Vadinamma :శిల్ప అన్నతో కలిసిపోయిన శైలు తండ్రి.. పాతిక లక్షలు కొట్టేసి రాళ్లు పెట్టారు..మాములుగా లేదుగా!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 671వ ఎపిసోడ్ కి చేరింది. శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని మంచిగా మారుతూ పచ్చళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటుంది. కట్టాల్సిన 25 డబ్బు జాతరకు వచ్చే సమయంలో మీరు తీసుకురావాలని అమరేశ్వర్ అంటాడు. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బులు అమ్మవారి విగ్రహం దగ్గర పెడితే అవి దొంగతనానికి గురవుతాయి. ఇంట్లో దొంగ దూరితే అతను దొంగతనం చేశాడు అనుకుని కొడతారు. అయితే అతను నేను దొంగను కాదని ఆకలికి తట్టుకోలేక ఇంట్లోకి వచ్చాను అని చెప్పడంతో పాటు డబ్బు అమ్మవారి విగ్రహం కింద జాగ్రత్తగా పెట్టానని చెబుతాడు. చూస్తే నిజంగానే డబ్బు అమ్మవారి విగ్రహం కింద కనిపిస్తాయి. దీంతో సీత అతనికి భోజనం పెడుతుంది. నిజంగా అమ్మవారి దిగివచ్చి అంత ఆనందంగా ఉందని చెబుతూ తన భోజనం తిని బయటకు వెళ్ళిపోతాడు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

అమరేశ్వర్ మాత్రం

అమరేశ్వర్ మాత్రం

జాతర వద్దకు రఘు రామ్ తన కుటుంబంతో సహా చేరుకుంటాడు.. అప్పు ఇవ్వాల్సిన అమరేశ్వర్ ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉండగా చివరికి ఒకచోట కనిపిస్తాడు. అక్కడికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా శైలు తండ్రి ఎంట్రీ ఇస్తాడు. వెటకారంగా రఘురాం గారు నేను లోకల్ ఎమ్మెల్యే ని అని పరిచయం చేసుకుంటూ ఉంటాడు ఆయన. దానికి అమరేశ్వర్ మాట్లాడుతూ మీరిద్దరూ బంధువులు అన్న విషయం నాకు తెలుసు ఇప్పుడు ఎందుకు ఈ సరసాలు అన్నట్లు మాట్లాడతాడు. సరసాలాడుకునేంత చనువు లేదు అంత దగ్గర బంధుత్వము కూడా లేదు అన్నట్లుగా శైలు మామయ్య మాట్లాడుతాడు. అయితే అమరేశ్వర్ మాత్రం రఘురాం చాలా గొప్పవాడని నేను ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు పది లక్షలు ఇస్తే నేను అడిగిన వెంటనే వాటిని సిద్ధం చేశాడని అని చెప్పుకొచ్చారు

శిల్ప వింతగా

శిల్ప వింతగా

రఘురాం ని అమరేశ్వర్ పొగుడుతుంటే పట్టలేని శైలు తండ్రి నీ పనయ్యాక పిలవండి మేము అంత వరకు జాతర చూస్తాం అని వెళతాడు. జాతరలో అమ్మవారికి దండం పెట్టుకుంటున్న శిల్ప అమ్మ కిషోర్ దగ్గరికి వెళ్లి మాటలు కాదు పని ముఖ్యం ముందు చెప్పినట్లు చేయండి అని అంటాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఇప్పటికే సీత అలాగే శైలు ఒకపక్క వెళ్లగా మరోపక్క సిరి పాప కూడా ఏడుస్తూ ఉంటుంది. మేము ఎత్తుకొని ఆడిస్తామని నాని శిల్పా పాపను తీసుకుని జాతరలో కి వెళ్తారు. అక్కడ శిల్ప వింతగా అన్ని వస్తువులను చూస్తూ ఉంటే నాని ఆనంద పడుతూ ఉంటాడు ఇక వీళ్లిద్దరు ఆనందపడుతూ ఉన్న క్రమంలో శిల్ప అన్న కిషోర్ నియమించిన వ్యక్తి చేతిలో ఉన్న డబ్బు కొట్టేస్తాడు. అలాంటి వ్యక్తి అక్కడ పడేసి అందులో రాళ్లు వేస్తారు.

బ్యాగ్ లో రాళ్ళు

బ్యాగ్ లో రాళ్ళు

ఏమీ జరగలేదు అనుకోని తర్వాత తేరుకొని చూస్తే బ్యాగ్ లో రాళ్ళు ఉంటాయి. ఇక ఈ విషయం తెలుసుకుని నువ్వు ఇక్కడే ఉండు ఎవరు ఫోన్ చేసినా ఎవరు వచ్చినా ఏమీ మాట్లాడకు నేను వాడి దగ్గర డబ్బులు ఇస్తాను అని పెడతాడు. అయితే నాని వెళ్లి ఎంత ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు అనే విషయం అర్థం కాదు. డబ్బులు కొట్టేసిన వ్యక్తి ఆ డబ్బులు వెనక్కి తీసుకువెళ్ళి కిషోర్ కి అప్పగిస్తాడు కిషోర్ కార్ లో పెట్టుకుని నువ్వు అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోవద్దు కానీ ఇక్కడే ఉండు సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను ఏం చేయాలి అనేది అంటాడు. నాని జాతరంతా నల్ల మాస్క్ వేసుకున్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం దాక్కొని ఉండడంతో ఎవరు, తన దగ్గర నుంచి డబ్బులు కొట్టేసారు విషయం నానికు అర్థం కాదు

డబ్బులు కోసం వెతుకుతూ

డబ్బులు కోసం వెతుకుతూ

ఇక చాలా సేపటి క్రితం వెళ్లారు కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు ఏమిటి అనే ఉద్దేశంతో లక్ష్మణ్ అలాగే సిరి పాప కోసం వెతకడానికి పోతారు. భరత్ తన తల్లి దగ్గర కాపలా ఉంటాడు. సిరి వెతకడానికి వచ్చి శిల్పకి ఫోన్ చేస్తే శిల్ప ఫోన్ ఎత్తి ఏడుస్తూ ఉంటుంది. దీంతో అసలు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఇలా జరిగింది అనే విషయం బయటపడుతుంది.. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని నాని కోరాడు అనడంతో ఎవరికీ విషయం చెప్పవద్దు అని భరత్ కి కూడా ఫోన్ చేసి చెబుతుంది.. భరత్ కూడా నేనిప్పుడే వస్తాను అని చెప్పి తల్లి దగ్గర నుండి బయలుదేరుతాడు. ఇక మొత్తం మీద కుటుంబంలో దాదాపు అందరు డబ్బులు కోసం వెతుకుతూ ఉంటారు

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

డబ్బులు పోయాయి అన్న విషయం తెలుసుకున్న రఘురాం కుటుంబం మొత్తం కూలబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు.. ఇక జరుగుతున్న కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం సీత ఇది మన కుటుంబానికి తెలిసిన వారు చేసిన పనే ఎందుకంటే మనం ఏ బ్యాగులో డబ్బులు పెట్టి తీసుకు వస్తున్నాము అలాంటి బ్యాగులోనే రాళ్ళు వేసి తీసుకువచ్చారు అంటే మన కదలికలను బాగా గమనిస్తున్నారు అని ఆమె అంటుంది. అయితే మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X