటింది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా మీ అన్నయ్య మీ కొడుకుని తీసుకువెళ్లే హక్కు ఆయనకు లేదా? అంటూ సీరియస్ అవుతుంది.

అసలేం జరిగిందో?

అసలేం జరిగిందో?

అంతేకాక ఆయన తలుచుకుంటే నీ కొడుకు నీ దగ్గర ఉండడు అన్నట్లు మాట్లాడడంతో అసలేం జరిగిందో చెప్పమని లక్ష్మణ్ బలవంతం చేస్తాడు. అయితే సీత తాను పొరపాటు చేశాను అనే విషయం అర్థం చేసుకుని అదేమీ లేదని మాకు మీరు ఎంతో మీ పిల్లలు కూడా అంతే అని అంటుంది.. అయితే లక్ష్మణ్ కి తాను గట్టిగా మాట్లాడిన విషయం అర్థమై సీత దగ్గరకు వచ్చి నెమ్మదిగా రిషి కొంచెం దూరంగా ఉంటేనే శైలు పరిస్థితి ఇలా తయారైంది ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నదో మీకు అర్థమవుతుంది కదా మా భార్య కోసం నేను కూడా మాట్లాడకూడదా అన్నట్లుగా మాట్లాడారు.

సీత కూడా అర్థం చేసుకునే సరేలే నువ్వెళ్ళి పని చూడు అన్నట్లు పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత బాధ పడుతున్న రఘురాం వద్దకు వెళ్లి సీత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది.

బాధలో సీత

బాధలో సీత

అయితే రఘురాం మాత్రం నన్ను లక్ష్మణ్ అన్ని మాటలు అన్న బాధ కలగలేదు కానీ ఆ మాటలు మీ వల్ల పడాల్సి వచ్చింది అనే బాధ మాత్రం తన ఉందని అంటారు. అంతేకాక ఎవరు ఎన్ని అనుకున్నా సరే నా కొడుకు తో నేను ఒక రోజు మొత్తం గడిపాము ఎవరితో సంబంధం లేకుండా ఎవరైనా అనుకుంటారు సంబంధం లేకుండా ఒక రోజు మొత్తం వాడితో గడిపాను అని ఆనందం వ్యక్తం చేస్తాడు.

అయితే సీత మాత్రం రఘురాం తీరుతో బాధపడుతూ ఉంటుంది రఘురాం సీత పక్కన పడుకోకుండా కిందకి వెళ్లి పడుకోవడం తో ఆమె ఎలా స్పందించాలో కూడా ఆమెకు అర్థం కాదు. అయితే శైలు నిద్రలో కూడా రిషి కోసం కలవరిస్తూ ఉంటుంది మధ్యరాత్రిలో ఎత్తుకు పోతున్నారు గట్టి గట్టిగా అరవడంతో లక్ష్మణ్ లేచి చూస్తాడు.

నిద్రలో కూడా కలవరిస్తూ

నిద్రలో కూడా కలవరిస్తూ

ఇదంతా నీ భ్రమ నువ్వు నిద్రలో కలవరిస్తున్నావు, రిషి నీ పక్కనే ఉన్నాడు చూడు అంటూ చూపించడంతో శైలు కాస్త కుదుట పడుతుంది. అయితే నేను నిద్రపోను నువ్వు నిద్ర లేచాక నేను నిద్ర పోతాను నువ్వు బాబును చూసుకో ఇద్దరిలో ఎవరో ఒకరు చూసుకుంటూ ఉండాలి అంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇదంతా మన ఇల్లే అందరూ మన వాళ్ళు ఎవరు ఎక్కడికి తీసుకు వెళ్లరు అని లక్ష్మణ్ అంటాడు.

అయినా సరే శైలు పూర్తిగా నమ్మని పరిస్థితి. పొద్దున్నే బాబు కోసం చూసి బాబు పక్కన ఉన్నాడు అని తెలిసిన తరువాతే ఆమె కుదుటపడుతుంది. స్నానానికి వెళ్లి బయటకు వచ్చేలోపు బాబుతో రఘు ఆడుకుంటూ ఉంటాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
బాబుకు గాయం?

బాబుకు గాయం?

ఇది చూసి ఆమె కోపం మళ్లీ వచ్చేస్తుంది. నిన్న బాబు కనపడటం లేదని అంత బాధ పడ్డాను మీరు మళ్ళీ తీసుకువచ్చి ఆడుకుంటున్నారా అంటే నేనేమీ బయటకు తీసుకు వెళ్ళ లేదు కదా ఇంట్లో ఆడుకుంటున్నాను కదా అంటే వినిపించుకోకుండా లోపలికి తీసుకు పోతుంది. లోపలికి వెళ్ళాక కూడా నిష్టూరంగా మాట్లాడుతుంది.

ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ లొ బాబు కి ఏదో జరగరానిది జరిగినట్లుగా చూపిస్తున్నారు. కుటుంబం అంతా కూడా హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ బాబుకు బాగా రక్తం పోయినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X