For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : అడ్డంగా దొరికేసిన కిషోర్.. 25 లక్షలు సేఫ్.. కిషోర్ మీద నాని మర్డర్ అటెంప్ట్!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 673వ ఎపిసోడ్ కి చేరింది. శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని మారిపోయింది. కట్టాల్సిన 25 లక్షల డబ్బు జాతరకు వచ్చే సమయంలో మీరు తీసుకురావాలని అమరేశ్వర్ అంటాడు. జాతరకు వెళ్లిన తర్వాత తలా ఒకరు తలా ఒక దిక్కుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు ఉంచిన బ్యాగ్ నానీ దగ్గర ఉంచిన క్రమంలో నానీ దగ్గర శిల్ప అన్న దొంగతనం చేయిస్తాడు. ఈ విషయాన్ని రఘురాం అమరేశ్వర్ కు చెప్పలేక సతమత మవుతూ ఉంటాడు. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  డబ్బు బ్యాగ్ మిస్ కావడంతో

  డబ్బు బ్యాగ్ మిస్ కావడంతో

  డబ్బులు దొంగతనానికి గురి అయ్యాయి అని చెబితే నిజంగా డబ్బులు తీసుకురాకుండా ఏదైనా నాటకం ఆడాను అని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో సీత డబ్బులున్న బ్యాగ్ అడగగానే అమరేశ్వర్ చేతికి ఇస్తుంది. అయితే రఘురాం మాత్రం డబ్బులు పోయాయనే మాట చెప్పేద్దాం అనుకుంటాడు కానీ సీత అలా చేయడంతో ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ విధంగా డబ్బు ఉన్న బ్యాగ్ ని అమరేశ్వర్ పూజారికి ఇచ్చి అమ్మవారి కాళ్ల దగ్గర పెట్టి పూజ చేయమని చెబుతాడు. ఆ సమయంలో కూడా రఘురామ్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు. రఘు రామ్ కి ఇష్టం ఉంటే ఆయన నేనే ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకుంటామని కూడా శైలు తండ్రితో అంటాడు. శైలు తండ్రి మాత్రం డబ్బులు దొంగతనానికి గురయ్యాయి అనే సంగతి తెలుసు కాబట్టి త్వరలోనే వీళ్ళ బండారం బయటపడుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు.

  రఘు రామ్ కి కల

  రఘు రామ్ కి కల

  సీతను పక్కకు తీసుకు వెళ్లిన రఘురాం ఇలా చేయడం తనకు ఏమీ నచ్చలేదు అని ఇప్పుడు కనుక అసలు విషయం తెలిస్తే చాలా చండాలంగా ఉంటుంది అని అంటాడు.. నా చేత అమ్మవారు ఇలా చేయించింది నేను ఏదీ స్వయంగా చేయలేదని సీత అంటుంది త్వరలోనే దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతూ మీరు టెన్షన్ పడవద్దు అని కోరుతుంది. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో రఘురాం కి కల లాగా వస్తుంది. బ్యాగ్ లో రాళ్ళు ఉన్న విషయం తెలుసుకుని అమరేశ్వర్ తనను నా మాటలు అన్నట్టుగా దానికి జనార్ధన్ మరింత ఆజ్యం పోసి పోలీసులను మీడియాను పిలువు అన్నట్లుగా రఘురాంకు కల వస్తుంది. ఇదంతా చూసి రఘురాం తల్లికి గుండెపోటు వచ్చినట్లుగా కూడా అతనికి అనిపిస్తుంది. అయితే తీరా చూస్తే ఇదంతా కల అనే విషయం తెలుస్తుంది.

  డబ్బులు ఉన్నాయా? లేవా?

  డబ్బులు ఉన్నాయా? లేవా?

  అయితే అమ్మవారికి దండం పెట్టుకుని కుంటున్న సమయంలో సీత మనసులో ఈ డబ్బు దొరకాలని విపరీతంగా కోరుతూ ఉంటుంది అలా కోరుకుంటున్న సమయంలో శిల్ప అన్న కిషోర్ కనిపిస్తాడు. వెంటనే శైలు, సిరి ఇద్దరినీ తీసుకుని కిషోర్ ను వెతకడానికి వెళ్తారు. అయితే కిషోర్ అప్పటికే పురమాయించిన మనిషి అన్న డబ్బులు బ్యాగు మన దగ్గరే ఉంది కానీ వాళ్లు డబ్బులు అక్కడే ఉన్నట్లుగా హడావిడి చేస్తున్నారు అంటాడు. అదేంటి అయినా అసలు నాకు నీ మీద నమ్మకం పోతుంది, నువ్వు నిజంగా డబ్బులు దొంగతనం చేసి వచ్చావో లేకపోతే రాళ్ల్లు మళ్ళీ వెనక్కి తెచ్చావో నేను చూడాలని డబ్బులు ఉన్నాయో లేదో కారు లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ డబ్బులు కనిపిస్తాయి కానీ ఇంతలో కిషోర్ మనిషి కిషోర్ వెనక ఏదో చూసి భయపడి పారిపోతాడు.

  జడుసుకున్న కిషోర్

  జడుసుకున్న కిషోర్

  ఏమైందా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సీత, సిరి, శైలు ముగ్గురు కూడా అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. ఆ దెబ్బకి కిషోర్ మనిషి పారిపోగా కిషోర్ కూడా జడుసుకుంటాడు. ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ ముగించినట్లు చూపించారు. ఇక తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం మా నాన్న కూడా ఇందులో భాగస్వామి అయ్యారు కాబట్టి నన్ను క్షమించండి అని కుటుంబ సభ్యులను అడుగుతోంది శైలు, దానికి కుటుంబ సభ్యులు ఇందులో నీ తప్పేమీ లేదు కదా అయినా ఈ కష్టం నుంచి బయటపడ్డాం కదా ఇంకా ఎలాంటి బాధలు ఆలోచించవద్దు అంటారు.

  Bigg Boss 5 Telugu Beauty Hamida Exclusive Interview
  కిషోర్ ను పొడవబోయిన నాని

  కిషోర్ ను పొడవబోయిన నాని

  అయితే నాని కనబడడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ విషయం తెలిసి నాని కోపంగా మా ఇంటికి వెళ్ళాడు అని శిల్ప అంటుంది. ఎలా అయినా కిషోర్ గాడిని చంపేస్తాం అని కోపంతో వెళ్లాడని తనకు చాలా భయంగా ఉందని ఆమె అంటుంది. విషయం తెలుసుకుని సీత రఘురాం హుటాహుటిన దమయంతి ఇంటికి బయలు దేరి వెళతారు. అప్పటికే దమయంతి ఇంటికి చేరిన నాని కోపంగా వెళ్లి కిషోర్ చొక్కా పట్టుకుని హాల్ లోకి లాక్కొస్తాడు. కిషోర్ ఏదో చెప్పబోతున్నా సరే నీ మాట వినేది లేదు అంటూ అక్కడ ఉంచిన కత్తితో కిషోర్ ను పొడవబోతాడు, ఇంతలో సీత ఎంట్రీ ఇచ్చి గట్టిగా అరుస్తుంది.. తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే ఇలా కనిపిస్తోంది చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

  English summary
  Vadinamma Episode 673: Raghuram panics as he dreams about Janardhan humiliating his family. On the other hand, Kishore gets shocked after learning the truth about the exchanged bags.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X